ట్రంప్.. ఆ రూ.12 లక్షల కోట్లు వెనక్కి ఇస్తారా?

- A
- A+
- A++

ట్రంప్ విధించిన టారిఫ్‌లపై సుప్రీం కోర్టు తీర్పయితే వచ్చింది కానీ.. ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన భారీ మొత్తాన్ని ఎలా తిరిగి చెల్లిస్తారనే విషయమై అనిశ్చితి నెలకొంది. ట్రంప్ ప్రభుత్వానికి టారిఫ్‌ల ద్వారా ఇప్పటివరకు సుమారు 133 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం భారత కరెన్సీలో దాదాపు రూ.12 లక్షల కోట్లు. ఇప్పుడు ఆ డబ్బును ఎలా తిరిగి ఇస్తారనేదే పెద్ద ప్రశ్న.
ఎవరికిస్తారు..
ట్రంప్ ప్రభుత్వం దిగుమతుల ద్వారా 133 బిలియన్ డాలర్లు వసూలు చేయడం చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రకటించారు. ఈ రిఫండ్లు ప్రధానంగా వస్తువులను దిగుమతి చేసుకున్న కంపెనీలకే అందుతాయని తెలుస్తోంది. వస్తువుల ధరలు పెరగడం వల్ల నష్టపోయిన సాధారణ వినియోగదారులకు డబ్బులు వాపసు వచ్చే అవకాశం తక్కువని సమాచారం. ఈ నేపథ్యంలో రిఫండ్ కోసం కంపెనీలు కోర్టులో కేసులు దాఖలు చేస్తున్నాయి. ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు నమోదైనట్టు సమాచారం. మరిన్ని కేసులు దాఖలయ్యే అవకాశాలున్నాయి. రిఫండ్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండబోతోందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీనికి 12 నుంచి 18 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
న్యాయపరమైన చిక్కులు..
ప్రస్తుతం భారీ మొత్తంలో డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉండటంతో కంపెనీల కోసం ట్రంప్ ప్రభుత్వం ఓ వెబ్‌సైట్ రూపొందించే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. రిఫండ్ ప్రక్రియలో పలు న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సరఫరాదారులకు ఏదైనా రిఫండ్ దక్కితే దానిలో భాగం కావాలని ఉత్పత్తిదారులు కేసులువేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఈ తరహా ఘటనల్లో కొన్నేళ్ల నుంచి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కోర్టుల్లో మరో అయిదేళ్ల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. మరోవైపు పలు రాష్ట్రాల గవర్నర్లు తమ రాష్ట్ర ప్రజల తరపున బిలియన్ల కొద్దీ డాలర్లను ట్రంప్ ప్రభుత్వం నుంచి రిఫండ్‌గా డిమాండ్ చేస్తున్నారు.
కార్మిక రంగాలకు ఊరటే..
సెక్షన్ 232 కింద ఉక్కు, అల్యూమినియంపై విధించిన 50 శాతం సుంకం, కొన్ని వాహన విడిభాగాలపై ఉన్న 25 శాతం సుంకాలు యథాతథంగా కొనసాగుతాయి. ఈ అంశంపై స్పష్టత కోసం భారత ప్రతినిధి బృందం వచ్చే వారం అమెరికా వెళ్లనుంది. భారత ఎగుమతిదారులకు, ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా పనిచేసే వస్త్ర, ఆభరణాల రంగాలకు రాబోయే 150 రోజుల పాటు ఈ తగ్గిన టారిఫ్ రేటు పెద్ద ఊరటనిస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
2021-25 మధ్య భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత మొత్తం ఎగుమతుల్లో 18% వాటా అగ్రరాజ్యానిదే. 2024-25లో ద్వైపాక్షిక వాణిజ్యం 186 బి.డాలర్లు(రూ.16.7 లక్షల కోట్లు)గా ఉంది. సేవల విషయానికొచ్చినా భారత్ నుంచి 28.7 బి.డాలర్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయి. మొత్తం మీద (వస్తువులు, సేవలు) చూస్తే వాణిజ్య మిగులు అమెరికాతో 44.4 బి. డాలర్లుగా ఉంది.
2024లో ఈ రంగాల నుంచే అధిక ఎగుమతులు:ఫార్ములేషన్లు, బయోలాజికల్స్ (8.1 బి.డాలర్లు), టెలికాం ఇన్‌స్ట్రుమెంట్లు (6.5 బి. డాలర్లు), విలువైన, పాక్షిక విలువైన రాళ్లు (5.3 బి.డాలర్లు), పెట్రోలియం ఉత్పత్తులు (4.1 బి.డాలర్లు), వాహన, వాహన విడిభాగాలు (2.8 బి.డాలర్లు), బంగారం, ఇతర ఆభరణాలు (3.2 బి.డాలర్లు), రెడీమేడ్ దుస్తులు, యాక్సెసరీలు (2.8 బి. డాలర్లు), ఇనుము-ఉక్కు ఉత్పత్తులు (2.7 బి. డాలర్లు).
‘సుంకాలపై శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు తీర్పును గమనించాం. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పందించారు. ఆ దేశ యంత్రాంగం కొన్ని చర్యలను ప్రకటించింది. ఈ పరిణామాలన్నింటి ప్రభావాలపైనా నిశితంగా అధ్యయనం చేస్తున్నాం.’

‘అమెరికా సుప్రీం కోర్టు నేపథ్యంలో ప్రతీకార సుంకాలు తగ్గాయి. ఆ దేశంతో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని భారత్ పునఃసమీక్షించుకోవాలి. ప్రస్తుతం అమెరికాకు భారత ఎగుమతుల విలువలో 55 శాతంపై మాత్రమే ప్రతీకార సుంకాలు వర్తిస్తాయి. సుమారు 40 శాతం వస్తువులు మినహాయింపు పొందిన విభాగాల్లో ఉన్నాయి. అయితే రంగాల వారీ సుంకాలు (ఉక్కు, అల్యూమినియం, రాగి-50 శాతం, కొన్ని వాహన విడిభాగాలు -25 శాతం) కొనసాగుతాయి’.

‘ఇప్పుడు భారతీయ వస్తువులపై సుంకాలు తగ్గాయి. అమెరికాలో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్) లేదా దిగుమతి సుంకాలకు మించి ఇవి ఉంటాయి. ఉదాహరణకు ఒక ఉత్పత్తి 5 శాతం ఎంఎఫ్‌ఎన్ సుంకాన్ని ఎదుర్కొంటుంటే, అదనంగా ట్రంప్ ప్రకటించిన సుంకాన్ని విధిస్తారు. గతంలో ఇది 5+25 శాతంగా ఉంది’.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్పామ్ మెసేజ్‌లు అరికట్టేందుకు ఎయిర్‌టెల్, గూగుల్ భాగస్వామ్యం సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్)లో స్పామ్‌ను అరికట్టేందుకు ఏఐ (కృత్రిమమేధ) ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్‌ను భారతీ ఎయిర్‌టెల్ వినియోగించనుంది.
- మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయా? పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. మన దేశానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు సగం మేర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. అయితే ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగినా, మన వద్ద తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
- భారత్‌కు చమురు ముప్పు ఎంత? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించడంతో, ఈ ప్రాంతంలో యుద్ధం తీవ్రమైంది. వెనెజువెలా అధ్యక్షుణ్ని అమెరికా బందీగా పట్టుకెళ్లినా, పరిస్థితులు విషమించలేదు.
- ఫిబ్రవరిలో వాహన విలాసమే దేశీయ విపణిలో స్థిరమైన గిరాకీ లభిస్తున్నందున.. ఫిబ్రవరిలో అగ్రగామి వాహన కంపెనీలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తమ టోకు విక్రయాల్లో వృద్ధి నమోదుచేశాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విపణిలో 1,61,000 వాహనాలు విక్రయించింది.
- మార్కెట్‌కు ‘యుద్ధ’ నష్టాలే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు సహా ముఖ్యనేతలు హతమవ్వడం, తదనంతర పరిణామాలు స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇప్పటికే బలహీనంగా ఉన్న మదుపర్ల సెంటిమెంటు మరింత దిగజారనుంది.
- పసిడి, వెండి పెరుగుతాయ్ పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ సహా పలువురు ముఖ్యనేతలు హతమవ్వడం, ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో.. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.
- గెయిల్ ఛైర్మన్‌గా దీపక్ గుప్తా బాధ్యతల స్వీకరణ దేశీయ అతిపెద్ద గ్యాస్ సరఫరా సంస్థ గెయిల్ ఇండియా, ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టరుగా దీపక్ గుప్తా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి 28 వరకు ఈయన ఈ పదవిలో ఉంటారు.
- 28 స్థిరాస్తి సంస్థలు.. రూ.1.33 లక్షల కోట్ల అమ్మకాలు దేశంలోని 28 నమోదిత స్థిరాస్తి సంస్థలూ కలిసి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబరులో రూ.1.33 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరిపాయి. ప్రీమియం, విలాసవంత ఇళ్లు/ఫ్లాట్లకు గిరాకీ లభించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
- ఐఐఎఫ్‌సీఎల్ పబ్లిక్ ఇష్యూ 2026-27లో ప్రభుత్వరంగ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది.
- మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ సినీలక్స్.. ఫీచర్లివీ! మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ, విద్యుత్తు ఎస్‌యూవీ ఎక్స్‌ఈవీ 9ఇ సినీలక్స్ ఎడిషన్‌ను ఆదివారం ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.29.35 లక్షలు (ఎక్స్‌షోరూం) అని ప్రకటించింది.
- వజ్రపుటుంగరం కొనేద్దాం అసలే పెళ్లిళ్ల సీజను. ఆభరణాలు కొనకుండా ఉండలేని పరిస్థితి. అయితే బంగారం ఉంగరం బదులుగా వజ్రపుటుంగరం వైపు దృష్టి పెట్టేందుకు వజ్రాల ధరలు వీలు కల్పిస్తున్నాయి.
- భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనా? ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడులు పశ్చిమాసియాలో భద్రతాపరమైన ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి.
- హార్డ్‌వేర్‌లోనూ బలమైన శక్తిగా భారత్ గుజరాత్‌లోని సనంద్‌లో మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీ కండక్టర్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌లో బలమైన శక్తిగా ఎదిగిన తర్వాత, హార్డ్‌వేర్ రంగంలో కూడా దేశం తన గుర్తింపును దృఢంగా నిర్మిస్తోందని ఆయన తెలిపారు.
- ఆంథ్రోపిక్‌కు ట్రంప్ షాక్ కృతిమ మేధ(ఏఐ) టూల్స్‌తో ప్రపంచాన్నే ఆకర్షించిన అమెరికా కంపెనీ ఆంథ్రోపిక్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. ఆంథ్రోపిక్‌కు చెందిన ఏఐ సాంకేతికతను వినియోగించడాన్ని ఆపాలని అన్ని అమెరికా ప్రభుత్వ విభాగాలను ఆయన ఆదేశించారు.
- ప్రయాణాల్లో మార్పులకు సిద్ధపడాల్సిందే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గగనతల ఆంక్షలు, మార్గ మళ్లింపుల వల్ల విమాన కార్యకలాపాలకు అంతరాయాలు చోటుచేసుకోనున్నాయి.
- స్కైరూట్ నుంచి ధావన్-3 క్రయోజెనిక్ ఇంజిన్ అంతరిక్ష రంగంలోని స్కైరూట్ ఏరోస్పేస్ అత్యంత ఆధునిక ‘ధావన్-3’ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. దాదాపు 145 సెకన్లపాటు నిర్వహించిన సామర్థ్య పరీక్ష..
- ఈ ఏడాది వేతనాల్లో 9.1% వృద్ధి ప్రస్తుత సంవత్సరం(2026)లో వేతనాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. గత సంవత్సరంలో నమోదైన 8.9% వేతన పెంపు కంటే ఇది ఎక్కువే. వార్షిక వేతన పెంపు అంశంపై అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఏఓఎన్ ఈ సర్వేను నిర్వహించింది.
- జనవరిలో విమాన ప్రయాణికులు 1.52 కోట్లు 2026 జనవరిలో దేశీయ విమాన ప్రయాణికులు 2025 జనవరితో పోలిస్తే 4.36 శాతం పెరిగి 1.529 కోట్లకు చేరారని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది.
- భారత ఈవీ రంగంలోకి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు గత ఐదేళ్లలో భారత విద్యుత్ వాహన (ఈవీ) రంగం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్ (ఐఈఈఎఫ్‌ఏ) నివేదిక తెలిపింది.
- సంక్షిప్తవార్తలు 2035 నాటికి నికర శూన్య ఉద్గారాలను లక్ష్యంగా చేసుకున్నందున, పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో సాయపడే పవన విద్యుత్ ప్రాజెక్టును మహారాష్ట్రలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని గెయిల్ ఇండియా రూ.1,736.25 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.