శ్రీవారి ప్రతిష్ఠ దెబ్బతీసే కుట్ర

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 25 Feb 2026 03:46 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

2017లో శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్‌  డిక్లరేషన్‌పై సంతకం చేయలేదు. పార్టీ అధినేత కాబట్టి.. నా ఇష్టం అనే అహంభావంతో, దౌర్జన్యంగా వ్యవహరించారు.

వైకాపా హయాంలో తితిదే ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్‌ చేతపట్టుకుని తిరిగారు. మెదక్‌ చర్చిలో కుమార్తెకు వివాహం చేసిన కరుణాకరరెడ్డికీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. ఇదంతా శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగమే.

భక్తులంతా ఏడుకొండలవాడా అని స్మరిస్తూ కొండెక్కుతారు. కానీ రాజశేఖరరెడ్డి తిరుమల రెండు కొండలే అని ఉత్తర్వులిప్పించారు. అప్పుడు పంచాయతీరాజ్‌ కార్యదర్శి శామ్యూల్‌.. దేశవ్యాప్తంగా ఆందోళన రావడంతో మళ్లీ ఏడుకొండలుగా మార్చారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడే ఎస్వీ యూనివర్సిటీ కాలేజీకి దేవసంగీతం అనే వ్యక్తిని ప్రిన్సిపల్‌గా నియమిస్తే.. ఆయన అక్కడ శ్రీవారి విగ్రహానికి రోజూ పూలమాలలు వేయడం నిలిపేశారు. పద్మావతి విశ్వవిద్యాలయ వీసీగా నియమితులైన వీణా నోబుల్‌దాస్‌ అక్కడ వేంకటేశ్వరస్వామి ఫొటో తీసేసి జీసస్‌ ఫొటో పెట్టుకున్నారు. ఈ సంస్థలకు తితిదే నిధులిస్తుంది.’

వైకాపా ఐదేళ్ల పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కృత్రిమ నెయ్యి లాంటి పదార్థాన్ని ఉపయోగించి వేంకటేశ్వరస్వామి పవిత్రతనే దెబ్బతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో జంతుకొవ్వు కలిసిందని న్యాయస్థానంలో సిట్‌ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ 35వ పేజీలో స్పష్టంగా ఉందని వివరించారు. ‘నెయ్యే కాని నెయ్యి వినియోగించడం అనేది ఒక అంశమే. దీని వెనుక శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీయాలనే పెద్ద కుట్రకోణమే ఉంది. రాజశేఖరరెడ్డి హయాం నుంచే ఇది మొదలైంది. వైకాపా పాలనలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ నుంచి నేతల వరకు ఆ అరాచకాలను కొనసాగించారు’ అని దుయ్యబట్టారు. ‘సిట్‌ నివేదికకు అనుగుణంగా అధికారులపై చర్యలు తీసుకున్నాక ప్రభుత్వం మౌనంగా ఉంది. అయితే తప్పు చేసిన వైకాపా నేతలు.. మమ్మల్నే క్షమాపణ చెప్పాలంటున్నారు. నీతి, నిజాయతీ కలిగిన మమ్మల్ని దోషులుగా చూపాలని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. నాలుగు రోజులు శాసనమండలిలో గొడవ చేశారు. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపైనా చర్చించకుండా అడ్డుపడ్డారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో మంగళవారం కల్తీ నెయ్యి వ్యవహారంపై లఘుచర్చలో చంద్రబాబు మాట్లాడారు. దీనిపై సమగ్ర ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నాటకాలు ఆపండి, పవిత్రత కాపాడండి. దేవాలయాల జోలికి రావద్దు.. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు’ అని వైకాపా నేతల్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం 94% స్ట్రైక్‌రేట్‌తో గెలిచి అధికారంలోకి వచ్చిందంటే దానికి వేంకటేశ్వరస్వామి కృపే కారణమని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

హిందూ ధర్మాన్ని హేళన చేశారు 

  • 2019-24 మధ్య వైకాపా నేతలు ఎన్నో కుట్రలు చేశారు. రాష్ట్రంలో 2,032 దేవాలయాలపై దాడులు జరిగాయి. 32 విగ్రహాలను అపవిత్రం చేశారు. 59 విగ్రహాలు చోరీ అయ్యాయి. అయినా కేసులు నమోదుచేయలేదు. పిచ్చివాళ్ల చేష్టలు, వీధికుక్కలు చేశాయి, గుప్తనిధుల వేట అని తేలిగ్గా తీసుకున్నారు. విగ్రహమే కదా.. ఏముంది అంటూ చులకనగా మాట్లాడారు.  
  • వైకాపా హయాంలో తిరుమల-తిరుపతి బస్సు టికెట్లపై ‘తక్కువ ఖర్చు, అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకు పవిత్ర జెరూసలెం యాత్ర’ అని ముద్రించి అన్యమత ప్రచారానికి పాల్పడ్డారు. 
  • 2018లో పింక్‌ డైమండ్‌ చోరీ అయిందని, అది మా ఇంట్లో ఉందని ప్రచారం చేశారు. అప్పుడే వారిని పట్టుకొచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కానీ మేం ప్రజాస్వామ్యయుతంగా వెళ్లాలని రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశాం. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ కేసు విత్‌డ్రా చేసుకున్నారు. మళ్లీ మేం వ్యక్తిగతంగా ఇంప్లీడ్‌ అయి పోరాడుతున్నాం.
  • తితిదే బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. వైకాపా హయాంలో 2021లో 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమించారు. మొత్తం 85 మందితో జంబో బోర్డు ఏర్పాటుచేశారు. హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. (నేనే ఫైట్‌ చేశాను అని సభాపతి స్థానంలో ఉన్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు చెప్పగా.. చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు)
  • పవిత్రమైన పరకామణిలో చోరీ జరిగితే లోక్‌అదాలత్‌కు పంపి రాజీ చేశారు. చాలా చిన్న నేరమని.. తీసుకున్నదాని కంటే ఎక్కువ మొత్తం, తన సొంత సొమ్మును శ్రీవారికి దానం చేశారని జగన్‌ చులకనగా మాట్లాడారు. 

ఇందాపూర్, హెరిటేజ్‌ మధ్య.. నెయ్యి సంబంధమే లేదు

  • హెరిటేజ్‌ రోజూ 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలైనా, దేవాలయాలైనా హెరిటేజ్‌ నుంచి ఉత్పత్తులు సరఫరా చేయడానికి వీల్లేదని గతంలో నిర్ణయించుకున్నాం. అదే అమలుచేస్తున్నాం.
  • ఇందాపూర్‌ డెయిరీ దేశంలో వివిధ సంస్థలకు ఉత్పత్తులు తయారుచేసి ఇస్తుంది. మదర్‌ డెయిరీ, బ్రిటానియా, హిందూస్థాన్‌ యునిలీవర్, ఆయుర్వేద ఘీ, పతంజలి, డీమార్ట్, రిలయన్స్, దొడ్ల, హేట్సన్, టాటా, జీఆర్‌బీ, అమూల్, హెరిటేజ్‌ తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి.
  • హెరిటేజ్‌కు చీజ్, యూహెచ్‌టీ, ఎస్‌ఎన్‌పీ ఉత్పత్తులు మాత్రమే ఇందాపూర్‌ డెయిరీ తయారు చేస్తోంది. నెయ్యితో సంబంధం లేదు. కానీ తిరుమల నెయ్యికి హెరిటేజ్‌కు ముడిపెట్టి వైకాపా దుష్ప్రచారం చేస్తోంది.

తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టాం

  • కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో లడ్డూ, ఆహారపదార్థాల తయారీకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ధ్రువీకరించిన ఉత్పత్తులు సేకరిస్తున్నాం. నాణ్యత దెబ్బతినకుండా చూస్తున్నాం. ఇందుకు ఏఐని కూడా ఉపయోగిస్తున్నాం.
  • అన్నప్రసాదం తయారీలో పాతదిట్టం వ్యవస్థను తిరిగి అమల్లోకి తెస్తున్నాం. నాణ్యత, రుచిపై ప్రత్యేకదృష్టి పెట్టాం. దీనిపై భక్తులూ సంతోషంగా ఉన్నారు
  • క్యూలైన్ల సమీపంలో 24 గంటలూ భక్తులకు పాలు అందిస్తున్నాం. అదనంగా 23 ఆహార కౌంటర్లు ఏర్పాటుచేశాం. ఆధునిక వసతులతో వంటశాల అందుబాటులోకి తెచ్చాం. 
  • బ్రేక్‌ దర్శనాల నియంత్రణతో సాధారణ భక్తులకు దర్శన సమయం పెంచాం. 
  • ప్రతి 25 మంది పోటు కార్మికులకు ఒక సూపర్‌వైజర్‌ చొప్పున పోస్టులు మంజూరు చేస్తున్నాం. 

ఏ కష్టమొచ్చినా వెంకన్నకే చెప్పుకొంటా

48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. 2028 నాటికి 50 ఏళ్లు అవుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి మా కులదైవం. నాకు ఏ కష్టం ఉన్నా ఆయనకు చెప్పి ముందుకు సాగుతా. మంచి మనసివ్వాలని, మంచి పని చేసేలా ఆశీర్వదించాలని రోజూ 2 నిమిషాలు స్వామివారి పటం ముందు ప్రార్థిస్తా.

పాదరక్షలు విడిచి ప్రసంగించిన చంద్రబాబు

కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో మాట్లాడే ముందు సీఎం చంద్రబాబు పాదరక్షలు విడిచారు. తర్వాతే ప్రజంటేషన్‌పై మాట్లాడారు. ప్రసంగం పూర్తయ్యాక మళ్లీ పాదరక్షలు ధరించారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 03:42 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ద్వారకా తిరుమలలో కట్టెల పొయ్యిపై వంటలు గ్యాస్‌ కొరత కారణంగా ద్వారకా తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం విభాగంలో శనివారం కట్టెల పొయ్యిలపై వంటలు ప్రారంభించారు.
  • వాట్సప్‌ నుంచే ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్ట్రేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పౌర సహాయక సేవ వ్యవస్థ ‘మన మిత్ర’ వాట్సప్‌ నంబర్‌ 9552300009 ద్వారా ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
  • కష్టాన్ని మీ గుమ్మం తాకనివ్వం ‘మీరు ఓట్లు వేశారా లేదా అన్నది చూడలేదు. పార్టీ చూడలేదు. మీ అందరినీ మా అన్నదమ్ములు, ఆడపడుచులుగా చూశాం. మీరు బాగుండాలి. సమస్యలతో మీరు ఇబ్బంది పడకూడదు.
  • కల్తీని కట్టడి చేసే సిబ్బంది ఏరి? రాష్ట్రంలో ఇటీవల ఆహార కల్తీ ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తినే పదార్థాలు అసలువో, నకిలీవో తెలుసుకోలేని సామాన్యులు బలి అవుతున్నారు.
  • పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,500 కోట్లు! పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మూడో విడత నిధులు రూ.1,508 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5,936 కోట్లు కేటాయించింది.
  • చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనలో నిందితులకు హైకోర్టు షాక్‌ వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబును అంతమొందించాలన్న ప్రణాళికతో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో రాళ్లదాడికి పాల్పడిన మొదటి నలుగురు నిందితులకు హైకోర్టు షాకిచ్చింది.
  • ప్రవాసాంధ్రులకు అండ.. జయరామ్‌ ‘తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని ఏ ప్రాంతం నుంచి అమెరికాకు వెళ్లినవారికైనా ఏదైనా సమస్య వచ్చిందంటే అండగా నిలబడి పరిష్కరించే వ్యక్తి.. కోమటి జయరామ్‌.
  • ధర్మజ్యోతి పురస్కారం.. సమాజసేవకు ప్రేరణ ‘అభివృద్ధి అంటే ఆర్థిక పురోగతి, సాంకేతికాభివృద్ధి అంటాం.. నిజమైన అభివృద్ధి అంటే మానవ విలువలు కూడా అదే స్థాయిలో పెరగడం. ప్రతి ఒక్కరికీ సమాజంలో బాధ్యత ఉంది.
  • వన్య ప్రాణులకు ‘టీకా’ కవచం థాయిలాండ్‌లోని జంతు ప్రదర్శనశాలలో రోజుల వ్యవధిలో 72 పులులు మరణించిన విషయం కొన్నాళ్లక్రితం బయటకు వచ్చింది.
  • గుత్తేదార్ల కోసమే ‘ఉపాధి’లో మార్పు: షర్మిల దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి వెచ్చించే రూ.80 వేల కోట్లను గుత్తేదార్లకు దోచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.
  • ఇది ఏసీ ట్రాక్టర్‌ గురూ! మధ్యాహ్న వేళ ఏసీ క్యాబిన్‌ ట్రాక్టర్‌లో రయ్‌మంటూ వెళ్లిపోతున్న ఈయన పేరు శ్రీనివాసరావు.
  • స్వీయ క్రమశిక్షణతోనే ఎదుగుదల మెరుగైన భవిష్యత్తు కోసం నిజాయతీ, దయాగుణం, గౌరవం, ధైర్యం, కృతజ్ఞత అనే ఐదు కీలకాంశాలతో ముందుకు సాగాలని మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శైలజాకిరణ్‌.. విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు.
  • ఎండల తీవ్రతపై ‘అవేర్‌’ ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
  • బోటు.. మేడిన్‌ కాకినాడ ఎట్టకేలకు కాకినాడలోని బోటు నిర్మాణ యార్డులో తొలి బోటు సిద్ధమైంది. దాన్ని కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు శనివారం ప్రారంభించారు.
  • తిరుమలకు పోటెత్తిన భక్తులు అలిపిరిలో ట్రాఫిక్‌ జాం అసలే వారాంతం.. ఆపై వరుస సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా చేరుకుంటున్నారు.
  • కాణిపాకం ఆలయానికి కొత్త పుష్కరిణి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి గుడికి కొత్తగా కోనేరు నిర్మించాలని ఆలయ పాలకమండలి నిర్ణయించింది.
  • భక్తిశ్రద్ధలతో అలిపిరి మార్గంలో మెట్లోత్సవం తిరుమలేశుడి పరమభక్తుడైన తాళ్లపాక అన్నమాచార్య 523వ వర్ధంతి సందర్భంగా శనివారం తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద మెట్లోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
  • రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉత్సాహంగా గ్లో రన్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో సినీ మ్యాజికల్‌ గ్లో రన్‌ శనివారం సందడిగా కొనసాగింది. 10కే, 5కే, 3కే విభాగాల్లో వేల మంది ఔత్సాహికులు పాల్గొన్నారు.
  • సీతారాముల కల్యాణంపై నవీముంబయిలో చాగంటి ప్రవచనం నవీముంబయిలో అక్కడి తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రవచనానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
  • భట్టి కుమారుడు, కోడలికి చంద్రబాబు ఆశీస్సులు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు, కోడలిని ఏపీ సీఎం చంద్రబాబు ఆశీర్వదించారు.