ఫార్మా ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి

Eenadu icon
By Business News Desk Published : 22 Feb 2026 02:47 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయ ఫార్మా ఎగుమతులు 9.4 శాతం వృద్ధితో రూ.2.7 లక్షల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2026-27 నాటికి ఇందులో రెండంకెల వృద్ధిని పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ప్రస్తుతం ఫార్మా రంగం  సుమారు  రూ.5.4 లక్షల కోట్ల దరిదాపుల్లో ఉందని, 2030 నాటికి రూ.11.70 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఉత్పత్తి పరంగా ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉన్న భారత్‌ 200కు పైగా దేశాలకు మందులను ఎగుమతి చేస్తోంది. మొత్తం ఎగుమతుల్లో 60 శాతానికి పైగా కఠిన నిబంధనలు ఉన్న మార్కెట్లకే వెళ్తున్నాయని, భారత ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటా 34%, ఐరోపా వాటా 19 శాతంగా ఉంది. ఎగుమతుల్లో వేగాన్ని కొనసాగించేందుకు అనుకూలమైన పరిస్థితులను కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించింది. 2026-27లో రెండంకెల వృద్ధిని లక్ష్యంగా చేసుకునేందుకు పరిశ్రమ సైతం సిద్ధంగా ఉందని పేర్కొంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ‘చింతన్‌ శిబిర్‌’లో భాగంగా పరిశ్రమ వర్గాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ప్రపంచ మార్కెట్లను చేరుకునేందుకు అడ్డంకిగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు విదేశాల్లోని నియంత్రణ సంస్థలు, భారత రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ముంచుకొస్తోంది ఏఐ సునామీ కృత్రిమ మేధ (ఏఐ) ఒక సునామీలా ప్రపంచం మీదికి దూసుకొస్తోందని, కానీ, దానిని ఎదుర్కొనేందుకు సమాజం ఇంకా సిద్ధం కాలేదని ఆంథ్రోపిక్‌ సీఈఓ డారియో ఆమోడెయ్‌ పేర్కొన్నారు.
  • మార్కెట్లకు ఐటీ షాక్‌ దేశీయ సూచీలను ఐటీ షేర్లు కుంగదీశాయి. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వల్ల సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీలకు ఇబ్బందులు తప్పవనే ఆందోళనల నేపథ్యంలో ఐటీ షేర్లు కుప్పకూలాయి.
  • చంద్రశేఖరన్‌ పునర్నియామకంపై నిర్ణయం వాయిదా టాటా గ్రూప్‌ ప్రధాన సంస్థ టాటా సన్స్‌ ఛైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ను మూడోసారి పునర్నియమించడంపై నిర్ణయాన్ని బోర్డు వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.
  • విమానయాన సంస్థల నష్టాలు రూ.17,000- 18,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) భారత విమానయాన సంస్థల నష్టాలు రూ.17,000- 18,000 కోట్లుగా ఉండొచ్చని రేటింగ్స్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది.
  • దేశంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య @ 59.50 లక్షలు అంతర్జాతీయ అనిశ్చితులు, ఏఐ ప్లాట్‌ఫామ్‌ల రాకతో మార్పులు.. వీటన్నిటి మధ్య కూడా భారత టెక్‌ రంగం రాణిస్తోంది. 2025-26లో ఈ రంగ ఆదాయం 6.1% వృద్ధితో 315 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.28.35 లక్షల కోట్ల)కు చేరొచ్చని పరిశ్రమ సంఘం నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది. 
  • వీటి సామర్థ్యం తక్కువేమీ కాదు: హురున్‌ అధిక సామర్థ్యం కలిగి, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుకు తగిన పనితీరు ప్రదర్శిస్తున్న 100 కంపెనీల జాబితాను జేఎం ఫైనాన్షియల్‌ హురున్‌ ఇండియా విడుదల చేసింది.
  • వ్యవసాయ ఎగుమతులకు సుంకం ప్రయోజనాలు తగ్గవ్‌ ఎగుమతిదార్లకు మద్దతునిచ్చే పథకం కింద పన్ను ప్రయోజనాలను తగ్గించినప్పటికీ.. అవి వ్యవసాయ, ప్రాసెస్డ్‌ ఆహార ఉత్పత్తులకు వర్తించవని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది.
  • సెమాగ్లుటైడ్‌ కోసం నాట్కోతో ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ భాగస్వామ్యం దీర్ఘకాలిక ఊబకాయం, టైప్‌-2 మధుమేహం నియంత్రణ కోసం వినియోగిస్తున్న సెమాగ్లుటైడ్‌ ఔషధాన్ని భారత మార్కెట్లో విక్రయించేందుకు ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్, నాట్కో ఫార్మా కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
  • బాండ్లతో రూ.5,000 కోట్ల సమీకరణ: కెనరా బ్యాంక్‌ భవిష్యత్తు వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా, మూలధనాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు టైర్‌-2 బాండ్ల ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించబోతున్నట్లు కెనరా బ్యాంక్‌ వెల్లడించింది.
  • ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ మోసంలో మొత్తం సొమ్ము రికవరీ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ శాఖలో జరిగిన మోసం కేసులో, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు రూ.556 కోట్లను రికవరీ చేసినట్లు హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ మంగళవారం ప్రకటించారు.
  • మెటాకు ఏఎమ్‌డీ నుంచి రూ.9 లక్షల కోట్ల చిప్‌లు! ఫేస్‌బుక్‌ యజమాని మెటా ప్లాట్‌ఫామ్స్‌ 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.9 లక్షల కోట్లు) విలువైన కృత్రిమ మేధ(ఏఐ) చిప్‌లను అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌ (ఏఎమ్‌డీ) నుంచి కొనుగోలు చేయనుంది.
  • సంక్షిప్త వార్తలు (7) ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ)లో ప్రభుత్వం 4% వరకు వాటాను విక్రయించనుంది.