చిరకాల వాంఛ నెరవేర్చారు

- A
- A+
- A++

ఈనాడు, హైదరాబాద్: తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు, రూ.1,056 కోట్ల మూలనిధితో ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో.. ఉద్యోగ, పింఛనుదారుల సంఘాల నేతలు మంగళవారం పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య, బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని వారు కొనియాడారు. 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలను పొందే విధంగా ఉద్యోగులు, పెన్షనర్లకు అవకాశం లభించడం నిజంగా వరమని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐకాస నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, పి.దామోదర్‌రెడ్డి(పీఆర్‌టీయూ), చావా రవి(యూటీఎఫ్), కె.వెంకటేశ్వర్లు(టీఎన్జీవో), ఉపేందర్‌రెడ్డి(టీజీవో), జి.సదానందగౌడ్(ఎస్టీయూ), దామోదర్‌రెడ్డి, ఉమాదేవి(పెన్షనర్ల సంఘం), వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్(రెవెన్యూ), గిరి శ్రీనివాస్‌రెడ్డి (సెక్రటేరియట్), ఖాదర్(ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సంఘం), టి.లక్ష్మణ్(ఎక్సైజ్), తెలంగాణ ఉద్యోగుల ఐకాస ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ(డిప్యూటీ కలెక్టర్ల సంఘం), ఎస్.రాములు, రమేష్ పాక, సీహెచ్ శ్రీనివాస్(తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్), బాణాల రాంరెడ్డి, వి.భిక్షం(తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్), డా.నిర్మల, ఎల్.దశరథ్(టీజీసీపీఎస్‌ఈయూ), గరికె ఉపేందర్‌రావు(జీపీవో), సుగంధిని (హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌డబ్ల్యూ), భూమేశ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతులు కల్పించండి: ట్రెసా
రెవెన్యూ శాఖలో సుమారు 150 మంది తహసీల్దార్లు 10-12 సంవత్సరాలకు పైగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని, దాంతో శాఖలో దిగువ స్థాయి అధికారుల ప్రమోషన్లు కూడా ఆగిపోయాయని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న తహసీల్దార్లకు అడ్‌హాక్ ప్రమోషన్లు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ శాఖలో దాదాపు 632 మంది ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్లను కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణ చేయాలని, 61ఏళ్లు పైబడిన వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని, చనిపోయిన వీఆర్‌ఏల వారసులకు కారుణ్య నియామకాలు కల్పించాలనిసీఎంకి ట్రెసా విజ్ఞప్తి చేసింది.

సీఎం దృష్టికి కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య
రాష్ట్రంలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యను తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని లచ్చిరెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు అన్ని రకాలుగా దోహదపడేలా ఆదర్శవంతమైన ఆరోగ్య, బీమా పథకాలను ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ ఉద్యోగుల పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఫీజుల నియంత్రణకు కమిటీ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
- పది పరీక్షలకు హాజరవుతున్నా.. అమ్మ చంకలో బిడ్డనే! ఈ చిత్రంలో అమ్మ చంకలో ఉన్న బాలిక పేరు సుమిత. పుట్టుకతోనే మూగ, వినికిడి లోపంతో బాధపడుతోంది. ఎత్తు 1.5 అడుగులు మాత్రమే.
- పసిపిల్లల హృదయాలయం కల్లాకపటం తెలియని పసి మనసులు.. హృద్రోగ సమస్యలతో తల్లడిల్లుతుంటే.. మేమున్నాం అంటూ అక్కున చేర్చుకుంటోంది సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్ అండ్ రీసెర్చ్.
- మీరే ప్రభుత్వానికి కళ్లు.. చెవులు సివిల్ సర్వీసెస్ అధికారులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అందించేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి హార్వర్డ్ వర్సిటీ రానుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
- అధికార గర్వంతో పేదల ఇళ్లు కూల్చారు భూదాన్ భూముల్లో నిర్మించిన ఇళ్లను కూల్చడంతో వీధినపడిన నిరుపేదల పక్షాన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని, అసెంబ్లీలోనూ గళం విప్పి ప్రభుత్వంతో కొట్లాడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
- ఎప్‌సెట్ రద్దు చేయాలి రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈఏపీసెట్ (ఎప్‌సెట్)ను రద్దు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
- నేరాలను ఆపేది చదువే! నేర ప్రవృత్తికి... అక్షరాస్యతకు మధ్య సంబంధం ఉందని చెబుతున్నాయి గణాంకాలు. రాష్ట్రంలో ఏటా సగటున 5 వేల మంది విచారణ ఖైదీలు, 2 వేల మంది శిక్ష పడ్డ ఖైదీలు జైళ్లకు వస్తున్నారు.
- కాళేశ్వరంలో భారాస అవినీతికి భాజపా సహకారం ‘కాళేశ్వరం సహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో దోచుకున్న సొమ్ములో కొంతైనా పాపపరిహారం కింద కేసీఆర్ పేదలకు పంచి ప్రజలను క్షమాపణ కోరాలి.
- న్యుమోనియాకు బిట్స్ హైదరాబాద్ ఆచార్యుల కొత్త టీకా! న్యుమోనియా నియంత్రణకు కొత్త టీకాను కనుగొన్నట్లు బిట్స్ హైదరాబాద్ ఆచార్యులు, పరిశోధకులు యోగేశ్వర్ దేవరకొండ, ఎం.వి.ఎన్. జనార్దన్‌రెడ్డి, అరుణిమ, కీర్తిమాన్ స్యాల్‌లు గురువారం తెలిపారు. ‘‘స్ట్రెప్టోకోకల్ న్యుమోనియా కట్టడికి ఏడాది నుంచి పరిశోధనలు చేస్తున్నా.
- ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇం‘ధనం’! రోజువారీ వినియోగ వస్తువుల ప్యాకేజింగ్ వ్యర్థాలను ఇంధనంగా మార్చే సాంకేతికతను హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక పరిశోధన సంస్థ ్బఐఐసీట్శీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
- కొండాపూర్ భూములపై స్టేటస్‌కో ఇవ్వం హైదరాబాద్ కొండాపూర్‌లోని సర్వే నం.59లో ఉన్న 57.09 ఎకరాల వివాదాస్పద భూమిపై స్టేటస్‌కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
- 8.68 లక్షల భూభారతి దరఖాస్తులు ఏమయ్యాయి?: హరీశ్‌రావు ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెవెన్యూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. భూభారతి పేరిట రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 8.68 లక్షల దరఖాస్తులు వచ్చినా.. పరిష్కారం కాలేదు’ అని శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.
- ఖనిజాల పరిశోధనలకు ఎన్‌ఎండీసీ, ఐఐటీ-హెచ్ భాగస్వామ్యం ఖనిజాల పరిశోధనల కోసం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)తో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఒప్పందం చేసుకుంది.
- ఇది పదాలు పలికించే ‘పలక’ తల్లి ఒడిని వదిలి అప్పుడప్పుడే బడిబాట పట్టే బాలలు భయం, బెరుకు లేకుండా... అలవోకగా అక్షరాలు, పదాలు నేర్చుకునేందుకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగారం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కేతావత్ తావుర్యానాయక్ ‘మైస్లేట్’ పేరుతో ప్రత్యేకంగా ఓ పలకను రూపొందించారు.
- అరుదైన ఖనిజాలపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలి: ఎన్‌సీఎంఎం నేటి ఆధునిక ప్రపంచంలో అరుదైన ఖనిజాలకు అధిక ప్రాధాన్యముందని, ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్(ఎన్‌సీఎంఎం) కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
- టీఎస్‌జీఆర్‌ఈఏ అధ్యక్షుడిగా పేరి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం(టీఎస్‌జీఆర్‌ఈఏ) అధ్యక్షుడిగా పేరి వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎంసీ లింగన్నలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- అగ్నిమాపక శాఖలోని సౌకర్యాలపై వివరణివ్వండి: హైకోర్టు విపత్తులను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖలో ఉన్న సౌకర్యాలు, వనరులు, పరికరాల స్థితిగతులపై వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- సంక్షిప్త వార్తలు కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, మాజీ ఎంపీ వి.హనుమంతరావులకు రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు.
- వసతులు లేవు.. అధ్యాపకులు లేరు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సగటున 72 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 80 శాతం డిగ్రీ కళాశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత వేధిస్తోంది.
- మహిళా సంఘాల్లోని 42 లక్షల మందికి 30 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు... గ్రామీణ మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన సహా పలు కార్యక్రమాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.