మళ్లీ కలిశారు... మరి హీరో ఎవరు?

Eenadu icon
By Cinema Desk Published : 22 Feb 2026 02:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

సినీ ప్రయాణం ఆరంభమైన తొలి రోజుల్లో అగ్ర కథానాయకులు రజనీకాంత్‌ - కమల్‌హాసన్‌ కలిసి పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. పలు భాషల్లో ఆ సినిమాలు విడుదలై విజయాల్ని అందుకున్నాయి. అగ్ర కథానాయకులు అయ్యాక వీరి కలయికలో సినిమాలు రాలేదు. ఈ ఇద్దరూ కలిసి నటించనున్న సినిమా కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. 47 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కలయికలో సినిమా రూపొందుతోంది. కమల్‌హాసన్‌ వర్సెస్‌ రజనీకాంత్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. శనివారం ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. హీరో ఎవరు? అనే ప్రశ్నతో ముగిసే ఆ వీడియోలో కమల్‌హాసన్, రజనీకాంత్‌తోపాటు దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్‌ కనిపించారు. ‘‘భారతీయ సినిమాకి ఇవి చారిత్రక క్షణాలు. ఇద్దరు దిగ్గజ కథానాయకుల కలయికలో సినిమాని నిర్మిస్తుండడం గర్వంగా, గౌరవంగా ఉంది. ఈ సినిమాని ఎంతో బాధ్యతగా తీసుకుని రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతిని పంచుతామ’’ని నిర్మాణ వర్గాలు చెప్పాయి. నెల్సన్‌ గతంలో రజనీకాంత్‌తో ‘జైలర్‌’ తీసి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘జైలర్‌ 2’ చేస్తున్నారు. ఆ వెంటనే కమల్‌ - రజనీకాంత్‌ కలయికలో సినిమాని రూపొందిస్తుండడం విశేషం. 

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అక్షయ్‌ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి: మృణాల్‌ ఠాకూర్‌ శరీరాకృతి ఎలా ఉన్నప్పటికీ.. ముందుగా మనల్ని మనం గౌరవించుకుంటే ఇతరులు కూడా విలువిస్తారంటోంది హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌.
  • వందశాతం థియేటర్‌ అనుభవాన్నిచ్చే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ‘‘థియేటర్‌ అనుభవమే అసలు సిసలైన సినిమా వినోదం. వేరే ఎక్కడ చూసినా అంత ఆనందం రాదు.  థియేటర్‌నే లక్ష్యంగా చేసుకుని మొదలుపెట్టిన ఈ సినిమాని అక్కడే విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ నటుడు శివాజీ.
  • కథల ఎంపికే కారణమైనా కానీ...! చిన్న సినిమాలతో మెరుస్తూ... విజయానికి కేరాఫ్‌గా నిలుస్తున్న కథానాయిక నయన్‌ సారిక. ‘గం గం గణేశా’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ‘క’, ‘ఆయ్‌’ సినిమాలతో ప్రేక్షకులకు మరింతగా చేరువైంది.
  • మణిరత్నం సినిమాలో సాయిపల్లవి? అటు హిందీలోనూ... ఇటు దక్షిణాదిలోనూ అవకాశాల్ని అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు కథానాయిక సాయిపల్లవి. ప్రస్తుతం నటిస్తున్నవే కాకుండా,
  • జడలు రో.. హడలు రో ‘‘సవారీకి దొరుకు బిడ్డా.. శవాలే లేస్తాయ్‌ బిడ్డా.. జడలు రో.. హడలు రో’’ అంటూ సవాల్‌ విసురుతున్నాడు జడల్‌. మరి అతనెవరు.. తను సవాల్‌ చేస్తోంది ఎవరినీ తెలియాలంటే ‘ది ప్యారడైజ్‌’ చూడాల్సిందే.
  • ‘ది కేరళ స్టోరీ 2’ని ముందు మాకు చూపించండి ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ 2’ సినిమా ట్రైలర్‌లో కేరళను తప్పుగా చూపించారని, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాలున్నాయని సామాజికమాధ్యమాల వేదికగా చర్చానీయాంశమైంది.
  • సంక్షిప్త వార్తలు (4) ‘‘బ్యాండ్‌ మేళం’ చిత్ర కథలోని సంఘర్షణ చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్‌ అందర్నీ కట్టిపడేస్తుంది’’ అంటున్నారు కోన వెంకట్‌.