రంజీ ట్రోఫీ ఫైనల్.. రెండో రోజూ దుమ్మురేపిన జమ్ముకశ్మీర్ బ్యాటర్లు

Eenadu icon
By Sports News Team Updated : 25 Feb 2026 19:59 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్‌లో జమ్ముకశ్మీర్ బ్యాటర్లు దుమ్మురేపారు. రెండో రోజు ఆట ముగిసేసరికి జమ్ముకశ్మీర్ ఆరు వికెట్ల నష్టానికి 527 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు నమోదు కావడం గమనార్హం. కర్ణాటక బౌలర్లు ఎంత శ్రమించినా ఆలౌట్‌ చేయలేకపోయారు. ప్రస్తుతం క్రీజ్‌లో సాహిల్ లోత్రా (57*), అబిద్ ముస్తాక్ (20*) ఉన్నారు. వర్షం రావడంతో ఇవాళ గేమ్‌ ముందుగానే ముగిసింది. 

రంగంలోకి కెప్టెన్..

ఓవర్‌నైట్ 284/2 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన జమ్ముకశ్మీర్‌కు స్వల్ప వ్యవధిలో షాక్‌ తగిలింది. శుభమ్ పుందిర్ (121), అబ్దుల్ సమద్ (61)ను కర్ణాటక బౌలర్లు త్వరగానే పెవిలియన్‌కు పంపారు. అదొక్కటే కర్ణాటకకు ఈ రోజు గేమ్‌లో ఊరట. తొలి రోజు రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్‌కు వెళ్లిన కెప్టెన్ పరాస్ డోగ్రా (70) క్రీజ్‌లోకి వచ్చాడు. అతడితోపాటు కన్హియా వాదవాన్ (70) కర్ణాటక బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 110 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. కన్హియా ఔటైనా అనంతరం వచ్చిన సాహిల్‌ లోత్రా మాత్రం పట్టువదల్లేదు. పరాస్‌-లోత్రా కలిసి 54 పరుగులను జోడించారు. ఆట మరో గంటలో ముగుస్తుందనగా పరాస్‌ను శ్రేయస్‌ గోపాల్ బౌల్డ్ చేసి కర్ణాటకకు కాస్త ఊరటనిచ్చాడు. అయితే, అబ్దుల్ ముస్తాక్‌తో కలిసి లోత్రా మరో వికెట్ పడనీయకుండా రోజును ముగించాడు. అప్పటికే వీరిద్దరూ హాఫ్‌ సెంచరీ పార్టనర్‌షిప్‌ నిర్మించారు.

ఢీ అంటే.. ఢీ

రంజీ ట్రోఫీ ఫైనల్‌లో కర్ణాటక, జమ్ము కశ్మీర్ జట్ల ఆటగాళ్ల మధ్య కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్ము కెప్టెన్ పరాస్ డోగ్రా బ్యాటింగ్‌ చేస్తుండగా.. షార్ట్‌లెగ్‌లో ఉన్న కర్ణాటక ఫీల్డర్ అనీశ్ స్లెడ్జింగ్‌ చేయడం మొదలెట్టాడు. ఓ దశలో పరాస్ తన సహనాన్ని కోల్పోయి హెల్మెట్ ధరించిన అనీశ్‌ను తన తలతో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది.  అంపైర్లు జోక్యం చేసుకుని సర్దిజెప్పారు. ఆ తర్వాత కర్ణాటక బౌలర్ వైశాఖ్‌, బ్యాటర్ కన్హియా మధ్య కాస్త ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ.. అంపైర్లు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. దీనిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. కెప్టెన్ పరాస్‌కు 50 శాతం జరిమానాను విధించింది.


► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 17:45 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మయాంక్‌పై అప్‌డేట్.. రహానేకు ఫైన్.. నల్ల రిబ్బన్లతో ప్లేయర్స్ చెపాక్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే అద్భుత విజయం.. కోల్‌కతా కెప్టెన్‌కు జరిమానా.. లఖ్‌నవూ స్టార్ పేసర్‌ మాయంక్‌ యాదవ్‌పై అప్‌డేట్‌తో ఐపీఎల్ విశేషాలు ఇవీ..
  • సాకులు చెప్పం.. నాతో సహా మెరుగుపడాల్సిందే: రుతురాజ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఓ విషయంలో మాత్రం ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ఆ జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ కూడా వెల్లడించాడు.
  • చెన్నై.. మళ్లీ కొట్టింది హ్యాట్రిక్‌ ఓటములతో ఐపీఎల్‌-19ను పేలవంగా ఆరంభించిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. కొంచెం ఆలస్యంగా జోరందుకుంది. గత మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించిన సీఎస్కే.. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అలవోకగా గెలిచింది.
  • షూ కూడా కొనలేని స్థితి నుంచి.. మొన్నటి సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ తర్వాత రాత్రికి రాత్రి స్టార్లు అయిపోయారు.. ప్రఫుల్‌ హింగే, సకిబ్‌ హుస్సేన్‌. ఈ ఇద్దరూ తలో నాలుగు వికెట్లతో రాయల్స్‌ ఓటమిని శాసించారు. ప్రఫుల్‌ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్‌ నడ్డి విరిస్తే.
  • ఆయుష్‌ అదరహో.. కొంతకాలంగా ఆ యువ షట్లర్‌ తన నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మంచి భవిష్యత్తున్న వర్ధమాన ఆటగాడిగా భారత బ్యాడ్మింటన్‌ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ప్రదర్శనతో అతడి పేరు మార్మోగుతోంది.
  • సూర్య భవితవ్యంపై చర్చ కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను విజయపథంలో నడిపించినప్పటికీ బ్యాటుతో పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
  • ఐర్లాండ్‌ పర్యటనకు వైభవ్‌! ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్న వైభవ్‌.. జూన్‌ 26న ప్రారంభంకానున్న ఐర్లాండ్‌ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
  • ఉత్తమ ప్లేయర్లుగా అభిషేక్, దీప్తి 2026 విజ్డెన్‌ అవార్డుల్లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. మొత్తం 9 పురస్కారాల్లో ఏడు భారత క్రికెటర్లకు లభించాయి. భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా ఎంపికవగా..
  • టైటిల్‌కు చేరువలో వైశాలి క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న వైశాలి టైటిల్‌కు చేరువైంది. అగ్రస్థానంలో ఉన్న ఆమె ఆఖరి రౌండ్లో నెగ్గితే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం పోటీపడే అవకాశం లభిస్తుంది.
  • సంక్షిప్త వార్తలు(3) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మదుశంక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమైన ఇంగ్లాండ్‌ పేసర్‌ బ్రైడన్‌ కార్స్‌ స్థానంలో ఎడమచేతి వాటం బౌలర్‌ మదుశంకను జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్‌ మంగళవారం ప్రకటించింది.
  • బోల్ట్‌ను మించిన వేగం పరుగు అనగానే గుర్తుకొచ్చే పేరు.. ఉసేన్‌ బోల్ట్‌. ఓ దశాబ్దం పాటు ప్రపంచ అథ్లెటిక్స్‌లో అతను సాధించిన ఆధిపత్యం ఒక చరిత్ర. అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేయడమే కాదు.. భవిష్యత్తులో బద్దలు కావేమో అనిపించే స్థాయి రికార్డులు నెలకొల్పిన ఘనుడతడు.
  • కేకేఆర్‌పై చెన్నైదే విజయం చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  చెన్నై సూపర్‌ కింగ్స్‌ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్‌.. కమిన్స్‌ వచ్చేదప్పుడే..! Pat Cummins: పాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టుతో చేరే అవకాశం కనిపిస్తోంది. 
  • కోల్‌కతా బోణీ కొడుతుందా? ఈసారీ చెపాక్‌ చెన్నైదేనా..? CSK vs KKR: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు నేడు జరగనుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మంగళవారం రాత్రి చెపాక్‌ స్టేడియం వేదికగా తలపడనున్నాయి.
  • సకిబ్ హుస్సేన్.. అమ్మ నగలు అమ్మి బూట్లు కొన్న స్థితి నుంచి.. కుటుంబ ఆర్థిక కష్టాలను దగ్గర్నుంచి చూసిన అతడు.. ఏదొక పని చేసి ఆదరవుగా ఉందామని భావించాడు. క్రికెటర్‌గా కొద్దిమొత్తం సంపాదించి చేదోడువాదోడుగా నిలిచాడు. ఇప్పుడు 
  • ప్రఫుల్ హింగే.. గంటల్లోనే 3 వేల నుంచి 3 లక్షలకు ఫాలోవర్స్‌! సంచలన ప్రదర్శన చేస్తే రివార్డు ఎలా ఉంటుందో ప్రఫుల్ హింగేను చూస్తే అర్థమైపోతుంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం అతడి సోషల్ మీడియా ఖాతా ఫాలోవర్లు భారీగా పెరిగిపోయారు.
  • అక్క చెక్కిన ‘పేస్‌ గుర్రం’.. ప్రఫుల్‌ హింగే ఎందులోనైనా ఉన్నత స్థానాలకు వెళ్లడం మన చేతుల్లోనే ఉంటుంది. అయితే, కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఉంటే టాలెంట్‌కు పదును పెట్టేందుకు మరింత వీలవుతుంది.
  • అదే జరిగితే.. వైభవ్‌ సూర్యవంశీదే కొత్త చరిత్ర వైభవ్‌ సూర్యవంశీ భారత జట్టులోకి వచ్చే శుభఘడియలు దగ్గరపడ్డాయి. ఐపీఎల్‌ ముగిసిన కొన్ని రోజులకే అతడిని టీమ్‌ఇండియా జెర్సీలో చూసే అవకాశం ఉంది.
  • మా కుర్రాళ్ల సత్తా తెలిసింది.. అందుకే కీపింగ్‌ చేయలేదు: ఇషాన్ కిషన్ యువ బౌలర్లతో బరిలోకి దిగి అద్భుతమైన ఫలితాన్ని రాబట్టాడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్ ఇషాన్ కిషన్. రాజస్థాన్‌కు ఈ సీజన్‌లో తొలి ఓటమిని రుచి చూపించాడు.
  • తొలి బంతికే ఔట్ చేస్తానని ముందే చెప్పా: ప్రఫుల్ హింగే వైభవ్‌ సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేస్తానని ముందే కొందరికి చెప్పినట్లు ప్రఫుల్ హింగే వెల్లడించాడు.