దోషులుగా ఎవరున్నా శిక్ష పడాల్సిందే

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 25 Feb 2026 03:52 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారని అన్ని నివేదికల్లో తేలినా, అందుకు బాధ్యులను గత ప్రభుత్వ ముఖ్యుడు ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావట్లేదని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. భగవంతుడి సొమ్ముతో ఆడుకున్నా, ఆ సొమ్ము దోచుకున్నా, వారి తరాలు కూడా లేచిపోతాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికైనా కల్తీని ఒప్పుకోవాలని, అలాకాకుండా దిల్లీ వెళ్లి కోర్టుల్లో కేసులు వేసేకొద్దీ మీ పాపం పెరిగి నాశనం త్వరగా వస్తుందే తప్ప, తగ్గదని వ్యాఖ్యానించారు. శాసనసభలో మంగళవారం కల్తీనెయ్యిపై లఘుచర్చలో పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో తితిదేలో 68 లక్షల కేజీల కల్తీనెయ్యి వాడారు. అందులో పందికొవ్వు ఉందని ఎన్‌డీడీబీ నివేదికలో వచ్చింది. సీబీఐ సిట్‌ కూడా రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి లేకుండా నెయ్యి తయారుచేశారని పేర్కొంది. అలాంటప్పుడు ఆ ముఖ్యనేత.. ‘నాకు సంబంధం లేదు, తితిదే బోర్డు అంతా చేసింది. దానిపై కమిటీ వేసి, నిష్పాక్షికంగా విచారణ జరిపి, శిక్షపడేలా చేయండి’ అని సింపుల్‌గా తేల్చేయవచ్చు. కానీ సిట్‌ నివేదిక వచ్చాక కూడా కల్తీ లేదంటున్నార’ని మండిపడ్డారు. దీనికి నాటి తితిదే పాలకమండలితో పాటు గత ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి కూడా బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. దోషులుగా ఎవరున్నా శిక్ష పడాల్సిందేనని స్పష్టంచేశారు. పవన్‌కల్యాణ్‌ ఇంకా ఏమన్నారంటే..

కుట్రలో భాగమే.. నిబంధనల సడలింపు

నెయ్యి సరఫరాదారులైన భోలేబాబా, మాల్‌గంగా, వైష్ణవీ డెయిరీలు ఒక్క లీటర్‌ పాలు కూడా లేకుండా పామాయిల్‌లో రసాయనాలు కలిపి నెయ్యి తయారు చేసినట్లు    సిట్‌ చెప్పింది. ఆ రసాయనాల్లో ఏమున్నాయో పెరుమాళ్లకు ఎరుక. 36 మందిని నిందితులుగా సిట్‌ తేల్చింది. ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళిక ప్రకారం కుట్ర జరిగింది. నెయ్యి సరఫరా టెండర్లు వారికి నచ్చిన సంస్థలకు    దక్కేలా నాటి తితిదే పెద్దలు ప్రణాళిక వేశారు. నిబంధనలన్నీ సడలించారు. 2019-24 మధ్య 11 కోట్ల మంది శ్రీవారిని దర్శించుకోగా, 48 కోట్ల లడ్డూలు అందించారు. వాటిలో 20 కోట్ల లడ్డూలు నకిలీనెయ్యితో తయారైనవేనని తితిదే రికార్డులు చెబుతున్నాయి.

ముఖ్యవ్యక్తే చేశారని అనలేదే!

నేనెక్కడా గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యవ్యక్తే ఇదంతా చేశారనలేదు. ఆ ప్రభుత్వం నియమించిన తితిదే పాలకమండలిది బాధ్యత అని చెప్పాను. వాళ్లను ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావడంలేదు.

పశ్చాత్తాపంతో దీక్ష చేశా

కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు ఎన్‌డీడీబీ నివేదికను చదివారు. నెయ్యిలో పందికొవ్వు కలిసినట్లు నివేదిక వచ్చిందన్నారు. దానిపై మీరెవరూ మాట్లాడరా అంటూ చాలామంది నన్ను ట్యాగ్‌ చేస్తూ మెసేజ్‌లు చేశారు. మరునాడు ‘సనాతన ధర్మరక్షణ బోర్డు లాంటిది ఉంటే బాగుంటుంది’ అని ట్వీట్‌ చేశాను. ప్రజాజీవితంలో ఉన్నందున ఒకరిని నిందించాలంటే చాలా ఆలోచించాను. గతంలో తిరుమలకు వెళ్లినప్పుడు ప్రసాదంలో నాణ్యతలేమిపై భక్తులు నాతో పంచుకున్న విషయాలు గుర్తుకొచ్చాయి. పశ్చాత్తాపంతో దీక్ష చేశాను’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 

‘రాజు కోసం డబ్బు వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారమివ్వకు. అలాంటివాడు వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా, దేవుడి ధనాన్ని రాజు ఖజానాకు చేరుస్తాడు. అది తప్పుడు పని. అందుకే ఎలాంటి మమకారాలు లేని ఒంటరివాడే ఆలయ అధికారిగా ఉండాలి. వాడు దేవుడి సొత్తు తింటే, ఆ పాపానికి వాడే పోతాడు. కానీ, వాడు ఆ సొమ్ము తెచ్చి రాజుకు ఇవ్వడం వల్ల ఆ రాజ్యమే నాశనమవుతుందని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలోని 218వ పద్యంలో రాశారు. దేవుడి సేవలో ఎలాంటివారిని నియమించాలో రాజుకు కర్తవ్యబోధ చేశారు’ అంటూ..

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 03:45 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఐటీఈపీ కోర్సుకు అనుమతి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐటీఈపీ)కోర్సు ప్రారంభానికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ) నుంచి అనుమతులు వచ్చాయని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ లావు రత్తయ్య, వర్సిటీ ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌ క్రిష్ణకిషోర్‌ సోమవారం తెలిపారు.
  • తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి అల్లు అర్జున్‌ అండ కాకినాడ జిల్లా వేట్లపాలెంలో గత నెల 28న బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలు కడింపల్లి దుర్గకు సినీ నటుడు అల్లు అర్జున్‌ అండగా నిలిచారు.
  • తెగిపడిన చేతిని అతికించిన ఎయిమ్స్‌ బృందం తెగిపడిన చేతితో వచ్చిన ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి అతికించిన అరుదైన ఘటన ఇది. ఇలాంటి శస్త్రచికిత్స రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళగిరి ఎయిమ్స్‌లో నిర్వహించినట్లు సోమవారం ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
  • ఇక్కడ చదువు.. ప్రకృతి ఒడిలో! విశాలమైన తరగతి గదులు, చెట్లతో ఆహ్లాదకరమైన వరండా, ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి తాకేలా ప్రత్యేక ఏర్పాట్లు.. ఇలా మరెన్నో వసతులతో నిర్మించిన ఈ పాఠశాలను చూడాలంటే నెల్లూరు రూరల్‌ మండలం కలివెలపాలేనికి వెళ్లాల్సిందే.
  • ఈ చొక్కా మాయదు.. తడవదు! నీరు పడినా తడవని.. దుమ్ములో వెళ్లినా మురికి పట్టని ఓ చొక్కా తిరుపతి రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌లో నూతనంగా ప్రారంభించిన బయో మిమిక్రీ గ్యాలరీలో ఆకట్టుకుంటోంది.
  • రూ.294 కోట్లతో కృష్ణానది వెంట రిటైనింగ్‌ వాల్‌ మంత్రి లోకేశ్‌ చొరవతో మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి.
  • తీరప్రాంతంలో 31% కోత.. 44% పెరుగుదల ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో తీరప్రాంతం 31% కోతకు గురికాగా, 44% పెరిగినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్‌సింగ్‌ తెలిపారు.
  • వైకాపా హయాంలో ఉపాధ్యాయులపై నమోదైన అక్రమ కేసు ఉపసంహరణ వైకాపా హయాంలో కాంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్‌) రద్దు చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు తెలిపిన ఉపాధ్యాయులపై అప్పట్లో బనాయించిన ఓ అక్రమ కేసును కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
  • 5 వేల మంది యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం రాష్ట్రంలోని ఐదు వేల మంది యువతను ఎంపిక చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కావాల్సిన శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం అందించనున్నట్లు భారతీయ యువశక్తి ట్రస్ట్‌ (బీవైఎస్‌టీ) మేనేజింగ్‌ ట్రస్టీ లక్ష్మీ వెంకటేశన్‌ తెలిపారు.
  • రాష్ట్ర విభజన తర్వాత 274 ఎంయూల గరిష్ఠ విద్యుత్‌ వినియోగం నమోదు రాష్ట్ర విభజన తర్వాత ఈ నెల 7న గరిష్ఠ విద్యుత్‌ వినియోగం 274.6 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ)గా నమోదైంది. వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదల నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ఠంగా 280 ఎంయూలకు చేరే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేస్తోంది.
  • ఏకసభ్య కమిషన్‌ ముందుకు సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీ? శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ విచారణ ముమ్మరం చేసింది.
  • ఐఆర్‌ఆర్‌ కేసులో ఆళ్ల వ్యాజ్యాలకువిచారణార్హత లేదు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసు విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల (ఎంపీ, ఎమ్మెల్యేల) ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదని సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ హైకోర్టుకు నివేదించారు.
  • ఆ రోజు కస్టడీలో ఏం జరిగింది? ‘అప్పట్లో ఎంపీగా ఉన్న ప్రస్తుత స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టడీలో ఉంచినప్పుడు సీఐడీ కార్యాలయంలో ఏం జరిగింది? ఆ రోజు ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏయే విధులు నిర్వర్తించారు? రాత్రి 10.30 నుంచి తెల్లవారుజామున 1.30 గంటల వరకు మీరేం చేశారు?..
  • సర్పంచి భర్త వైకాపా నేత కావడంతో అక్రమాలపై చర్యలు తీసుకోని అధికారులు ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీలో రూ.1.21 కోట్ల నిధుల అవకతవకలకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
  • విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుల్లో మార్పులు విశాఖపట్నం, విజయవాడలో మెట్రోరైల్‌ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు సూచించింది. విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది మార్గంలో డబుల్‌ డెక్కర్‌ కంటే జాతీయ రహదారి మధ్యలో నుంచి కారిడార్‌ నిర్మించి మెట్రోరైల్‌ నడపడం మేలని రాష్ట్రానికి లేఖ రాసింది.
  • యోగా, నేచురోపతి సలహాదారు మంతెనకు క్యాబినెట్‌ హోదా రాష్ట్ర ప్రభుత్వ యోగా, నేచురోపతి గౌరవ సలహాదారుగా నియమితులైన డాక్టర్‌ మంతెన సత్యనారాయణరాజుకు క్యాబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
  • సైకిల్‌పై సోగ్గాడు.. వందేళ్ల కుర్రాడు..! పేరు వంగా రామలింగారెడ్డి. వయసు 98 ఏళ్లు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి స్వస్థలం. 17 జూన్‌ 1928లో జన్మించారు. వయసు వందేళ్లకు చేరువవుతున్నా కుర్రాడిలాగే ఉంటారు.
  • మదనపల్లె దస్త్రాల దహనం కేసులో మాజీమంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు చుక్కెదురు మదనపల్లె రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో  నిందితులుగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వంకిరెడ్డి మాధవరెడ్డి (ఏ-3), వ్యక్తిగత సహాయకుడు బల్లాపురం మునితుకారాంలకు(ఏ-4) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
  • ‘రాయలసీమ ఉద్యాన హబ్‌’పై ముందడుగు రాయలసీమ ఉద్యాన హబ్‌పై మరో మూడు రోజుల్లో కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అధికారులతో భేటీ ఉంది.
  • హైకోర్టులో మహిళా దినోత్సవ వేడుకలు హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు సోమవారం హైకోర్టులో ఘనంగా నిర్వహించారు.