ట్రైలర్‌తో ధురంధర్ 2 యాక్షన్ ట్రీట్?

- A
- A+
- A++

గతేడాది బాక్సాఫీసు వద్ద వసూళ్ల మోత మోగించిన ‘ధురంధర్’ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీప్రియులు. ఇప్పుడు వారందరికీ ట్రైలర్‌తో మరోసారి యాక్షన్ హంగామాని రుచి చూపించడానికి సన్నాహాలు చేస్తోందట చిత్రబృందం. బాలీవుడ్ కథానాయకుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమే ‘ధురంధర్ 2’. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘‘ధురంధర్ 2’.. ప్రతి సన్నివేశంలోనూ మొదటి భాగాన్ని మించేలా ఉంటుంది. ఇప్పుడు రాబోయే ట్రైలర్ యాక్షన్ ట్రీట్‌లా ఉంటుంది అభిమానులకు. యాక్షన్ నుంచి భావోద్వేగాల వరకూ.. ప్రతిదీ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంద’’ని రణ్‌వీర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ మార్చి 19న థియేటర్లలోకి రానుంది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆలోటు తీరింది: రాజమౌళి ‘‘బాహుబలి’, ‘ఈగ’ లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మన దగ్గర మోషన్ క్యాప్చర్ సాంకేతికత అందుబాటులో ఉంటే బాగుండేదని అనుకునేవాణ్ని’’ అని దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. ఇప్పుడా సాంకేతికత అన్నపూర్ణ స్టూడియోలో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
- వృషకర్మ ప్రపంచంలోకి ఆ రోజే ‘తండేల్’ విజయం తర్వాత కథానాయకుడు నాగచైతన్య నుంచి రానున్న సినిమా ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మిస్తున్నాయి.
- వందశాతం నవ్వుకుంటారు.. నాదీ బాధ్యత: శ్రీవిష్ణు ‘‘అందరికీ ఓ మంచి అనుభూతిని అందించే సినిమా ‘విష్ణు విన్యాసం’. హ్యాపీగా కుటుంబంతో కలిసి నవ్వుకోవడానికి థియేటర్‌కి రండి. వందశాతం నవ్వుకుంటారు. ఆ బాధ్యత నాది’’ అన్నారు హీరో శ్రీవిష్ణు.
- రాఖీ పండక్కి భోగి కథానాయకుడు శర్వానంద్.. దర్శకుడు సంపత్ నంది కలయికలో ‘భోగి’ పేరుతో ఓ పాన్ ఇండియా చిత్రం ముస్తాబవుతోంది. కేకే రాధామోహన్ నిర్మాత. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలు.
- సంక్షిప్త వార్తలు (4) ప్రయోగాత్మక పాత్రలతో ఇటు దక్షిణాదితోపాటు అటు ఉత్తరాదిలోనూ అగ్రహీరోల సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది నటి ప్రియమణి. ఇటీవల ఓ ఇండో- హాలీవుడ్ చిత్రంలోనూ భాగమైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
- అలా చేయకపోతే... ఏమీ మిగలదు! నటీనటులు వరుస విజయాలతో జోరుమీదున్నప్పుడు సంపాదించడం సర్వసాధారణం. కానీ, దానిని సరైన సమయంలో ఆదా చేయకపోతే చివరికి ఆర్థిక నష్టాలే మిగులుతాయంటోంది కథానాయిక తమన్నా.
- విరోష్ వివాహం ప్రధాని శుభాకాంక్షలు వెండితెరపై జంటగా అలరించిన విజయ్ దేవరకొండ - రష్మిక నేడు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జంటకు భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి శుభాకాంక్షలు అందాయి. విజయ్ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వాన పత్రికకు స్పందనగా కాబోయే జంటకు ఆశీసులు అందిస్తూ మోదీ లేఖ పంపారు.
- నేటి నుంచి ఈటీవీ విన్‌లో ‘శ్రీచిదంబరంగారు’ ‘‘కొత్త ఆలోచనలతో వస్తున్న దర్శకులకు ఈటీవీ విన్ అండగా నిలుస్తోంది. ఆ సంస్థ కారణంగా కొత్త కథలు వెలుగు చూడటంతోపాటు... కొత్త రకమైన దర్శకులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.