మదుపర్ల ప్రాఫిట్ బుకింగ్.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

- A
- A+
- A++

ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి (Stock Market Toady). అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూశారు. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగారు. దీంతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి.
క్రితం సెషన్‌లో భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ (నిన్నటి ముగింపు 82,225).. నేటి ట్రేడింగ్‌లో కోలుకుంది. ఉదయం 82,530 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 800 పాయింట్ల మేర ఊగిసలాటకు గురైంది. ఇంట్రాడేలో 82,957 గరిష్ఠానికి.. 82,132 కనిష్ఠానికి చేరింది. చివరకు 50 పాయింట్ల స్వల్పలాభంతో 82,276 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 25,482 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.95వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఆదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు రాణించగా.. రిలయన్స్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ నష్టాలను చవిచూశాయి.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 16:07 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- హోర్ముజ్ జలసంధి వద్ద ట్రాఫిక్ జామ్.. 700లకు పైగా ట్యాంకర్లు అక్కడే..! Strait Of Hormuz: ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి లాంటి హోర్ముజ్ జలసంధిలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇవి చెక్ చేసుకోండి! నివాసం ఉండేందుకు లేదా పెట్టుబడి, అద్దె ఆదాయం కోసం చాలా మంది ఇల్లు కొనుగోలు చేస్తారు.
- వెండి ధర తగ్గింది యుద్ధభయాలతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు సోమవారం తొలుత బాగా పెరిగినా, రాత్రి సమయానికి మళ్లీ దిగివచ్చాయి.
- యుద్ధమక్కడ.. నష్టమిక్కడ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేస్తోంటే.. ప్రతిగా ఇరాన్ సైతం అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది.
- బెంబేలెత్తించిన ముడి చమురు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమై, ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో మదుపర్ల సెంటిమెంటు తీవ్రంగా దెబ్బతింది. దీంతో అమ్మకాలకు దిగారు.
- కరెంటు ఖాతా లోటు పెరిగింది దేశ కరెంటు ఖాతా లోటు డిసెంబరు త్రైమాసికంలో 13.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.19 లక్షల కోట్లు)గా నమోదైంది. ఇది జీడీపీలో 1.3 శాతానికి సమానం.
- 3 నెలల కనిష్ఠానికి ఐఐపీ మన దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి ఈ ఏడాది జనవరిలో నెమ్మదించి, 3 నెలల కనిష్ఠమైన 4.8 శాతానికి పరిమితమైంది. తయారీ, గనుల రంగాల బలహీన పని తీరు ఐఐపీని ప్రభావితం చేసింది.
- రూ.3.12 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు ‘హైదరాబాద్ కేవలం టెక్నాలజీ సేవలు అందించే స్థాయి నుంచి, ప్రపంచస్థాయి ఆవిష్కరణలు సృష్టించే కేంద్రంగా (గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్) మారుతోంది
- బెట్టింగ్‌లను ప్రోత్సహించలేదు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేత, బెట్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలను ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఖండించింది.
- మెటాలిక్ బ్లాక్‌లో యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 యమహా మోటార్ ఇండియా తన ఎక్స్‌ఎస్‌ఆర్ 155 మోటార్ సైకిల్‌ను మెటాలిక్ బ్లాక్ రంగులో విడుదల చేసింది. దీని ధరను రూ.1,58,990 (దిల్లీ ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది.
- సంక్షిప్తవార్తలు (11) శ్రీరామ్ ట్విస్టెక్స్ షేరు సోమవారం స్టాక్ మార్కెట్‌లో నమోదైంది. ఇష్యూ ధర రూ.104తో పోలిస్తే, బీఎస్‌ఈలో 32.69% నష్టంతో రూ.70 వద్ద ఈషేరు ట్రేడంగ్ ప్రారంభమైంది.
- ఐఫోన్ 17ఇ వచ్చేసింది యాపిల్ సంస్థ కొత్తగా ఐఫోన్ 17ఇ ని ఆవిష్కరించింది. సరికొత్త ఏ19 చిప్‌సెట్, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, మ్యాగ్‌సేఫ్ సపోర్ట్ కలిగిన ఈ ఫోన్‌కు 17 శ్రేణిలో తక్కువ ధర నిర్ణయించారు.
- తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (02/03/2026) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..
- ఈపీఎఫ్ వడ్డీ రేటు.. ఈసారీ 8.25 శాతమే EPFO Interest Rate: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)పై ఇచ్చే వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) 8.25 శాతంగా కొనసాగించాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది.
- కెనడా ప్రధానికి ముకేశ్, నీతా అంబానీ ఆతిథ్యం Ambani family: భారత్ పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
- మార్కెట్లకు యుద్ధ భయాలు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, తదనంతర పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి.
- వార్ ఎఫెక్ట్: రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు Gold price today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
- భగ్గుమన్న చమురు ధరలు.. ఒక డాలర్ పెరిగితే భారత్‌పై భారమెంతో తెలుసా..? Oil prices: ఇంధన ధరలు 10 శాతం మేర పెరిగాయి.
- స్పామ్ మెసేజ్‌లు అరికట్టేందుకు ఎయిర్‌టెల్, గూగుల్ భాగస్వామ్యం సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్)లో స్పామ్‌ను అరికట్టేందుకు ఏఐ (కృత్రిమమేధ) ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్‌ను భారతీ ఎయిర్‌టెల్ వినియోగించనుంది.
- మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయా? పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. మన దేశానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు సగం మేర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. అయితే ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగినా, మన వద్ద తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.