ఇది కత్యాల్ ‘విక్టరీ’

- A
- A+
- A++

న్యూయార్క్: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్డగోలుగా విధించిన సుంకాలకు సుప్రీం కోర్టు అడ్డుకట్ట వేయడంలో భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ కీలక పాత్ర పోషించారు. సుంకాల ద్వారా జరుగుతున్న అన్యాయంపై ఆయన కోర్టులో చిన్న వ్యాపారుల తరఫున గట్టిగా వాదనలు వినిపించారు. దీంతో ట్రంప్ సుంకాలను చట్ట విరుద్ధమని కోర్టు ప్రకటించి రద్దు చేసింది. భారత్ నుంచి వలసవెళ్లిన వారి కుమారుడైన నీల్ కత్యాల్.. ఒబామా హయాంలో తాత్కాలిక సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు. కోర్టు తీర్పు అనంతరం ‘విక్టరీ’ అని ఎక్స్‌లో కత్యాల్ పోస్టు పెట్టారు.
శక్తిమంతులైనా రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయలేరు
‘ఈ దేశంలో ఇదో అసాధారణ ఘటన. స్వీయ దిద్దుబాటుకు అవకాశమున్న ఆలోచనా వ్యవస్థ మనకు ఉందని నిరూపించింది. మీరు ప్రపంచంలోనే శక్తిమంతమైన వ్యక్తి కావొచ్చు.. కానీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయలేరు’ అని కత్యాల్ వ్యాఖ్యానించారు.
చట్టంవైపే కోర్టు నిలిచింది..
సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కత్యాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టంవైపే కోర్టు నిలిచిందని వ్యాఖ్యానించారు. ‘కోర్టు సందేశం సుస్పష్టం. అధ్యక్షులు శక్తిమంతం కావొచ్చుగానీ రాజ్యాంగం అంతకంటే శక్తిమంతమని చాటిచెప్పింది. అమెరికాలో చట్టసభల సభ్యులే ప్రజలపై పన్నులు వేయగలరు. మేం అడిగిన అన్ని అంశాల్లో కోర్టు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఇతరులు పట్టించుకోని సమయంలో లిబర్టీ జస్టిస్ సెంటర్ నాయకత్వం వహించినందుకు కృతజ్ఞతలు. ఈ కేసు అధ్యక్ష పదవిపైనేగానీ ఫలానా అధ్యక్షుడిపై అని కాదు. ఇది అధికారాల విభజనకు సంబంధించినది. రాజకీయాలకు సంబంధించినది కాదు. 250 ఏళ్లుగా ప్రభుత్వానికి పునాదిగా ఉన్న సుప్రీం కోర్టు.. ప్రాథమిక విలువలను కాపాడుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని కత్యాల్ వ్యాఖ్యానించారు.
- భారత్ నుంచి వలస వచ్చిన దంపతులకు 1970లో కత్యాల్ జన్మించారు. షికాగోలో పుట్టిన ఆయన తండ్రి ఓ ఇంజినీరు. తల్లి పిల్లల వైద్యురాలు. యేల్ లా స్కూల్ నుంచి న్యాయవాద పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికా రెండో సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు గైడో కాలబ్రెసీవద్ద, అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి స్టీఫెన్ జి.బ్రేయర్‌వద్ద క్లర్క్‌గా పని చేశారు.
- జార్జ్‌టౌన్ యూనివర్సిటీ లా సెంటర్‌లో కత్యాల్ రెండు దశాబ్దాలకుపైగా లా ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ వర్సిటీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రొఫెసర్లలో ఒకరిగా నిలిచారు.
- హార్వర్డ్ వర్సిటీ, యేల్ లా స్కూల్‌లలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
- జస్టిస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డిప్యూటీ అటార్నీ జనరల్ కార్యాలయంలో జాతీయ భద్రతా సలహాదారుగా పని చేశారు. డిప్యూటీ అటార్నీ జనరల్‌కు ప్రత్యేక సహాయకుడిగా సేవలందించారు.
- మిల్‌బ్యాంక్ ఎల్‌ఎల్‌పీ వాషింగ్టన్‌లో కత్యాల్ భాగస్వామిగా ఉన్నారు. ఆ సంస్థ లిటిగేషన్ అండ్ ఆర్బిట్రేషన్ గ్రూపు సభ్యుడిగానూ ఉన్నారు.
- మిల్‌బ్యాంక్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. అప్పిలేట్, సంక్లిష్ట వివాదాల్లో కత్యాల్ వాదనలు వినిపిస్తుంటారు. సుప్రీం కోర్టులో ఆయన 54 కేసులను వాదించారు.
- అమెరికా న్యాయశాఖలో అత్యున్నత అవార్డు అయిన ద ఎడ్మండ్ రాండాల్ఫ్ అవార్డును ఆయన 2011లో సొంతం చేసుకున్నారు.
- 2011 నుంచి 2014 వరకూ ఫెడరల్ అప్పిలేట్ నిబంధనల సలహా కమిటీలో నియమితులయ్యారు.
‘అమెరికా వ్యవస్థల గొప్పదనాన్ని శుక్రవారం జరిగిన ఘటన నిరూపించింది’ అని నీల్ కత్యాల్ వ్యాఖ్యానించారు. వలసదారుల కుమారుడినైన తాను కోర్టుకు వెళ్లగలిగానని, అమెరికా చిన్న వ్యాపారాల తరఫున వాదించగలిగానని, ఈ అధ్యక్షుడు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని చెప్పగలిగానని పేర్కొన్నారు. తీర్పు అనంతరం ఆయన ‘ఎంఎస్ నౌ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.‘నా కేసును నేను సమర్థంగా సమర్పించగలిగా. నన్ను కఠినమైన ప్రశ్నలు అడగవచ్చని వారికి సూచించా. నిజంగా తీవ్రమైన వాదనలు జరిగాయి. చివరకు వారు ఓటేశారు. మేం గెలిచాం’ అని కత్యాల్ వివరించారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రేపు భారత్‌కు కెనడా ప్రధాని కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన గురువారం ముంబయికి చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు.
- ఐదో ఏట అడుగుపెట్టిన యుద్ధం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మంగళవారం ఐదో ఏట అడుగుపెట్టింది. అయినా కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు.
- బర్డ్‌ఫ్లూ కాదు.. కుక్కలకు సంబంధించిన వ్యాధే థాయ్‌లాండ్ ఉత్తర ప్రాంతంలోని జూలో 72 పులుల మరణానికి కారణం.. కుక్కలకు సంబంధించిన వ్యాధేనని, బర్డ్‌ఫ్లూ కాదని అధికారులు తెలిపారు.
- ఇరాన్‌పై అమెరికా దాడి చేసినా స్పందించొద్దు అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దని హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూపునకు లెబనాన్ ప్రభుత్వం సూచించింది.
- ఉక్రెయిన్‌కు బ్రిటన్, ఫ్రాన్స్ అణ్వాయుధాలు! అణ్వాయుధాలను ఉక్రెయిన్‌కు తరలించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ కుట్ర పన్నుతున్నాయని రష్యా ఆరోపించింది.
- డిటోనేటర్ పేల్చి పోలీసు అధికారి హత్య రష్యా రాజధాని మాస్కోలో పెట్రోలింగ్ చేస్తున్న వాహనం సమీపంలో డిటోనేటర్‌తో గుర్తు తెలియని వ్యక్తి పేలుడుకు పాల్పడ్డాడు.
- ఆసుపత్రికి ఇమ్రాన్‌ఖాన్.. చికిత్స అనంతరం మళ్లీ జైలుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను మంగళవారం ఉదయం జైలు నుంచి పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
- మళ్లీ భూ కక్ష్యలోకి చైనా రహస్య అంతరిక్ష విమానం అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా తమ రహస్య అంతరిక్ష విమానం షెన్‌లాంగ్‌ను మరోసారి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
- అమెరికా అధీనంలోకి మూడో చమురు నౌక హిందూ మహాసముద్రంలో మూడో చమురు నౌకను అమెరికా అధీనంలోకి తీసుకుంది. కరేబియన్ సముద్రం నుంచి వస్తున్న ఈ నౌకను వెంబడించి స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం పెంటగాన్ ప్రకటించింది.
- అరెస్టయిన 11 గంటల్లోనే బెయిల్ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు నెరపిన కేసులో అరెస్టయిన బ్రిటన్ ప్రధాని సన్నిహితుడు, మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్ మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు.