ఒక్క బంతీ పడకుండానే..

Eenadu icon
By Sports News Desk Published : 22 Feb 2026 02:26 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

కొలంబో: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 దశకు నిరాశాజనక ఆరంభం. శనివారం న్యూజిలాండ్, పాకిస్థాన్‌ మధ్య జరగాల్సిన గ్రూప్‌-2 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. రెండు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. చిరుజల్లుల మధ్య పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ వర్షం క్రమంగా పెద్దదైంది. కుండపోత వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అంపైర్లకు మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. ఈ మ్యాచ్‌ కోసం తుది జట్టులో పాకిస్థాన్‌ ఒక మార్పు చేసింది. ఖవాజా నఫే స్థానంలో ఫకర్‌ జమాన్‌ను తీసుకుంది. న్యూజిలాండ్‌ జట్టులో మూడు మార్పులు జరిగాయి. అనారోగ్యంతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ శాంట్నర్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఫెర్గూసన్, ఇష్‌ సోధిలకు కూడా తుది జట్టులో స్థానం లభించింది. అయితే ఎడతెరిపిలేని వాన కారణంగా మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. పాకిస్థాన్‌ తన తర్వాతి మ్యాచ్‌లో 24న ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. న్యూజిలాండ్‌ జట్టు 25న శ్రీలంకతో ఆడుతుంది. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • చెన్నై.. పరుగుల సంద్రమా.. టీమ్‌ఇండియాకు ఆనందమా! పొట్టి ప్రపంచకప్ సూపర్‌-8లో భాగంగా భారత్‌, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. దీనికి చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది.
  • గట్టిగా కొడితేనే.. గట్టెక్కేది! డిఫెండింగ్‌ ఛాంపియన్‌. ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టింది. ఆశించినంత ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయినా గ్రూప్‌ దశలో అగ్రస్థానం సాధించింది.
  • లంక ఔట్‌ ఆతిథ్య శ్రీలంకకు షాక్‌! సూపర్‌-8లో మరో మ్యాచ్‌ ఉండగానే ఆ జట్టు టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది.
  • భారత్‌కు మేలుకొలుపు సూపర్‌ 8లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం భారత జట్టుకు ఒకరకంగా మేలు చేసేదేనని మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
  • ఎవరిదో గెలుపు జోరుమీదున్న వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు గురువారం టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 మ్యాచ్‌లో తలపడనున్నాయి. రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. వెస్టిండీస్‌ హిట్టింగ్‌ సామర్థ్యానికి దక్షిణాఫ్రికా పేస్‌ దళం నుంచి గట్టి పరీక్ష ఎదురుకానుంది.
  • జమ్మూకశ్మీర్‌ 527/6 తొలిసారి రంజీ ఫైనల్‌ ఆడుతున్న జమ్మూకశ్మీర్‌ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. కర్ణాటకతో పోరులో ఆ జట్టు బలమైన స్థితిలో నిలిచింది.
  • పాక్‌ ఆటగాళ్లపై వివక్ష వద్దు: ఈసీబీ ‘ది హండ్రెడ్‌’ క్రికెట్‌ లీగ్‌ వేలంలో ఆటగాళ్ల జాతీయతను ప్రాతిపదికగా తీసుకుని వారిని పక్కన పెట్టకూడదని ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ), ఫ్రాంచైజీలు స్పష్టంచేశాయి.
  • ఒత్తిడిలో ఏమైనా జరగొచ్చు టీమ్‌ఇండియాతో వారి సొంతగడ్డపై పోరంటే సవాలేనని జింబాబ్వే ఆల్‌రౌండర్‌ ర్యాన్‌ బర్ల్‌ వ్యాఖ్యానించాడు. గురువారం భారత్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ..
  • సంక్షిప్త వార్తలు (5) హాకీ ప్రొ లీగ్‌లో భారత్‌ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. బుధవారం షూటౌట్‌లో 3-1తో ఆస్ట్రేలియాపై నెగ్గింది. శిలానంద్‌ లక్రా, మణిందర్‌ సింగ్, విష్ణుకాంత్‌ సింగ్‌ షూటౌట్‌లో గోల్స్‌ కొట్టి.. టోర్నీలో భారత్‌కు తొలి విజయాన్నందించారు.