పదేళ్ల తర్వాత పడగొట్టారు

- A
- A+
- A++

‘‘ఆస్ట్రేలియాను వాళ్ల దేశంలోనే ఓడించడం ఎంతో ప్రత్యేకం. నేనూ ఈ విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. జెమీమా క్రీజులో వచ్చే సమయానికి బంతికో పరుగు చొప్పున చేశా. జెమీమా స్వేచ్ఛగా ఆడుతూ నాపై ఒత్తిడి తగ్గించింది. దీంతో సహజశైలిలో రాణించగలిగా’’
భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో దశాబ్దం తర్వాత ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో హర్మన్‌ప్రీత్ బృందం 17 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. మొదట భారత్ 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (82; 55 బంతుల్లో 8×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ (59; 46 బంతుల్లో 4×4) కూడా రాణించింది. శ్రేయాంక పాటిల్ (3/22), శ్రీచరణి (3/32), అరుంధతి రెడ్డి (2/35) విజృంభించడంతో ఛేదనలో ఆసీస్ 159/9కే పరిమితమైంది. ఆష్లీ గార్డ్‌నర్ (57; 45 బంతుల్లో 5×4, 1×6), ఫీబీ లిచ్‌ఫీల్డ్ (26; 17 బంతుల్లో 4×4) మాత్రమే పోరాడారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ నెగ్గగా.. రెండో మ్యాచ్‌ను కంగారూ జట్టు గెలుచుకుంది.
బౌలర్లు చుట్టేశారు:ఛేదనలో ఆస్ట్రేలియా మొదట దూకుడుగానే ఆడింది. తొలి 7 బంతులకు 19 పరుగులు చేసింది. కానీ మరో 14 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి 32/3తో ఇబ్బందుల్లో పడింది. రెండో ఓవర్లోనే జార్జియా వోల్ (10)ను ఔట్ చేసిన శ్రేయాంక.. తర్వాత పెర్రీ (1)ని కూడా పెవిలియన్ చేర్చింది. బెత్ మూనీ (6) కూడా ఎంతోసేపు నిలవలేదు. ఒకవైపు ఆష్లీ గార్డ్‌నర్ పోరాడినా.. ఆమెకు సహకారం ఇచ్చే వాళ్లు కరవయ్యారు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి.. ఆస్ట్రేలియాను పోటీలో లేకుండా చేశారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన మెరుపులే హైలైట్. షెఫాలి వర్మ (7) త్వరగానే ఔటైనా.. స్మృతి తన శైలిలో స్కోరు పెంచింది. ఆఫ్‌సైడ్ ఆమె కొన్ని కళ్లుచెదిరే షాట్లు కొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ నుంచి స్మృతికి చక్కటి సహకారం అందింది. మోలనూ వేసిన ఆరో ఓవర్లో స్మృతి రెండు.. జెమీమా ఒక ఫోర్ కొట్టారు. ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా బ్యాట్ ఝుళిపించడంతో 10 ఓవర్లకు 86/1తో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. డార్సీ బ్రౌన్ వేసిన 12వ ఓవర్లో ఓ మెరుపు సిక్స్ బాదిన స్మృతి.. 38 బంతుల్లో అర్ధసెంచరీ అందుకుంది. శతకం చేసేలా కనిపించిన ఆమె.. అనాబెల్ వేసిన 17వ ఓవర్లో ఔటైంది. 41 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన జెమీమా.. భారత్ స్కోరును 170 దాటించింది. 20వ ఓవర్లో భారత్ 3 వికెట్లు కోల్పోయి 3 పరుగులే చేసింది.
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ పదేళ్ల తర్వాత ఓ సిరీస్ గెలిచింది. చివరగా 2016లో మిథాలీరాజ్ సారథ్యంలోని భారత్.. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు అంతే తేడాతో కంగారూ జట్టును ఓడించింది.

భారత్ ఇన్నింగ్స్:స్మృతి మంధాన (సి) ఆష్లీ గార్డ్‌నర్ (బి) అనాబెల్ 82; షెషాలి వర్మ (సి) అనాబెల్ (బి) కిమ్ గార్త్ 7; జెమీమా (సి) పెర్రీ (బి) అనాబెల్ 59; రిచా ఘోష్ (సి) వోల్ (బి) మోలనూ 18; హర్మన్‌ప్రీత్ నాటౌట్ 2; అమన్‌జ్యోత్ రనౌట్ 1; దీప్తి రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176; వికెట్ల పతనం:1-19, 2-140, 3-168, 4-174, 5-175, 6-176; బౌలింగ్: డార్సీ బ్రౌన్ 3-0-27-0; ఆష్లీ గార్డ్‌నర్ 4-0-36-0; కిమ్ గార్త్ 3-0-25-1; సోఫీ మోలనూ 4-0-34-1; అనాబెల్ సదర్లాండ్ 4-0-34-2; జార్జియా వేర్‌హామ్ 2-0-19-0
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్:జార్జియా వోల్ (సి) రేణుక (బి) శ్రేయాంక 10; బెత్ మూనీ (సి) శ్రీచరణి (బి) రేణుక 6; లిచ్‌ఫీల్డ్ (సి) షెఫాలి (బి) శ్రీచరణి 26; ఎలిస్ పెర్రీ (బి) శ్రేయాంక 1; ఆష్లీ గార్డ్‌నర్ (సి) జెమీమా (బి) అరుంధతి 57; జార్జియా వేర్‌హామ్ (సి) అమన్‌జ్యోత్ (బి) అరుంధతి 12; అనాబెల్ సదర్లాండ్ ఎల్బీ (బి) శ్రేయాంక 14; గ్రేస్ హారిస్ హిట్ వికెట్ (బి) శ్రీచరణి 1; సోఫీ మోలనూ ఎల్బీ (బి) శ్రీచరణి 6; కిమ్ గార్త్ నాటౌట్ 7; డార్సీ బ్రౌన్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159; వికెట్ల పతనం:1-19, 2-21, 3-32, 4-63, 5-98, 6-128, 7-130, 8-137, 9-143; బౌలింగ్: రేణుక సింగ్ 3-0-29-1; శ్రేయాంక పాటిల్ 4-0-22-3; దీప్తి శర్మ 4-0-27-0; అరుంధతి రెడ్డి 4-0-35-2; శ్రీచరణి 4-0-32-3; అమన్‌జ్యోత్ కౌర్ 1-0-11-0
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 02:29 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చెన్నై.. పరుగుల సంద్రమా.. టీమ్‌ఇండియాకు ఆనందమా! పొట్టి ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా భారత్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. దీనికి చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది.
- గట్టిగా కొడితేనే.. గట్టెక్కేది! డిఫెండింగ్ ఛాంపియన్. ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టింది. ఆశించినంత ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయినా గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించింది.
- లంక ఔట్ ఆతిథ్య శ్రీలంకకు షాక్! సూపర్-8లో మరో మ్యాచ్ ఉండగానే ఆ జట్టు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
- భారత్‌కు మేలుకొలుపు సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం భారత జట్టుకు ఒకరకంగా మేలు చేసేదేనని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
- ఎవరిదో గెలుపు జోరుమీదున్న వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు గురువారం టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్‌లో తలపడనున్నాయి. రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. వెస్టిండీస్ హిట్టింగ్ సామర్థ్యానికి దక్షిణాఫ్రికా పేస్ దళం నుంచి గట్టి పరీక్ష ఎదురుకానుంది.
- జమ్మూకశ్మీర్ 527/6 తొలిసారి రంజీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. కర్ణాటకతో పోరులో ఆ జట్టు బలమైన స్థితిలో నిలిచింది.
- పాక్ ఆటగాళ్లపై వివక్ష వద్దు: ఈసీబీ ‘ది హండ్రెడ్’ క్రికెట్ లీగ్ వేలంలో ఆటగాళ్ల జాతీయతను ప్రాతిపదికగా తీసుకుని వారిని పక్కన పెట్టకూడదని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), ఫ్రాంచైజీలు స్పష్టంచేశాయి.
- ఒత్తిడిలో ఏమైనా జరగొచ్చు టీమ్‌ఇండియాతో వారి సొంతగడ్డపై పోరంటే సవాలేనని జింబాబ్వే ఆల్‌రౌండర్ ర్యాన్ బర్ల్ వ్యాఖ్యానించాడు. గురువారం భారత్‌తో మ్యాచ్ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ..
- సంక్షిప్త వార్తలు (5) హాకీ ప్రొ లీగ్‌లో భారత్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. బుధవారం షూటౌట్‌లో 3-1తో ఆస్ట్రేలియాపై నెగ్గింది. శిలానంద్ లక్రా, మణిందర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్ షూటౌట్‌లో గోల్స్ కొట్టి.. టోర్నీలో భారత్‌కు తొలి విజయాన్నందించారు.