కాంగ్రెస్ ప్రవర్తన సిగ్గుచేటు

- A
- A+
- A++

ఈనాడు, నరసరావుపేట: ‘ఏఐ సదస్సులో కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు ఆవేదన కలిగించింది. 70కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన దేశ ప్రతిష్ఠకు నష్టం. ఇలాంటి చర్యల్ని ఖండిస్తున్నా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభితో కలిసి స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ ‘ఏఐ సదస్సులో ప్రపంచంలోని చాలా దేశాలు ఆవిష్కరణలు ప్రదర్శించగా, మన ఆవిష్కరణల్ని చూపించి ప్రపంచ దేశాల అభినందనలు అందుకున్నాం. ఐటీ, ఏఐల్లో ముందుండటంతో ప్రపంచ నాలెడ్జ్ ఎకానమీకి నాయకత్వం వహించే ఏకైక దేశం మనదేనని అందరూ కితాబిచ్చారు. మన యువత ప్రయోజనాలు కాపాడాల్సిన కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరించడం దుర్మార్గం. మన రాష్ట్రంలోనూ వైకాపా వంటి పార్టీని ఎప్పుడూ చూడలేదు. నేను బాంబులకు భయపడలేదు. అలిపిరిలో నాపై దాడి చేసినప్పుడు వేంకటేశ్వరస్వామి నన్ను కాపాడారు. ఆ స్వామికి అపచారం కలిగే పనులు వైకాపా నాయకులు చేస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులే తిడుతున్నారు. ఇది న్యాయమేనా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నామా? రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు. మదనపల్లెలో ఒకరు గంజాయి తాగి మృగంలా ప్రవర్తించారు. గంజాయి తాగి ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజవుతుందని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను. అలాంటి మృగాలు జైల్లో ఉండాలి లేదా ఉరిశిక్షతో పైకి పోవాలి.. చట్టం తన పని తాను చేస్తుంది’ అని పేర్కొన్నారు.
నెయ్యే కాదని సిట్ తేల్చింది
‘తిరుమల తిరుపతి దేవస్థానంలో నాసిరకం ప్రసాదాలు గత ఐదేళ్లూ అందరూ తిన్నారు. వైకాపా వారు భక్తుల నమ్మకాన్ని దెబ్బతీశారు. మేము పవిత్రతను కాపాడుతున్నాం. ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీ ప్రకారం తితిదే ఈవోగా శ్యామలరావును నియమించి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. నెయ్యి నాణ్యంగా లేదని ల్యాబ్‌కు పంపితే జంతు కొవ్వు ఉందని తేల్చారు. ప్రజలకు తెలియజేయకపోతే అప్రతిష్ఠ వస్తుందని ల్యాబ్ రిపోర్టునే నేను ప్రకటించాను. దీన్ని రాజకీయం చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్లేలా చేశారు. సిట్ వేశాం. అసలు నెయ్యే కాదని, రసాయనాలు ఉన్నాయని తేల్చింది. సిట్ స్పష్టంగా చెప్పినా.. తిరిగి దాన్ని మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. హెరిటేజ్ కంపెనీని తీసుకొచ్చి నా పేరు ప్రస్తావించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులతో రాజకీయం చేయాలా? రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిపైనే లేదు.. మీ అందరిపై ఉంది. చెడ్డవారిని దూరం పెట్టినప్పుడే రాజకీయాల్లో ప్రక్షాళన మొదలవుతుంది. నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మార్పు రాదు. ప్రజల కోసమే నాడు జైలుకెళ్లాను. కేవలం ప్రజలు, రాష్ట్రాభివృద్ధి కోసమే ఇప్పటికీ పోరాటం చేస్తున్నా.

పరామర్శల పేరిట బలప్రదర్శనలా?
చెత్త, రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. పరామర్శల పేరిట బయటకు వస్తారు. మనుషుల్ని బలవంతంగా తెచ్చుకుని బలప్రదర్శనకు దిగుతున్నారు. వాళ్ల కార్ల కింద మనుషుల్ని చంపేసి ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నారు. చనిపోయినవారి ఇళ్లకు పరామర్శకు వెళ్లరు.. వాళ్లనే పిలిపించుకుని పరామర్శిస్తారు. ఇదెక్కడా చూడలేదు. బూతులు తిట్టేవారిని పరామర్శిస్తారు. వాళ్ల కోసం చనిపోయిన వారిని మాత్రం పరామర్శించరు. విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా తీసుకెళ్తున్నాం. నాడు పెట్టుబడులు పెట్టాలన్నా ఎవరూ ముందుకు రాలేదు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి, 13 శాతం అప్పులు చేశారు. కూటమిని నమ్మిన ప్రజలకు సూపర్ 6ను అనుకున్న సమయం కంటే ముందుగానే అమలుచేశాం. అవకాశాల్ని అందిపుచ్చుకోవడం ద్వారా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంతో 23 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. త్వరలో విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు ఏఐ ట్యూటర్ వస్తారు. వ్యవసాయంలో ఏఐ అగ్రి ఎకానమీని తీసుకొస్తాం. ఇటీవల బిల్‌గేట్స్ కూడా వచ్చి రైతులు టెక్నాలజీ వినియోగిస్తున్న తీరును చూసి ఎంతో అభినందించారు.

బూట్లు తొలగించి.. జ్ఞాపిక అందుకుని..
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఆయన భార్య లీలావతి కలిసి సీఎంను సన్మానించారు. అనంతరం వారు వేంకటేశ్వరస్వామి ప్రతిమ ఉన్న జ్ఞాపికను బహూకరిస్తుండగా.. చంద్రబాబు కాళ్లకు ఉన్న బూట్లను తొలగించి అందుకున్నారు.
కోటప్పకొండ ప్రభల ప్రస్తావన
పల్నాడులో అడుగుపెట్టగానే వచ్చే వైబ్రేషన్సే వేరు. ఇటీవలే కోటప్పకొండ తిరునాళ్లు జరిగాయి. మునుపెన్నడూ లేని రీతిలో భక్తులు భారీగా హాజరయ్యారు. జిల్లా అధికారులు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి అనగానే కోటప్పకొండ ప్రభలే గుర్తుకొస్తాయి. నేను అనునిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నాను. అందుకు వేరే కారణాలున్నాయి.

సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని శాసనమండలిలోకి తీసుకెళ్లారు. పాదరక్షలు వేసుకుని స్వామి చిత్రాలను విసిరేశారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయాలా? వేంకటేశ్వరస్వామి విషయాన్ని బయట మాట్లాడకూడదనుకున్నాను. రెండు రోజులు ఓపిక పట్టాను. నాపైనే నెపం వేసే ప్రయత్నం చేస్తుంటే ఎలా ఊరుకుంటాను? దొంగే దొంగ అంటుంటే.. దొంగను పట్టి నడిరోడ్డుపై నిలబెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే మాట్లాడుతున్నా. మీరంతా ఈ విషయంలో నాతో నడవాలి.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 05:14 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విశాఖలో ఈదురుగాలుల బీభత్సం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది.
- ఉపసభాపతి రఘురామకృష్ణరాజుకు గాయం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో పలువురు చాలా ప్రొఫెషనల్‌గా ఆడుతూ ప్రతిభ చాటుతున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సభ్యులు గాయాల పాలయ్యారు కూడా.
- కారడవిలో.. కారు చీకట్లో కాన్పు కారడవిలో, కారు చీకట్లో కటిక నేలపై ఓ గర్భిణికి ఆశా కార్యకర్త, మహిళలు పురుడుపోసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది.
- తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించిన మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే త్వరలో అందుబాటులోకి రానుంది.
- కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా.. జైలుకెళ్తారా? గ్రూప్-1 పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందినవారిని అప్రాధాన్య (నాన్‌ఫోకల్) పోస్టులకు తక్షణం బదిలీ చేయాలని, ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌పై హైకోర్టు మండిపడింది.
- క్షణాల్లో ఆస్తి పన్ను చెల్లింపు ఆస్తి పన్ను చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్నారా? వీధిలో పేరుకుపోయిన చెత్త తొలగించాలని గ్రీవెన్స్‌లో కమిషనర్‌కు వినతులివ్వాలని అనుకుంటున్నారా?
- ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు ప్రజారోగ్యానికి అగ్రప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
- ముద్దొచ్చే మూతి.. నోరూరించే రుచి! ఎర్రగా పొడవైన నోటితో భలే అందంగా ఉన్న ఈ జీవిని ‘కదురు’ చేప అని పిలుస్తారు.
- సంక్షిప్త వార్తలు (10) శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం నుంచి మార్చి 2 వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.
- ప్రతి ట్రక్కు నెయ్యినీ క్షుణ్ణంగా పరిశీలించే పంపుతున్నాం శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారికి వస్తున్న ప్రతి నెయ్యి ట్రక్కునూ క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతిస్తున్నామని గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
- అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై ముందుకెళ్లొద్దు అనధికారిక, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ముందుకెళ్లొద్దని పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది.
- నకిలీ వెబ్‌సైట్లతో భక్తులు అప్రమత్తంగా ఉండాలి: తితిదే తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లతో అప్రమత్తంగా ఉండాలని తితిదే సూచించింది.
- 102కు చేరిన అతిసార బాధితులు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రబలిన అతిసారం కేసులు 102కి చేరాయి. మంగళవారంతో పోల్చితే వ్యాధి ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
- శ్రీకాకుళం కమిషనర్ కూర్మారావు సస్పెన్షన్ శ్రీకాకుళంలో అతిసారం ప్రబలిన వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
- చిన్నారి పునర్విక చికిత్స బాధ్యత నాదే అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక చికిత్స బాధ్యత తాను తీసుకుంటానని... అందుకు అవసరమైన రూ.6 కోట్లు సమకూరుస్తానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
- వైకాపా పాలనలో ఏపీ రోడ్లను హేళన చేసిన జగన్ మిత్రుడు కేటీఆర్ వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు వైన్, మైన్ ద్వారా వచ్చే సొమ్ములు చాలవన్నట్లుగా.. తమ కమీషన్ల కోసం ఎన్‌డీబీ (న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు) సహకారంతో చేపట్టే రోడ్ల నిర్మాణాన్నీ నిలిపేశారని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.
- స్త్రీశక్తి పథకం కింద 47 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం కింద మహిళలు ఇప్పటివరకు 47 కోట్ల ప్రయాణాలు చేశారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వివరించారు.
- బాబాయ్‌ని చంపి కత్తి మా చేతిలో పెట్టారు ‘బాబాయ్‌ని చంపి కత్తి మా చేతిలో పెట్టారు. ఇప్పుడు వీఎస్‌ఆర్ ఏవియేషన్ సంస్థకు, హెరిటేజ్‌కు ముడిపెడుతూ వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలూ అలాంటివే’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
- కల్తీ నెయ్యి వ్యవహారంలో గజదొంగని కదా పట్టుకోవాల్సింది..? ‘కల్తీ నెయ్యి వ్యవహారంలో చిల్లర దొంగలనే కాదు.. గజదొంగని కదా పట్టుకోవాల్సింది’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
- కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు 150 శాతం పెరిగిన భక్తుల రద్దీ కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలకు వచ్చే భక్తులు 150% పెరిగారని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.