మమ్మల్ని టార్గెట్ చేస్తే.. జట్టు గెలుస్తుందా?: సల్మాన్ అఘా భార్య పోస్టు

Eenadu icon
By Sports News Team Updated : 25 Feb 2026 17:09 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ సూపర్-8లో ఇంగ్లాండ్‌ చేతిలో పాకిస్థాన్‌ ఓటమిపాలైంది. మరొక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారిపోయాయి. ఇంగ్లాండ్‌పై ఓడిపోవడంతో పాక్‌ అభిమానులు తమ జట్టు సారథిపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకు పడుతున్నారు. బ్యాటింగ్‌లో విఫలమైన కెప్టెన్ సల్మాన్ అఘాను విమర్శించే క్రమంలో అతడి ఫ్యామిలీని కూడా టార్గెట్ చేయడం గమనార్హం. తనతోపాటు తమ కుమారుడిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారని అఘా భార్య సబ్బా మన్జెర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘నన్ను లేదా నా కుమారుడిని అసభ్యపదజాలంతో లక్ష్యం చేసుకోవడం ద్వారా పాక్‌కు కప్‌ రాదు’’ అని సబ్బా పోస్టు పెట్టారు. 

కివీస్‌ నెగ్గితే.. పాక్‌ ఇంటికే

  • ఇవాళ శ్రీలంకతో న్యూజిలాండ్‌ కొలంబో వేదికగా తలపడనుంది. కివీస్‌ కూడా తన తొలి మ్యాచ్‌ను (పాక్‌తో) వర్షం కారణంగా కోల్పోవాల్సి వచ్చింది. కేవలం ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది.
  • ఇప్పుడు శ్రీలంకపై న్యూజిలాండ్‌ విజయం సాధిస్తే.. పాక్‌ సెమీస్‌ అవకాశాలు దాదాపు ముగిసినట్లే. అప్పుడు కివీస్ ఖాతాలో 3 పాయింట్లు ఉంటాయి. పాక్‌ ఒక్క పాయింట్‌తో కొనసాగుతోంది.
  • ఒకవేళ.. ఇప్పుడు శ్రీలంక చేతిలో కివీస్‌ ఓటమిపాలైనా సరే పాక్‌కు కష్టాలు తప్పవు. సూపర్-8 చివరి మ్యాచ్‌లో శ్రీలంకతోనే పాక్‌ తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనా.. ఓడినా సరే పాక్‌ ఇంటిముఖం పట్టాల్సిందే.
  • ఇప్పుడు కివీస్‌పై శ్రీలంక గెలిచి.. పాక్‌ చేతిలో ఓడితే నెట్‌రన్‌రేట్‌ కీలకం కానుంది. మరోవైపు న్యూజిలాండ్‌ తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై గెలవకుండా ఉంటేనే ఇటు శ్రీలంకకైనా, పాక్‌కైనా సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే కివీస్‌ ముందుకు వెళ్లిపోవడం ఖాయం.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 16:54 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మిచెల్ మార్ష్ భారీ సిక్స్‌.. కొడితే స్టేడియం అవతలికి! రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌(LSG) మధ్య మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది.
  • ఐపీఎల్‌.. లఖ్‌నవూపై బెంగళూరు జయకేతనం ఐపీఎల్‌లో భాగంగా బెంగళూరు వేదికగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు జయకేతనం ఎగురవేసింది.
  • ముంబయి ఇండియన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌..? Rohit Sharma: ముంబయి ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌..!
  • ప్లేయర్లపై కాదు.. అంపైర్లకు జరిమానా విధించాలి: ఎంసీసీ హెడ్ స్లో ఓవర్‌ రేట్ కారణంగా మ్యాచ్‌ ఆలస్యమైతే కెప్టెన్లపై జరిమానా విధించడం సరైంది కాదని ఎంసీసీ హెడ్ స్టీవార్ట్ అభిప్రాయపడ్డారు. అంపైర్లకు విధించాలని సూచించారు.
  • నూర్ సూపర్ స్పెల్ వెనుక ధోని సూచనలు: సీఎస్‌కే బౌలింగ్‌ కోచ్ ధోని మైదానంలోకి దిగకపోయినా.. సహచరుల్లో స్ఫూర్తి నింపడంలో ముందుంటాడు. కోల్‌కతాపై అద్భుత ప్రదర్శన చేసిన నూర్‌కూ ఇలాగే కీలక సూచనలు ఇచ్చాడు.
  • నా శరీరంలో ఇప్పటికీ ఆ అవశేషాలు: కుమార సంగక్కర పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన తమ జట్టుపై 2009లో ఉగ్రదాడి జరిగిన ఘటనను తాజాగా కుమార సంగక్కర గుర్తు చేసుకున్నాడు. 
  • రోహిత్ శర్మ గాయంపై తాజా అప్‌డేట్‌..! రోహిత్ శర్మ గాయంపై అప్‌డేట్ వచ్చింది. కండరాలు పట్టేయడంతో ఆర్సీబీతో జరిగిన బ్యాటింగ్‌ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే.
  • మయాంక్‌పై అప్‌డేట్.. రహానేకు ఫైన్.. నల్ల రిబ్బన్లతో ప్లేయర్స్ చెపాక్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే అద్భుత విజయం.. కోల్‌కతా కెప్టెన్‌కు జరిమానా.. లఖ్‌నవూ స్టార్ పేసర్‌ మాయంక్‌ యాదవ్‌పై అప్‌డేట్‌తో ఐపీఎల్ విశేషాలు ఇవీ..
  • సాకులు చెప్పం.. నాతో సహా మెరుగుపడాల్సిందే: రుతురాజ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఓ విషయంలో మాత్రం ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ఆ జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ కూడా వెల్లడించాడు.
  • చెన్నై.. మళ్లీ కొట్టింది హ్యాట్రిక్‌ ఓటములతో ఐపీఎల్‌-19ను పేలవంగా ఆరంభించిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. కొంచెం ఆలస్యంగా జోరందుకుంది. గత మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించిన సీఎస్కే.. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అలవోకగా గెలిచింది.
  • షూ కూడా కొనలేని స్థితి నుంచి.. మొన్నటి సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ తర్వాత రాత్రికి రాత్రి స్టార్లు అయిపోయారు.. ప్రఫుల్‌ హింగే, సకిబ్‌ హుస్సేన్‌. ఈ ఇద్దరూ తలో నాలుగు వికెట్లతో రాయల్స్‌ ఓటమిని శాసించారు. ప్రఫుల్‌ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్‌ నడ్డి విరిస్తే.
  • ఆయుష్‌ అదరహో.. కొంతకాలంగా ఆ యువ షట్లర్‌ తన నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మంచి భవిష్యత్తున్న వర్ధమాన ఆటగాడిగా భారత బ్యాడ్మింటన్‌ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ప్రదర్శనతో అతడి పేరు మార్మోగుతోంది.
  • సూర్య భవితవ్యంపై చర్చ కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను విజయపథంలో నడిపించినప్పటికీ బ్యాటుతో పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
  • ఐర్లాండ్‌ పర్యటనకు వైభవ్‌! ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్న వైభవ్‌.. జూన్‌ 26న ప్రారంభంకానున్న ఐర్లాండ్‌ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
  • ఉత్తమ ప్లేయర్లుగా అభిషేక్, దీప్తి 2026 విజ్డెన్‌ అవార్డుల్లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. మొత్తం 9 పురస్కారాల్లో ఏడు భారత క్రికెటర్లకు లభించాయి. భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా ఎంపికవగా..
  • టైటిల్‌కు చేరువలో వైశాలి క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న వైశాలి టైటిల్‌కు చేరువైంది. అగ్రస్థానంలో ఉన్న ఆమె ఆఖరి రౌండ్లో నెగ్గితే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం పోటీపడే అవకాశం లభిస్తుంది.
  • సంక్షిప్త వార్తలు(3) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మదుశంక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమైన ఇంగ్లాండ్‌ పేసర్‌ బ్రైడన్‌ కార్స్‌ స్థానంలో ఎడమచేతి వాటం బౌలర్‌ మదుశంకను జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్‌ మంగళవారం ప్రకటించింది.
  • బోల్ట్‌ను మించిన వేగం పరుగు అనగానే గుర్తుకొచ్చే పేరు.. ఉసేన్‌ బోల్ట్‌. ఓ దశాబ్దం పాటు ప్రపంచ అథ్లెటిక్స్‌లో అతను సాధించిన ఆధిపత్యం ఒక చరిత్ర. అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేయడమే కాదు.. భవిష్యత్తులో బద్దలు కావేమో అనిపించే స్థాయి రికార్డులు నెలకొల్పిన ఘనుడతడు.
  • కేకేఆర్‌పై చెన్నైదే విజయం చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  చెన్నై సూపర్‌ కింగ్స్‌ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్‌.. కమిన్స్‌ వచ్చేదప్పుడే..! Pat Cummins: పాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టుతో చేరే అవకాశం కనిపిస్తోంది.