నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/02/2026)

- A
- A+
- A++

మేషం
ఆత్మవిశ్వాసం మీ బలంగా నిలుస్తోంది. కార్యనిర్వహణలో చురుకుదనం చూపితే ఉన్నత ఫలితాలు సాధ్యం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ సహకారం మీకు బలం. శ్రీలక్ష్మీ ధ్యానం శ్రేయస్కరం.
వృషభం
వినయంతో చేసిన కృషి గౌరవాన్ని తెస్తుంది. నిర్ణయాల్లో స్థిరత్వం, ఉద్యోగంలో ప్రతిష్ఠ పెరుగుతుంది. శత్రువుల విషయంలో విజయసూచన. గృహంలో శుభవాతావరణం నెలకొంటుంది. శ్రీమహావిష్ణు స్మరణ మేలు చేస్తుంది.
మిథునం
ఏకాగ్రతే విజయం సాధించే సాధనం. ఆర్థిక అవకాశాలు విస్తరిస్తాయి. స్వయంకృషితో లక్ష్యసాధన, ప్రశాంత సంభాషణ ద్వారా అభివృద్ధి సాధ్యం అవుతుంది.కుజ అష్టోత్తరం శక్తిని ఇస్తుంది.
కర్కాటకం
దృఢ సంకల్పమే మీకు విజయద్వారం అవుతుంది. సహనం, సమయపాలనతో కార్యక్రమాలు నెరవేరుతాయి. ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ముందడుగు వేయాలి. కుటుంబంలో సమన్వయం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామం శుభప్రదం.
సింహం
ఆత్మబలం మీకు మార్గదర్శి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం సాధ్యం అవుతుంది. అందరిలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. ధర్మమార్గం శక్తిని ఇస్తుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
కన్య
పోటీతత్వం విజయానికి చేరుస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అద్భుత పురోగతి సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆర్థిక సంబంధ విషయాల్లో నియంత్రణ అవసరం. రుణ విమోచక అంగారక స్తోత్రం చదవడం శ్రేయస్కరం.
తుల
అదృష్టం అనుకూలంగా ఉంది. స్వల్ప కృషితో విశేష ఫలితాలు సాధిస్తారు. సంపద అభివృద్ధి సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక బలం రక్షిస్తోంది. శ్రీలక్ష్మీ అష్టోత్తరం పారాయణం మేలు.
వృశ్చికం
సృజనాత్మకతే మీ శక్తి. ధనయోగం బలంగా ఉంది. గృహ,భూ, వాహన లాభ సూచనలు ఉన్నాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
మీ పట్టుదలే విజయ రహస్యం. వృత్తి, వ్యాపారాల్లో గౌరవప్రదమైన పురోగతి సాధిస్తారు. న్యాయపరమైన లాభాలు ఉన్నాయి. లక్ష్యసాధనలో దృఢనిశ్చయం అవసరం. శ్రీలక్ష్మీస్మరణ ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది.
మకరం
ఆర్థికాభివృద్ధికి అనుకూల కాలం. పెట్టుబడులు లాభిస్తాయి. గృహంలో శుభవార్తలు వింటారు. సమష్టి కృషి విజయాన్ని ఇస్తుంది. శ్రీసూర్యనారాయణ మూర్తి నామస్మరణ శక్తిని ఇస్తుంది.
కుంభం
ధనయోగం అనుకూలం. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం సాధ్యం అవుతుంది. మౌనమే మీకు రక్షణగా నిలుస్తోంది. గౌరవం పెరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శుభప్రదం.
మీనం
శ్రద్ధ, పట్టుదలతో కార్యసిద్ధి. మిత్రబలం ద్వారా లాభాలు. గృహ, వాహన యోగం. ఆధ్యాత్మిక బలం ముందుకు నడిపిస్తోంది. శ్రీదత్తాత్రేయస్వామి స్మరణ శుభప్రదం.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కేరళ.. ఇక కేరళం దేవుడి సొంత భూమిగా పిలిచే కేరళ పేరును ‘కేరళం’గా మార్చేదిశగా కీలక అడుగుపడింది.
- గోదాట్లో గాలింపు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ వద్ద గోదావరి తీరంలో చుట్టుపక్కల గ్రామాల జనం సాగించే గాలింపు ఏటా ఈ సీజన్‌లో కనిపించే సన్నివేశమే.
- నేటి నుంచి మోదీ ఇజ్రాయెల్ పర్యటన ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారాన్ని పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
- నీతి ఆయోగ్ సీఈవోగా నిధి ఛిబ్బర్ నీతి ఆయోగ్ సీఈవోగా నిధి ఛిబ్బర్‌నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి(సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నిధి ఛిబ్బర్ నియమితులయ్యారు.
- రహదారుల నిర్మాణం, పర్యవేక్షణలో ఏఐ జాతీయ రహదారుల నిర్మాణం, పర్యవేక్షణలో ఏఐని వాడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
- విద్యా వెలుగులిచ్చే విద్యుత్తు స్తంభాలు పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధి డ్యూల్‌బరి గ్రామం విద్యావ్యాప్తికి వినూత్న చొరవ చూపుతోంది.
- పోఖ్రాన్‌లో సైన్యం ‘అగ్ని వర్ష’ విన్యాసాలు యుద్ధ సామర్థ్యాలను, సన్నద్ధతను చాటిచెప్పేలా రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారుల్లో సైన్యం మంగళవారం ‘అగ్ని వర్ష’ పేరుతో భారీ విన్యాసాలు నిర్వహించింది.
- ఝార్ఖండ్, ఒడిశాల నుంచి న్యాయాధికారులు పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సందర్భంగా వచ్చిన 80 లక్షల క్లెయింలు, అభ్యంతరాలను పరిశీలించేందుకు ఝార్ఖండ్, ఒడిశాల నుంచి న్యాయాధికారులను నియమించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది.
- ఏఐ సదస్సు నిరసనల కేసులో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్ ఏఐ సదస్సులో చొక్కాలు విప్పి నిరసన చేపట్టిన వ్యవహారంలో భారతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను పోలీసులు అరెస్టుచేశారు.
- తమిళనాట కొత్త పార్టీ ప్రారంభించిన శశికళ అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కొత్త పార్టీని ప్రారంభించారు.
- ఆధ్యాత్మిక గురువులను దైవస్వరూపాలుగా చూడనివారు మూర్ఖులు ఆధ్యాత్మిక గురువులను దైవస్వరూపాలుగా చూడనివారు దుర్మార్గులు, మూర్ఖులు, ఆటవికులని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వ్యాఖ్యానించారు.
- అమెరికాతో ఒప్పందం రద్దుకు దమ్ములేని మోదీ: రాహుల్ అమెరికా ఒత్తిడితోనే భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని, ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ చేశారు.
- రూ.8లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్ బుకింగ్ హోటల్‌లో విద్యుదాఘాతం కారణంగా చెలరేగిన మంటల్లో తీవ్రంగా గాయపడిన సంజయ్ కుమార్(41)ను కాపాడుకోవడం కోసం ఆయన కుటుంబం తీవ్రంగా ప్రయత్నించింది.
- తమిళనాట కొత్త పార్టీ ప్రారంభించిన శశికళ అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కొత్త పార్టీని ప్రారంభించారు.
- వీఎస్‌ఆర్ వెంచర్స్‌పై డీజీసీయే కొరడా విమానయాన నిబంధనల అమలులో పలు ఉల్లంఘనలు బయటపడటంతో వీఎస్‌ఆర్ వెంచర్స్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీయే) మంగళవారం కొరడా ఝళిపించింది.
- ల్యాండింగ్‌కు ముందు.. సముద్రంలో పడిన హెలికాప్టర్ ఓ హెలికాప్టర్ మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా సముద్రంలో పడిపోయిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
- వాటికి మించింది లేదు మీ మానసిక, శారీరక ఆరోగ్యం కంటే మీకు ముఖ్యమైంది ఏదీ లేదు.
- నాయకుల నాణ్యత నోటాతో మెరుగుపడిందా? శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ‘నోటా’ సదుపాయం.. ఎన్నికైన నాయకుల నాణ్యత మెరుగుదలకు దోహదపడిందా అని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది.
- అవినీతి, పెండింగ్ కేసులు న్యాయవ్యవస్థకు సవాళ్లు భారీస్థాయిలో అపరిష్కృతంగా ఉన్న వ్యాజ్యాలు, అవినీతి, న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటం వంటి అంశాలు భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం పేర్కొంది.
- రక్తనాళాల పూడిక తక్కువగానే ఉన్నామహిళలకు గుండెపోటు ముప్పు మహిళల రక్తనాళాల్లో తక్కువ మొత్తంలో పూడిక చోటు చేసుకున్నా గుండెపోటుకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని సరికొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది.