సూర్య విషయంలో అలా చేస్తే మూర్ఖత్వమే: మైకెల్ వాన్‌

Eenadu icon
By Sports News Team Published : 26 Feb 2026 00:09 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో సూపర్-8 దశ కొనసాగుతోంది. ఇప్పటికే టీమ్‌ఇండియా తన తొలి సూపర్-8 మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. గురువారం జింబాబ్వేతో తలపడేందుకు చెన్నై వేదికగా తీవ్ర సాధన చేస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన ఫామ్‌తో లీగ్‌ స్టేజ్‌లో పరుగులు రాబట్టాడు. మరోసారి అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, ఈ టీ20 ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత సూర్యకుమార్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. కొత్త సారథ్యం వైపు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ చూస్తోందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్య విషయంలో అలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించాడు.

‘‘సూర్యకుమార్‌ యాదవ్ ఓ అద్భుతం.  ఇలాంటి జీనియస్ ప్లేయర్‌ను కొనసాగించాలి. టీ20 ప్రపంచ కప్‌ తర్వాత ‘స్కై’ను కాదని మరొక సారథిని తీసుకురావాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది’’ అని అన్నాడు.

తిలక్‌ స్ట్రైక్‌రేట్‌పై..

‘‘తిలక్ వర్మ స్ట్రైక్‌రేట్‌ను పెంచుకోవాలని చూస్తుంటాడు. అయితే, బ్యాటింగ్‌ లైనప్‌ను ఓ సారి గమనిస్తే.. విభిన్నమైన కూర్పుతో బరిలోకి దిగుతుంటాం. అందులోనూ నిలకడైన ఆటతీరు ప్రదర్శించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు నిలకడగా ఆడే సమయంలో స్ట్రైక్‌రేట్‌ మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు 130-140 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం వల్ల పునాది వేయగలుగుతాడు. ఇదంతా బ్యాటింగ్‌ లైనప్‌నుబట్టి ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.

అతడు వన్డే ప్లేయర్..

‘‘ఈ ప్రపంచ కప్పే పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్‌కు చివరి టీ20 టోర్నీ. బాబర్‌ అజామ్‌ను నేను పొట్టి ఫార్మాట్‌ ప్లేయర్ అనుకోవడం లేదు. అతడికి వన్డే ఫార్మాట్‌ చక్కగా నప్పుతుంది. టెస్టుల్లోనూ స్పెషలిస్ట్‌గా మారొచ్చు’’ అని మైకెల్ వాన్ విశ్లేషించాడు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • బెంగళూరు రయ్‌..రయ్‌ ఐపీఎల్‌లో నిరుడు సొంతగడ్డపై గెలవడానికి ఆపసోపాలు పడ్డ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో చెలరేగిపోతోంది. ఆ జట్టు ఇక్కడ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. బంతితో రసిఖ్, భువనేశ్వర్, హేజిల్‌వుడ్‌.. బ్యాట్‌తో విరాట్‌ కోహ్లి సత్తా చాటడంతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది.
  • వారెవ్వా వైశాలి.. క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ ఆరంభానికి ముందు ఆ అమ్మాయిపై అసలు అంచనాలే లేవు.. అంతా ఓపెన్‌ విభాగంలో ప్రజ్ఞానంద గెలుపుపై ఆశలు పెంచుకున్నారు.. మహిళల విభాగంలో కోనేరు హంపిపై నమ్మకం పెట్టుకున్నారు..
  • యువ యోధ తనను చూసి చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న తమ్ముడు అందనంత ఎత్తుకు చేరుకున్నాడు.. తనకంటే వెనకాల వెలుగులోకి వచ్చిన అమ్మాయి ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది.. పెద్ద టోర్నీ ఏది జరిగినా ఆ అమ్మాయి ఎవరి అంచనాల్లో ఉండదు..
  • పంజాబ్‌తో పోరుకు రోహిత్‌ అనుమానం రుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబయి ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో జరుగనున్న కీలక మ్యాచ్‌కు స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కూ ధోని దూరం! గాయం కారణంగా ఐపీఎల్‌ 2026లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని దిగ్గజ క్రికెటర్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని వేగంగా కోలుకుంటున్నాడు. ఈనెల 23న వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగే పోరుతో ధోని ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం ఉన్నట్లు సీఎస్కే వర్గాలు వెల్లడించాయి.
  • కోల్‌కతాకు ‘రహానె’ కష్టాలు ఐపీఎల్‌ 2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కెప్టెన్‌ ఆజింక్య రహానె బ్యాటర్‌గా.. సారథిగా పూర్తిగా తేలిపోవడంతో ఈ సీజన్‌లో కేకేఆర్‌ బాగా వెనుకబడిపోతోంది.
  • రాకెట్‌ వదిలేసిన అక్సెల్సెన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ రాకెట్‌ వదిలేశాడు. 32 ఏళ్ల ఈ డెన్మార్క్‌ షట్లర్‌.. ఆటకు బుధవారం వీడ్కోలు పలికాడు. గాయాల కారణంగా శరీరం సహకరించకపోవడంతో ఈ నిర్ణయం అనివార్యమైందని విక్టర్‌ తెలిపాడు.
  • అభిషేక్, అక్షర్‌లపై నాడా నజర్‌ భారత టీ20 ప్రపంచకప్‌ విజేతలు అభిషేక్‌శర్మ, అక్షర్‌ పటేల్‌లపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నిఘా పెట్టనుంది. 2026 రెండో త్రైమాసికానికి సంబంధించి రిజిస్టర్‌ టెస్టింగ్‌ పూల్‌ (ఆర్‌టీపీ) జాబితాలో వీరిద్దరికి చోటు కల్పించింది.
  • ఐపీఎల్‌.. లఖ్‌నవూపై ఆర్సీబీ ఘనవిజయం ఐపీఎల్ 2026లో భాగంగా ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
  • ముంబయి ఇండియన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌..? Rohit Sharma: ముంబయి ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌..!
  • ప్లేయర్లపై కాదు.. అంపైర్లకు జరిమానా విధించాలి: ఎంసీసీ హెడ్ స్లో ఓవర్‌ రేట్ కారణంగా మ్యాచ్‌ ఆలస్యమైతే కెప్టెన్లపై జరిమానా విధించడం సరైంది కాదని ఎంసీసీ హెడ్ స్టీవార్ట్ అభిప్రాయపడ్డారు. అంపైర్లకు విధించాలని సూచించారు.
  • నూర్ సూపర్ స్పెల్ వెనుక ధోని సూచనలు: సీఎస్‌కే బౌలింగ్‌ కోచ్ ధోని మైదానంలోకి దిగకపోయినా.. సహచరుల్లో స్ఫూర్తి నింపడంలో ముందుంటాడు. కోల్‌కతాపై అద్భుత ప్రదర్శన చేసిన నూర్‌కూ ఇలాగే కీలక సూచనలు ఇచ్చాడు.
  • నా శరీరంలో ఇప్పటికీ ఆ అవశేషాలు: కుమార సంగక్కర పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన తమ జట్టుపై 2009లో ఉగ్రదాడి జరిగిన ఘటనను తాజాగా కుమార సంగక్కర గుర్తు చేసుకున్నాడు. 
  • రోహిత్ శర్మ గాయంపై తాజా అప్‌డేట్‌..! రోహిత్ శర్మ గాయంపై అప్‌డేట్ వచ్చింది. కండరాలు పట్టేయడంతో ఆర్సీబీతో జరిగిన బ్యాటింగ్‌ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే.
  • మయాంక్‌పై అప్‌డేట్.. రహానేకు ఫైన్.. నల్ల రిబ్బన్లతో ప్లేయర్స్ చెపాక్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే అద్భుత విజయం.. కోల్‌కతా కెప్టెన్‌కు జరిమానా.. లఖ్‌నవూ స్టార్ పేసర్‌ మాయంక్‌ యాదవ్‌పై అప్‌డేట్‌తో ఐపీఎల్ విశేషాలు ఇవీ..
  • సాకులు చెప్పం.. నాతో సహా మెరుగుపడాల్సిందే: రుతురాజ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఓ విషయంలో మాత్రం ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ఆ జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ కూడా వెల్లడించాడు.
  • చెన్నై.. మళ్లీ కొట్టింది హ్యాట్రిక్‌ ఓటములతో ఐపీఎల్‌-19ను పేలవంగా ఆరంభించిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. కొంచెం ఆలస్యంగా జోరందుకుంది. గత మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించిన సీఎస్కే.. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అలవోకగా గెలిచింది.
  • షూ కూడా కొనలేని స్థితి నుంచి.. మొన్నటి సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ తర్వాత రాత్రికి రాత్రి స్టార్లు అయిపోయారు.. ప్రఫుల్‌ హింగే, సకిబ్‌ హుస్సేన్‌. ఈ ఇద్దరూ తలో నాలుగు వికెట్లతో రాయల్స్‌ ఓటమిని శాసించారు. ప్రఫుల్‌ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్‌ నడ్డి విరిస్తే.
  • ఆయుష్‌ అదరహో.. కొంతకాలంగా ఆ యువ షట్లర్‌ తన నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మంచి భవిష్యత్తున్న వర్ధమాన ఆటగాడిగా భారత బ్యాడ్మింటన్‌ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ప్రదర్శనతో అతడి పేరు మార్మోగుతోంది.
  • సూర్య భవితవ్యంపై చర్చ కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను విజయపథంలో నడిపించినప్పటికీ బ్యాటుతో పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.