ఇండికేటర్‌ మరిచారా.. కారు గోవిందా!

Eenadu icon
By Telangana News Desk Updated : 25 Feb 2026 18:46 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

కారులో డ్యాష్‌బోర్డుపై ఉండే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లైట్లను వార్నింగ్‌ ఇండికేటర్స్‌ అని పిలుస్తుంటారు. అవి వెలుగుతూ కనిపిస్తున్నాయంటే సంబంధిత భాగాల్లో ఏదో సమస్య ఉందని అర్థం. వీటిపై అవగాహన లేకుంటే కారు త్వరగా రిపేర్‌కు వచ్చేస్తుంది.

విశాఖకు చెందిన నవీన్‌ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సెలవులకు కారులో ఇంటికి వస్తున్నాడు. అనుకోకుండా డ్యాష్‌బోర్డులో వెలిగిన ఇండికేటర్‌ను పట్టించుకోకుండా వేగంగా వెళ్లడంతో ఇంజిన్‌ ఆగిపోయింది. దగ్గరలోని షోరూంకి వెళ్తే రూ.75వేల నుంచి రూ.1.20లక్షలు అవుతుందని, లైటు వెలిగినప్పుడే అప్రమత్తమైతే ఖర్చు తగ్గేదన్నారు.

  • ఇంజిన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో లేదా ఇంజిన్‌ ఎమిషన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌లో ఏదైనా సమస్య ఉంటే ఈ వార్నింగ్‌ ఇండికేటర్‌ సూచిస్తుంది.
  • మీరు వాహనం నడుపుతున్న సమయంలో ఈ లైట్‌ వెలిగితే కారును వీలైనంత త్వరగా సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా నడపడం ఉత్తమం.

  • వాహనం నడుపుతున్నప్పుడు ఓవర్‌ హీటింగ్‌ ఇండికేటర్‌ ఆన్‌ అయితే కారులోని ఇంజిన్‌ వేడెక్కిందని అర్థం. 
  • ఇది కనిపించిన వెంటనే.. కారు ఆపి దగ్గరలోని మెకానిక్‌కు చూపించడం మంచింది. 

కారు బ్యాటరీ ఛార్జింగ్‌ కానప్పుడు ఇది వెలుగుతుంది. ఈ వార్నింగ్‌ను విస్మరిస్తే కొంత కాలానికి బ్యాటరీ పూర్తిగా కాలిపోయి పనిచేయడం ఆగిపోతుంది. 

  • యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌లో లోపం ఉన్నప్పుడు ఈ వార్నింగ్‌ ఇండికేటర్‌ ఆన్‌ అవుతుంది.
  • ఇది వెలిగినంత మాత్రాన బ్రేకింగ్‌ సిస్టమ్‌ పనిచేయడం లేదని అర్థం కాదు...సాధారణ సిస్టమ్‌తో కారును కంట్రోల్‌ చేయవచ్చు. కానీ వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించుకోవడం ఉత్తమం.

ఫ్రంట్‌ ప్యాసింజర్‌ ఎయిర్‌బ్యాగ్‌ను మాన్యువల్‌గా ఆఫ్‌ చేస్తే ఇది వెలుగుతుంది. 

ఇది కొన్ని రకాల హైఎండ్‌ కార్లలో ఉంటుంది. టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.

  • ఎలక్ట్రానిక్‌ పవర్‌ స్టీరింగ్‌ ఉండే కార్లలో ఈ ఇండికేటర్‌ ఉంటుంది.
  • డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఇది కనిపిస్తే పవర్‌ స్టీరింగ్‌లో ఏదో సమస్య ఉన్నట్లు అర్థం.
  • అలాంటప్పుడు ఈ ఫీచర్‌ పనిచేయకుండా నార్మల్‌ స్టీరింగ్‌గా మారిపోతుంది. దాంతో స్టీరింగ్‌ కంట్రోల్‌ చేయడం కొంత భారంగా అనిపిస్తుంది. 

ఆయిల్‌ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇండికేటర్‌ వెలుగుతుంది. చెక్‌ చేసుకోకుండా నడిపితే ఇంజన్‌ తీవ్రంగా దెబ్బతింటుంది.

మన కారులో సమస్య ఉందని ఇతర డ్రైవర్లను  అప్రమత్తం చేసేందుకు, అత్యవసరంగా వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాల్సి వచ్చినప్పుడు ఈ లైట్స్‌ను ఉపయోగించాలి. ఇది ఆన్‌ చేసినప్పుడు అన్ని ఇండికేటర్‌ లైట్లు ఆన్‌/ఆఫ్‌ అవుతుంటాయి.

  • దీనిని డీజిల్‌ కార్లలో ఉపయోగిస్తారు.
  • డ్యాష్‌బోర్డులో ఈ లైట్‌ ఆఫ్‌ అయ్యే వరకు ఇంజిన్‌ స్టార్ట్‌ చేయకూడదు.

  • పాత కార్లలో వాషర్‌ ఫ్లూయిడ్‌ ఉందో లేదో తెలుసుకోవాలంటే, బోనెట్‌ ఓపెన్‌ చేసి మ్యాన్యువల్‌గా చెక్‌ చేసుకోవాలి.
  • కానీ, ప్రస్తుత మోడ్రన్‌ కార్లలో దీని కోసం ప్రత్యేమైన సెన్సర్లు ఉంటున్నాయి. వాషర్‌ ఫ్లూయిడ్‌ ట్యాంక్‌లో నీరు తగ్గిపోగానే డ్యాష్‌బోర్డుపై అలెర్ట్‌ సైన్‌ వస్తుంది.

  • తడి రోడ్లపై కారు జారిపోకుండా ఉండేందుకు  ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. 
  • వద్దనుకుంటే దీనిని ఆఫ్‌ చేసుకునే సౌకర్యమూ ఉంటుంది. కారులో ట్రాక్షన్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను ఆఫ్‌ చేసినప్పుడు ఈ వార్నింగ్‌ గుర్తు ఆన్‌ అవుతుంది.

కారు నడుపుతున్నప్పుడు.. ముందు రోడ్డు.. తోటి వాహనాలే కాదు డ్యాష్‌బోర్డుపైనా ఓ కన్నేయాల్సిందే.. అది చూపే సంకేతాలతో అప్రమత్తం కావాల్సిందే.. లేకపోతే భారీ మూల్యం తప్పదంటున్నారు నిపుణులు..

  • ఇతర ఇండికేటర్‌ లైట్లతో పాటే దీన్ని జోడిస్తారు.
  • ఈ లైట్‌ వెలిగితే కారులో ఏదో తెలియని సమస్య ఉందని అర్థం. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఇది వస్తే వెంటనే సర్వీస్‌ ఇంజినీర్లను సంప్రదించాలి

  • హ్యాండ్‌ బ్రేక్‌ సిస్టమ్‌ ఆన్‌ చేస్తే ఇది ఇండికేట్‌ చేస్తుంది. ఆ బ్రేక్‌ రిలీజ్‌ చేసే వరకు వెలుగుతూనే ఉంటుంది. అలాగే వాహనం కూడా ముందుకు కదలదు.
  • ఒకవేళ డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఈ లైట్‌ ఆన్‌ అయితే, బ్రేకింగ్‌ సిస్టమ్‌లో సమస్య ఉన్నట్లు అర్థం.
  • కారు హెడ్‌లైట్‌ హై/ఫుల్‌ బీమ్‌లో ఉందని ఈ గుర్తు తెలియజేస్తుంది. నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వీలైనంత వరకు ‘లో బీమ్‌’లో వెళ్లడం సురక్షితం.
  • లేకపోతే ఎదురు వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. 
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 18:43 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఇది పదాలు పలికించే ‘పలక’ తల్లి ఒడిని వదిలి అప్పుడప్పుడే బడిబాట పట్టే బాలలు భయం, బెరుకు లేకుండా... అలవోకగా అక్షరాలు, పదాలు నేర్చుకునేందుకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగారం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కేతావత్‌ తావుర్యానాయక్‌ ‘మైస్లేట్‌’ పేరుతో ప్రత్యేకంగా ఓ పలకను రూపొందించారు.
  • శ్రీవారికి నాణేల బదులు ముడుపు పత్రాలు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తితిదే ధర్మకర్తల మండలి అనేక మార్పులు దిశగా కసరత్తు చేస్తోంది. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరగనుండగా ఇందులో కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.
  • శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక తెప్పోత్సవాలు తిరుమలలో గురువారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి.
  • స్థిరాస్తి కొనుగోలులో సందేహాలా? తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు కలిసినా మాట్లాడుకునేది రియల్‌ ఎస్టేట్‌ గురించే. పెరుగుతున్న ధరలను తట్టుకుని రాబడి ఇస్తున్న పెట్టుబడి మార్గంగా ఎక్కువ మంది దృష్టిని స్థిరాస్తి రంగం ఆకర్షిస్తోంది.
  • గ్రేహౌండ్స్‌.. ఎస్‌ఐబీ ఇక చరిత్ర గతిలోకి! దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు హడలెత్తించిన వామపక్ష తీవ్రవాదం చివరి అంకానికి చేరడంతో పోలీసుశాఖలో వ్యవస్థాపరమైన మార్పులు జరగబోతున్నాయి.
  • ఫీజుల నియంత్రణకు కమిటీ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
  • పసిపిల్లల హృదయాలయం కల్లాకపటం తెలియని పసి మనసులు.. హృద్రోగ సమస్యలతో తల్లడిల్లుతుంటే.. మేమున్నాం అంటూ అక్కున చేర్చుకుంటోంది సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ హార్ట్‌కేర్‌ అండ్‌ రీసెర్చ్‌.
  • మీరే ప్రభుత్వానికి కళ్లు.. చెవులు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ అందించేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి హార్వర్డ్‌ వర్సిటీ రానుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
  • అధికార గర్వంతో పేదల ఇళ్లు కూల్చారు భూదాన్‌ భూముల్లో నిర్మించిన ఇళ్లను కూల్చడంతో వీధినపడిన నిరుపేదల పక్షాన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని, అసెంబ్లీలోనూ గళం విప్పి ప్రభుత్వంతో కొట్లాడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.
  • ఎప్‌సెట్‌ రద్దు చేయాలి రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ (ఎప్‌సెట్‌)ను రద్దు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
  • నేరాలను ఆపేది చదువే! నేర ప్రవృత్తికి... అక్షరాస్యతకు మధ్య సంబంధం ఉందని చెబుతున్నాయి గణాంకాలు. రాష్ట్రంలో ఏటా సగటున 5 వేల మంది విచారణ ఖైదీలు, 2 వేల మంది శిక్ష పడ్డ ఖైదీలు జైళ్లకు వస్తున్నారు.
  • కాళేశ్వరంలో భారాస అవినీతికి భాజపా సహకారం ‘కాళేశ్వరం సహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో దోచుకున్న సొమ్ములో కొంతైనా పాపపరిహారం కింద కేసీఆర్‌ పేదలకు పంచి ప్రజలను క్షమాపణ కోరాలి.
  • న్యుమోనియాకు బిట్స్‌ హైదరాబాద్‌ ఆచార్యుల కొత్త టీకా! న్యుమోనియా నియంత్రణకు కొత్త టీకాను కనుగొన్నట్లు బిట్స్‌ హైదరాబాద్‌ ఆచార్యులు, పరిశోధకులు యోగేశ్వర్‌ దేవరకొండ, ఎం.వి.ఎన్‌. జనార్దన్‌రెడ్డి, అరుణిమ, కీర్తిమాన్‌ స్యాల్‌లు గురువారం తెలిపారు. ‘‘స్ట్రెప్టోకోకల్‌ న్యుమోనియా కట్టడికి ఏడాది నుంచి పరిశోధనలు చేస్తున్నా.
  • ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇం‘ధనం’! రోజువారీ వినియోగ వస్తువుల ప్యాకేజింగ్‌ వ్యర్థాలను ఇంధనంగా మార్చే సాంకేతికతను హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక పరిశోధన సంస్థ ్బఐఐసీట్శీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
  • కొండాపూర్‌ భూములపై స్టేటస్‌కో ఇవ్వం హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సర్వే నం.59లో ఉన్న 57.09 ఎకరాల వివాదాస్పద భూమిపై స్టేటస్‌కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
  • 8.68 లక్షల భూభారతి దరఖాస్తులు ఏమయ్యాయి?: హరీశ్‌రావు ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రెవెన్యూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. భూభారతి పేరిట రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 8.68 లక్షల దరఖాస్తులు వచ్చినా.. పరిష్కారం కాలేదు’ అని శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.
  • ఖనిజాల పరిశోధనలకు ఎన్‌ఎండీసీ, ఐఐటీ-హెచ్‌ భాగస్వామ్యం ఖనిజాల పరిశోధనల కోసం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)తో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఒప్పందం చేసుకుంది.
  • అరుదైన ఖనిజాలపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలి: ఎన్‌సీఎంఎం నేటి ఆధునిక ప్రపంచంలో అరుదైన ఖనిజాలకు అధిక ప్రాధాన్యముందని, ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌(ఎన్‌సీఎంఎం) కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
  • టీఎస్‌జీఆర్‌ఈఏ అధ్యక్షుడిగా పేరి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం(టీఎస్‌జీఆర్‌ఈఏ) అధ్యక్షుడిగా పేరి వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎంసీ లింగన్నలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • అగ్నిమాపక శాఖలోని సౌకర్యాలపై వివరణివ్వండి: హైకోర్టు విపత్తులను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖలో ఉన్న సౌకర్యాలు, వనరులు, పరికరాల స్థితిగతులపై వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.