‘ఏఐ’ కృష్ణార్జునులు ధర్మం గురించి చెప్పారు

- A
- A+
- A++

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో ఓ అద్భుత దృశ్యం సందర్శకులను ఆకట్టుకుంది. రిలయన్స్‌కు చెందిన జియో ఇంటలిజెన్స్ విభాగం అత్యాధునిక హోలోగ్రామ్ టెక్నాలజీ, కృత్రిమ మేధ ద్వారా శ్రీకృష్ణుడు, అర్జునుడి హైటెక్ డిజిటల్ రూపాలను తన స్టాల్‌లో ప్రదర్శించింది. ఈ కృష్ణుడు, అర్జునుడి రూపాలను సందర్శకులు ప్రశ్నలు అడిగేలా కూడా జియో ప్రత్యేక ఏర్పాటు చేసింది. ధర్మం అంటే ఏమిటి? మనిషికి అతిపెద్ద శత్రువు ఎవరు? జీవితంలో మనం అనుకున్న దానికి భిన్నంగా జరిగినప్పుడు ఏమి చేయాలి? వంటి ప్రశ్నలకు డిజిటల్ కృష్ణార్జునులు సమాధానాలిచ్చేలా ఏర్పాటు చేశారు. ఇది సమిట్‌కు వచ్చిన వారిని విశేషంగా ఆకర్షించింది. ఏఐతో రూపొందించిన కృష్ణార్జునులను ఎంతో సహజ సుందరంగా, ఆకట్టుకునే రూపంలో ప్రదర్శించారు. ఇందులో కృష్ణుడు నీలి రంగులో మెరుస్తూ, చేతిలో పిల్లన గ్రోవిని పట్టుకుని, బంగారు రంగు ధోతి కట్టుకుని, తలకు కిరీటం, ఆ పైన నెమలి పింఛాన్ని ధరించి ఎంతో సహజ సిద్ధమైన రూపంతో కనువిందు చేశారు. వెండి రంగు దుస్తులు, చేతిలో గాండీవం, మేలిమి వర్ణపు శరీరంతో గంభీరంగా, యుద్ధానికి సిద్ధమైనట్లుగా అర్జునుడు చూపరులను ఆకర్షించారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పదో తరగతి పత్రాలతోనూ ఓటరు గుర్తింపు నిర్ధరణ అర్హులైన ఓటర్లుగా నిరూపించుకోవడానికి ప్రజలు పదో తరగతి ప్రవేశ (అడ్మిట్) కార్డు, ఉత్తీర్ణత ధ్రువీకరణనూ అనుబంధ పత్రంగా ఎన్నికల అధికారులకు సమర్పించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- కాశీలో గంగమ్మ అలలపై ..మెక్సికో జంటకు పడవ పెళ్లి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షితులు అవుతున్న ఎన్నో విదేశీ జంటలు వారణాసి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను వేదికగా చేసుకొని ఒక్కటవుతున్నాయి.
- దేశాల పరస్పర సహకారానికి మిలన్ దోహదం హిందూ మహాసముద్రంలో దేశాల నడుమ మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు నిర్వహించిన ‘మిలన్-2026’ విన్యాసాలు విజయవంతంగా ముగిశాయని ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ అలోక్ ఆనంద అన్నారు.
- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు కన్నుమూత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు అనారోగ్యంతో బుధవారం మరణించారు. మూడు దశాబ్దాలపాటు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తి కొనసాగించిన ఆయన గ్రీన్ లాయర్‌గా ప్రసిద్ధి పొందారు.
- దేశంలో మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం అస్సాంకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ రాజీవ్ కుమార్ సౌద్ దివ్యాంగులకు నటనలో మెళకువలు నేర్పించడమే కాకుండా, ఇతర రంగాల్లోనూ వారు స్వావలంబన సాధించి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రోత్సహిస్తున్నారు.
- దిల్లీలో దక్షిణాసియా టూరిజం ఎగ్జిబిషన్.. ప్రత్యేక ఆకర్షణగా రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్ దక్షిణాసియా ట్రావెల్ అండ్ టూరిజం ఎక్స్ఛేంజ్ (ఎస్‌ఏటీటీఈ- 2026) 33వ ఎగ్జిబిషన్ దిల్లీలోని యశోభూమిలో బుధవారం ప్రారంభమైంది.
- డీజీసీఏదీ తప్పే: రోహిత్ పవార్ మహారాష్ట్రలోని బారామతి వద్ద గత నెల 28న జరిగిన విమాన దుర్ఘటనలో మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ సహా అయిదుగురి దుర్మరణానికి ‘పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్’ (డీజీసీఏ) తప్పిదం కూడా కారణమని ఎన్సీపీ (ఎస్పీ) శాసనసభ్యుడు రోహిత్ పవార్ ఆరోపించారు.
- బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి బుధవారం నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. పర్యాటకులు ఎలక్ట్రానిక్ వీసా (ఇ-వీసా)లను కలిగి ఉండటాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
- న్యాయవ్యవస్థను కించపరచడాన్ని అనుమతించను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
- మోదీ నామినేషన్‌ను తిరస్కరించండి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వారణాసి లోక్‌సభ నుంచి ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ నిబంధన ప్రకారం లేనందున దాన్ని రద్దుచేసి ఆ స్థానానికి తిరిగి ఎన్నికలు...
- పెట్రోలులో 20% ఇథనాల్ తప్పనిసరి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా పెట్రోలులో 20% వరకు ఇథనాల్ కలిపి విక్రయించాలని కేంద్రం తెలిపింది. రీసెర్చ్ ఆక్టేన్ నంబరు (ఆర్‌ఓఎన్) 95తో ఈ పెట్రోలు ఉండాలనీ చమురు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
- దిల్లీ పోలీసులపై హిమాచల్‌లో కిడ్నాప్ కేసు ఏఐ సదస్సులో నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహారం హిమాచల్‌ప్రదేశ్‌లో ఇబ్బందికర వాతావరణానికి దారితీసింది. నిరసనకారుల్లో ముగ్గురిని తమతో తీసుకువెళ్లేందుకు దిల్లీ పోలీసులు సాధారణ దుస్తుల్లో హిమాచల్‌ప్రదేశ్‌కు వచ్చారు.
- వ్యక్తిగత పర్యటనకు 50 మంది సిబ్బంది పురమాయింపు ఆయనో ప్రభుత్వ రంగ సంస్థ సీనియర్ ఉన్నతాధికారి. బంధు మిత్ర సమేతంగా ప్రయాగ్‌రాజ్ సందర్శనకు ప్రణాళిక సిద్ధం చేశారు. అధికార విధులతో ఏ మాత్రం సంబంధంలేని పూర్తిగా వ్యక్తిగత పర్యటన ఇది.
- కాంగ్రెస్ సిగ్గుపడాలి కృత్రిమ మేధ (ఏఐ) సమిట్‌లో యువజన కాంగ్రెస్ అర్ధనగ్న నిరసనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పని చేసినందుకు ఆ పార్టీ సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.
- అస్సాంలో నెహ్రూ విగ్రహం ధ్వంసం అస్సాంలోని కచర్ జిల్లాలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. బారక్ వ్యాలీ ప్రాంతంలోని లఖిపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- సురక్షిత రక్తం పొందడం జీవించే హక్కులో భాగమే ఎలాంటి వ్యాధికారక క్రిములూ లేని సురక్షితమైన రక్తం పొందే హక్కు రాజ్యాంగంలోని 21వ అధికరణంలో పేర్కొన్న జీవించే హక్కులో అంతర్భాగమేనని ప్రకటించాల్సిందిగా కోరుతూ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) సుప్రీంకోర్టులో దాఖలైంది.
- 30 ఏళ్ల నాటి ప్రసంగాల్ని ఇప్పుడు ప్రవేశపెడితే ఎలా? జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐయే) నమోదు చేసిన కేసులో బెయిలు కోసం కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు షబీర్ అహ్మద్ షా దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
- పర్యావరణ అనుమతులపై తిరిగి సమీక్ష ప్రారంభించిన సుప్రీంకోర్టు పర్యావరణ చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించిన ప్రాజెక్టు నిర్వాహకుల నుంచి కేంద్ర ప్రభుత్వం, ఇతర ప్రాధికార సంస్థలు భారీ జరిమానాలు వసూలు చేసి చట్టాల వర్తింపు నుంచి మినహాయింపు ఇచ్చిన తేదీ నాటి నుంచీ అమల్లోకి వచ్చేలా అనుమతులు మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు బుధవారం తిరిగి విచారణ ప్రారంభించింది.
- బ్రోకలీ, పర్పుల్ క్యాబేజీతో గుజరాత్ రైతు లాభాల సాగు గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా అంధారియావాడ్ గ్రామ రైతు శాంతిభాయ్ వేగడ్ బ్రోకలీ, పర్పుల్ క్యాబేజీ లాంటి విదేశీ కూరగాయలను పండించి మంచి లాభాలు గడిస్తున్నారు.
- పాక్ అనుకూల శక్తులతో రాహుల్‌కు సంబంధాలు భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.