‘ధురంధర్ 2’ కోసం దుబాయ్ ప్రేక్షకులు ఇండియాకు ఎగురుకుంటూ వస్తారు: మాధవన్

- A
- A+
- A++

ఇంటర్నెట్‌డెస్క్: రణ్‌వీర్ సింగ్ ( Ranveer Singh) కథానాయకుడిగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా ‘ధురంధర్2’ (Dhurandhar 2) విడుదల కానుంది. ఈ క్రమంలో ఇందులో కీలక పాత్ర పోషించిన మాధవన్ (Madhavan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 19న (dhurandhar 2 release date) విడుదలయ్యే ‘ధురంధర్ 2’ చూసేందుకు దుబాయ్ ప్రేక్షకులు ఇండియా ఎగురుకుంటూ వస్తారని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాతో పాటు అనేక విషయాలను పంచుకున్నారు.
ఆ కథలకు ఫుల్‌స్టాప్..
‘‘ఇప్పటివరకూ యాక్షన్ సినిమాలంటే ఇండియా-పాక్ యుద్ధం లేదా మన స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సినిమాలు తీస్తూ వచ్చాం. యాక్షన్ కథలు చెప్పే క్రమంలో అదే కథా వస్తువు అనుకున్నాం. కానీ, నేటి యువత అలా భావించడం లేదు. ‘మాకు అర్థమవుతోంది. అదే కథను ఎన్నిసార్లు మళ్లీ మళ్లీ చెబుతారు’ అని అనుకుంటోంది. ‘ధురంధర్’ తర్వాత ఇండియా-పాక్ వ్యవహారం నేపథ్యంలో సాగే కథలు మరో దారిలో వెళ్తున్నాయి. అలాంటి చారిత్రక కథలకు ప్రస్తుతానికి ఫుల్‌స్టాప్ పడుతుంది’’ అని మాధవన్ అభిప్రాయపడ్డారు.
ఎగురుకుంటూ వస్తారు..
బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు యూఏఈ లోనూ ‘ధురంధర్’ చిత్రాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనా మాధవన్ స్పందించారు. ‘‘దుబాయ్ నుంచి కొందరు సినీ అభిమానులు కేవలం సినిమా చూడటానికే ఇండియాకు రావొచ్చు. మార్చి 19 విడుదలయ్యే ‘ధురంధర్2’ చూసి మళ్లీ తిరిగి అదే రోజు దుబాయ్ వెళ్లిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. మంచి కంటెంట్‌కు ఉన్న శక్తి అది’’ అని అన్నారు. మాధవన్ ఇందులో ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్ పాత్రను పోషిస్తున్నారు.
ఆ ప్రశ్నలన్నింటకీ సమాధానం..
గతేడాది కేవలం హిందీలోనే విడుదలైన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ‘ధురంధర్2’లో అనేక ప్రశ్నలకు సమాధానం లభించనుంది. హమ్జా (రణ్‌వీర్) ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? హమ్జానే అజయ్ సన్యాల్ ఎందుకు గూఢచారిగా ఎంపిక చేశాడు? రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) చనిపోయిన తర్వాత ల్యారీకిని హమ్జా ఎలా తన గుప్పిట్లోకి తీసుకున్నాడు? ఇండియాపై కుట్రలు చేస్తున్న మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)ను ఎలా మట్టుబెట్టాడు? ఇంతకీ బడేసాబ్ (...) ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానం లభించనుంది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నటులంతా నటిస్తూనే చనిపోవాలని కోరుకుంటారు: మమ్ముట్టి మలయాళ అగ్రహీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి సందడి చేయబోతున్న చిత్రం ‘పేట్రియాట్’.
- ‘రామాయణ’.. రావణుడిలో మరో కోణాన్ని చూపిస్తాం: నితీశ్ తివారీ రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీశ్ తివారీ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘రామాయణ’. ఇందులో రావణుడి పాత్ర గురించి దర్శకుడు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
- సందడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం సందడిగా జరిగింది.
- నటుడిగా అనిల్ రావిపూడి.. నేనే పరిచయం చేస్తా: దిల్ రాజు దర్శకుడు అనిల్ రావిపూడిని నటుడిగా పరిచయం చేస్తానని నిర్మాత దిల్ రాజు అన్నారు.
- ధనుష్‌లో మా నాన్నను చూసుకున్నా..: నయనతార భర్త కీలక వ్యాఖ్యలు నటుడు ధనుష్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్. ధనుష్ అంటే తనకెంతో గౌరవం ఉందని ఆయన అన్నారు.
- వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేసిన స్టార్ హీరో రీసెంట్‌గా విడుదలైన తన సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సొంతం చేసుకోవడంపై స్టార్ హీరో ఆనందం వ్యక్తం చేశారు. వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేశారు.
- 15 ఏళ్ల వయసులో అశ్లీల సైట్‌లో నా ఫొటో: జాన్వీకపూర్ డీఫ్ ఫేక్ కారణంగా 15 ఏళ్ల వయసులో తనకొక చేదు సంఘటన ఎదురైందని నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తెలిపారు.
- ‘రామాయణ’లో రణ్‌బీర్ ద్విపాత్రాభినయం.. అధికారిక వెల్లడి సినిమా ప్రకటించిన నాటినుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్ హీరోగా నితీశ్ తివారీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
- ఎన్టీఆర్ సినిమాలో ‘ధురంధర్’ నటుడికి ఛాన్స్.. మార్చి 19న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar The Revenge). ఆడియన్స్ అంచనాలను అందుకొని రెండు వారాల నుంచి ట్రెండింగ్‌లో కొనసాగుతూ సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోందీ యాక్షన్ థ్రిల్లర్.
- ‘నటించింది నేనేనా?’: పవన్‌కల్యాణ్ ఫస్ట్ మూవీ హీరోయిన్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన సినిమాని గుర్తుచేసుకున్నారు నిర్మాత సుప్రియ.
- ఈ క్షణం కోసం ఏడేళ్లు ఎదురుచూశా: ‘రామాయణ’ దర్శకుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా నితీశ్ తివారీ రూపొందిస్తున్న చిత్రం ‘రామాయణ’. ఈ సినిమా నుంచి ప్రత్యేక వీడియోను చిత్రబృందం నేడు విడుదల చేసింది.
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. అందుకే మౌనంగా ఉంటా: టొవినో థామస్ ఎన్టీఆర్ - ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో తాను నటించడం లేదని మలయాళ నటుడు టొవినో థామస్ స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని తాజాగా ఆయన వెల్లడించారు.
- అందుకే ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో నేను నటించట్లేదు: టొవినో థామస్ తాను ‘డ్రాగన్’లో ఎందుకు నటించట్లేదో టొవినో థామస్ చెప్పారు.
- ‘వారణాసి’ క్రెడిట్ ఎవరి ఖాతాలో వేయాలి..? శోభు యార్లగడ్డ ఏమన్నారంటే? మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి (S S Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’ (Varanasi).
- రెండేళ్లు.. రోజూ 32 కి.మీ. రన్నింగ్.. యోగా.. :‘బైకర్’ కోసం శర్వా కష్టమిది శర్వానంద్ కథానాయకుడిగా అభిలాష్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మోటో స్పోర్ట్ యాక్షన్ డ్రామా ‘బైకర్’ (Biker Movie). మాళవిక నాయర్ కథానాయిక. రాజశేఖర్ ముఖ్య పాత్ర పోషించారు.
- ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’.. శోభు యార్లగడ్డ ఏమన్నారంటే? ‘ధురంధర్ 2’ రికార్డులపై ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.
- 11 ఏళ్ల తర్వాత అబ్బాస్ రీఎంట్రీ.. ఇన్నాళ్లు ఎక్కడున్నారు? అబ్బాస్ రీఎంట్రీ మూవీ ‘హ్యాపీరాజ్’ థియేటర్లలో సందడి చేస్తోంది. మరి, ఆయన ఇన్నాళ్లు ఏం వర్క్ చేశారంటే?
- విజయ్‌పై వ్యాఖ్యలు.. స్పందించిన సముద్రఖని ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ (Vijay)పై తాను చేసిన కామెంట్స్‌పై దర్శక, నటుడు సముద్రఖని (Samuthirakani) స్పందించారు.
- బావ గారు కాదు.. చిరు నా అన్నయ్యే: పవన్ సతీమణి పోస్ట్ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె చిరంజీవి, నాగబాబులతో తన అనుబంధాన్ని పంచుకుంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
- పెళ్లి తర్వాత విరోష్ జోడి ఆనంద క్షణాలు.. వచ్చే ఐదేళ్లలో రష్మిక ప్లాన్ ఇదే! వచ్చే ఐదేళ్లలో రష్మిక ప్రపంచాన్ని చుట్టి రావాలని అనుకుంటున్నారట. అందుకు తాను కూడా సిద్ధమని అంటున్నారు ఆమె భర్త, నటుడు విజయ్ దేవరకొండ. వీరిద్దరూ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.