
అదే మూలం.. నిర్లక్ష్యం వద్దు..!
చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో ఒక్కోసారి అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు.

- A
- A+
- A++

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు.
ఏటా లక్షల మంది!
⚛ ఓ అధ్యయనం ప్రకారం.. సరిగ్గా చేతులు కడుక్కోకపోవడం వల్ల ఏటా సుమారు 14 లక్షల మంది వివిధ అనారోగ్యాలతో ప్రాణాలు కోల్పోతున్నారట.
⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెళతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి.
⚛ ఇక మొబైల్, టీవీ రిమోట్, డైనింగ్ టేబుల్, తలుపులు, కిటికీలపై కూడా వ్యాధికారక క్రిములుంటాయి. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకుంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ.
⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు.

చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ!
⚛ చిన్నారులు, స్కూలుకు వెళ్లే పిల్లల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల చేతులు శుభ్రంగా లేకపోతే వారికి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
⚛ పిల్లల చేతులు పరిశుభ్రంగా ఉంచడం వల్ల 10 మంది చిన్నారుల్లో కనీసం నలుగురు చిన్నారులను డయేరియా లాంటి వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 12:58 IST