ఊళ్లన్నారు.. ఊడ్చేశారు

- A
- A+
- A++

ఇక్కడున్నది పీలేరులోని ఏపీఐఐసీ లేఅవుట్-2. బండరాళ్ల మధ్య పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. దీంతో బండలను చీల్చి అక్కడ నిర్మాణాలను చేపట్టే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికీ ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.
పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: ‘మనం కడుతున్నది కాలనీలు కాదు... ఊళ్లు కడుతున్నాం’ అని గత వైకాపా హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాకా ఊదారు. ఈ క్రమంలోనే పేదలు పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటన్నర సెంట్లలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. అప్పటి నుంచి లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. కాలనీలంటే వీధి దీపాలు, సరిపడా రోడ్లు, మురుగు నీటి పారుదల, తాగునీరు, తదితర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. నిర్మాణాలకు సరిపడా నీళ్లు అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. అవేం పట్టించుకోకుండా పట్టాలిచ్చి మమ అనిపించారు. ఇళ్లు కట్టుకోండి... లేదంటే రద్దు చేయిస్తామని అప్పటి వైకాపా నేతలు లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చారు. కొత్త ఇళ్లు కట్టుకోలేక, అద్దె ఇల్లను వదులుకోలేక లబ్ధిదారులు అప్పుల పాలయ్యారు. కొందరు కొండలు, గుట్టల్లో కాపురాలుండేదెలాగని అరకొర పనులు చేసి ఆపేశారు. ఇదే అదనుగా దళారులు రంగ ప్రవేశం చేసి అందిన కాడికి వాటిని దక్కించుకుని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నారు.
వాగులు.. వంకల్లో ఇళ్లా:జిల్లాలో జగనన్న కాలనీలన్నీ వాగులు, వంకలు, చెరువు గట్లు, గుట్టలు, బండరాళ్లు, కొండ గుట్టలు, ఎత్తు పల్లాల్లో ఉండే స్థలాలను ఎంపిక చేసి లబ్ధిదారులకు అంటగట్టారు. కాస్త జరుగుబాటు ఉన్నవాళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకోగా మరి కొందరు స్లాబ్ వరకు, పేదవారు అసలు నిర్మాణాలు చేపట్టలేదు. దీనికోసం రూ.లక్షలు అప్పులు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఉన్న పీఎంఆర్ ఎన్‌టీఆర్ కాలనీల్లో లబ్ధిదారులను చైతన్యవంతం చేస్తూ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామని గృహ నిర్మాణశాఖ పీడీ రమేష్‌రెడ్డి న్యూస్‌టుడేకు తెలిపారు.
► Read latest Ysr kadapa Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 08:25 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పీలేరులో అన్న క్యాంటీన్ ఏర్పాటు [ 15-04-2026] అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.
- ఫలితం.. కోల్పోవద్దు ఆత్మవిశ్వాసం [ 15-04-2026] పరీక్షలు.. ఫలితాలు.. కేవలం విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రక్రియ మాత్రమే. అది వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును నిర్ణయించేవి కాదు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. మార్కుల వేటలో పడి మనసును గాయపరచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
- జనంలోకి గంజాయి.. వనంలోకి జులాయి! [ 15-04-2026] జిల్లాలో గంజాయి అడ్డాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. పట్టణాల నుంచి పల్లెల వరకు ఎక్కడ చూసినా జులాయిలు తయారవుతున్నారు. వీరంతా శివారు ప్రాంతాలు, పాత భవనాలు, ముళ్ల పొదలు, ఖాళీ ప్రదేశాలను తమ మత్తు కార్యకలాపాలకు వినియోగిస్తుండగా పోలీసులు జనాన్ని వీడి వీరి అడ్డాల్లోకి వెళ్లడం లేదు.
- ‘ఓపి’కుంటేనే ఆసుపత్రుల్లో మాత్ర [ 15-04-2026] మారిన వాతావరణ పరిస్థితులతో పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఈ సంఖ్య ఇటీవల కాలంలో క్రమేపీ పెరుగుతోంది. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఈ తాకిడి మరింత ఎక్కువగా ఉంటోంది.
- ఆటలో విజేత.. బతుకులో పరాజిత! [ 15-04-2026] అతను దివ్యాంగుడు. అయితేనేం నిన్నటి వరకు మైదానంలో తన ప్రతిభతో చప్పట్లు అందుకున్నాడు. జట్టు గెలుపునకు శ్రమించి శభాష్ అనిపించుకున్నాడు. నేడు బతుకుదెరువుకు అవసరమైన ఉద్యోగ వేటలో శ్రమిస్తున్నాడు.
- శ్రీహరీ.. వెనక్కి వచ్చేయి [ 15-04-2026] ఒంటిమిట్ట పోలీస్ సీఐగా వి.శ్రీహరి బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే తిరిగి వెనక్కి వచ్చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక్కడ సీఐగా ఆయన సోమవారం విధుల్లో చేరారు.
- చూస్తూ ఊరుకోం.. రౌడీలందరి తాట తీస్తాం [ 15-04-2026] ‘కడప జిల్లాలో రౌడీలు నేరం చేస్తే చూస్తూ ఊరుకోం.. వారికి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలో మాకు బాగా తెలుసు. మా వద్ద ఏ పరికరాలు ఉన్నాయో, ఎవరికి ఏం వాడాలో తెలుసు’ అని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు.
- అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ [ 15-04-2026] వైఎస్‌ఆర్ కడప జిల్లా టి.సుండుపల్లి మండలం పింఛా ప్రాజెక్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం అటవీశాఖతో కలిసి టాస్క్‌ఫోర్స్ బలగాలు నిర్వహించిన దాడుల్లో రూ.20 లక్షల విలువచేసే 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ను...
- రహదారి ప్రమాదంలో యువకుడు దుర్మరణం [ 15-04-2026] పని నిమిత్తం పట్టణానికి వెళ్లిన వ్యక్తి అయిదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనే లోపు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పులివెందుల మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
- హత్య కేసులో ముగ్గురి అరెస్టు [ 15-04-2026] రాజుపాళెం మండలం పర్లపాడులో ఈనెల 10 జరిగిన బంగి మహేష్‌బాబు (21) అనే యువకుడి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన బాలుడు (17)తో పాటు అతని తల్లిదండ్రులు బంగి సురేష్ అలియాస్ ఏసురాజు, బంగి దేవమ్మ అలియాస్ బుజ్జిలను పోలీసులు అరెస్టు చేశారు.
- చెరువులో పడిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ [ 15-04-2026] బద్వేలు నాగుల చెరువులో మంగళవారం ప్రమాదవశాత్తు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం అదుపుతప్పి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ రాజేశ్ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు.
- భార్యను హతమార్చిన భర్తకు రిమాండ్ [ 15-04-2026] మండలంలోని పుల్లారెడ్డిపల్లెకు చెందిన వివాహిత యంబడి శ్యామల (37) ఈ నెల 3వ తేదీన మృతి చెందింది. కుటుంబ సభ్యులు మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు.