వీధి పేర్ల పంచాయితీ.. దద్దరిల్లిన కౌన్సిల్

- A
- A+
- A++

విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. పాలకవర్గ పదవీ కాలం మార్చి 18తో ముగుస్తోంది. ఇదే ఆఖరి సమావేశం. మొత్తం 165 అంశాలు అజెండాలో పెట్టారు. ఐదారు తప్ప.. మిగతావి మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పాలక పక్షమైన వైకాపా సభ్యులు ఆమోదించుకున్నారు. అందులో ప్రజోపయోగ పనుల కంటే వైకాపా కార్పొరేటర్ల సొంత ప్రయోజనాల కోసం పెట్టినవే ఎక్కువ ఉన్నాయి. అజెండాలో 38 అంశాలు రహదారులకు పేర్లు పెట్టేవే ఉండడం గమనార్హం.
పుట్టబోయే పిల్లల పేర్లూ పెట్టుకోండి..
- పేర్లను ఆమోదించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒకటో డివిజన్ కార్పొరేటర్ ఉద్దండు సునీత, ఆమె భర్త ఉద్దండు సురేష్, మరికొందరి పేర్లను రోడ్లకు పెట్టుకున్నారు. ఆ పేర్లను చూసి.. వైకాపా కార్పొరేటర్లే అసహ్యించుకుంటున్నారని, పుట్టబోయే పిల్లలు, మనవళ్ల పేర్లు కూడా పెట్టుకోవాలని తెదేపా ఫ్లోర్‌లీడర్ బాలస్వామి సహా పలువురు ఎద్దేవా చేశారు.
- ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. కానీ.. మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని మేయర్ ప్రకటించారు. కనీసం 30 రోజులు దాటాక.. 90 రోజుల్లోపు సమావేశం జరగాలి. అంత సమయం లేనప్పుడు.. మరో కౌన్సిల్ ఎందుకని తెదేపా కార్పొరేటర్లు ప్రశ్నించారు. నిధుల దుర్వినియోగం తప్ప ప్రయోజనం లేదన్నారు.
- పీపీపీ విధానంలో రోడ్ల నిర్వహణపై ఓ కార్పొరేటర్ నిరసనకు దిగారు. జీవో పత్రాలు చింపి పడేశారు. కౌన్సిల్ హాలులో చెత్త పోయడం సరికాదని మేయర్ మండిపడ్డారు.
- గుణదలలో మిగిలిన 70 ఇళ్ల స్థలాల్లో.. 37 మౌలిక వసతులకు, మిగతా 33 సీనియారిటీ ప్రకారం ఉద్యోగులకు కేటాయించేలా తీర్మానించారు.
- వైకాపా హయాంలో నాడు-నేడు పేరుతో పాఠశాలల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, నిధులు గోల్‌మాల్ చేశారని తెదేపా ఫ్లోర్‌లీడర్ బాలస్వామి ఆరోపించారు.
- కూటమి ప్రభుత్వం వచ్చాక కావాలనే నగర పరిధిలో.. వైకాపా పాలకపక్షం పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేసిందని తెదేపా తదితర కార్పొరేటర్లు పేర్కొన్నారు.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నాగాయలంకలో ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు [ 16-04-2026] కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగాయలంకలోని సాయిబాబా ఆలయం సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
- మూడోసారీ రెండో స్థానమే [ 16-04-2026] న్యూస్‌టుడే, గుంటూరు విద్య, పట్టాభిపురం, తెనాలి టౌన్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా వరుసగా మూడోసారీ రెండో స్థానంలో నిలిచింది.
- కొత్త రక్తం.. సేవకు పట్టం [ 16-04-2026] తెలుగుదేశం పార్టీ జాతీయ, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లాకు సముచిత ప్రాధాన్యం లభించింది.
- గతంలో విజయవాడ.. ఇప్పుడు తెనాలి [ 16-04-2026] న్యూడ్ కాల్స్ విష సంస్కృతి తాజాగా తెనాలిలో వెలుగు చూసింది. గతంలో విజయవాడలో న్యూడ్ కాల్స్ వ్యవహారాన్ని నడిపిన కుటుంబమే ఆరు నెలల క్రితం తెనాలికి మకాం మార్చి దందా కొనసాగిస్తున్న తీరుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
- శ్రీశైలం వెళ్దామని పిలిచి చంపేశాడు [ 16-04-2026] ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి.. తీసుకున్న డబ్బు తిరిగివ్వమని అడిగినందుకు ఓ మహిళను హత్య చేసిన కేసులో చేబ్రోలు మండలం శ్రీరంగపురానికి చెందిన న్యాయవాది ఎనుముల సురేష్, అతని స్నేహితుడు కోపల్లి శేఖర్‌ను పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
- పుస్తకాలు.. మా నేస్తాలు [ 16-04-2026] కాలం మారింది.. కంప్యూటర్ల యుగం పరుగులు పెడుతోంది.. ఒక్క క్లిక్‌తో అంతర్జాలంలో అంతులేని సమాచారం కళ్లముందు కనిపిస్తున్నా.. పుస్తకం చదివితే వచ్చే అనుభూతి చాలా ప్రత్యేకం.
- బెంగళూరు నుంచి తెనాలికి డ్రగ్స్ [ 16-04-2026] గుంటూరు జిల్లా తెనాలిలో తొలిసారిగా డ్రగ్స్ దొరకడం కలకలం రేపింది.
- మేమే నంబర్ 1 [ 16-04-2026] ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోని 28 జిల్లాల్లో అగ్రపథాన నిలిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయ ఢంకా మోగించారు.
- అమ్మానాన్నల కల.. ఫలించిన వేళ... [ 16-04-2026] వ్యవసాయ కూలీల కూతురు అద్భుత ప్రతిభ కనబరిచింది. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి ఔరా అన్పించింది.
- పరీక్ష తప్పుతానన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య [ 16-04-2026] ఇంటర్ పరీక్షల్లో తప్పుతానన్న భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది.
- కోర్టులో యువతి దురుసు ప్రవర్తన [ 16-04-2026] హత్య కేసులో న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వకుండా.. దురుసుగా ప్రవర్తించిన యువతికి జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి బుధవారం తీర్పు చెప్పారు.
- అనుభవానికి వందనం.. నవతరానికి అందలం [ 16-04-2026] ‘తెదేపాలో క్రియాశీలకంగా ఉంటూ.. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న వీరవిధేయులకే పదవులు దక్కాయి.
- అక్షర మమకారం.. సడలని సంకల్పం [ 16-04-2026] చిన్నపాటి సమస్య వస్తేనే చాలామంది మనకే ఎందుకిలా జరిగిందని బాధపడిపోతూ లక్ష్యాలను కూడా వదిలేస్తుంటారు.
- విధేయత.. అనుభవానికి అందలం [ 16-04-2026] మచిలీపట్నం కార్పొరేషన్ తెదేపాలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసే నాయకులకు పదవులు దక్కాయి.
- ప్రభుత్వ కళాశాలల్లో.. 73 శాతం ఉత్తీర్ణత [ 16-04-2026] కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో ఏడాది ఫలితాల్లో 79శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
- మరణంలోనూ వీడని బంధం [ 16-04-2026] స్వల్ప వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
- పరీక్షలో ఉత్తీర్ణత కాలేదని .. [ 16-04-2026] ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో బుధవారం విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
- చోరీ చేసేందుకు వచ్చి.. కత్తితో దాడి చేసి [ 16-04-2026] ఒకసారి దొంగతనం చేశాడు.. మళ్లీ అదే ఆశతో చోరీకి యత్నించాడు. ఈసారి అతని పన్నాగం విఫలమైంది.
- బెంగళూరు నుంచి తెనాలికి డ్రగ్స్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు [ 15-04-2026] తెనాలిలో తొలిసారిగా డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు.
- మోపిదేవి మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన [ 15-04-2026] మోపిదేవి మండలంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సుడిగాలి పర్యటన చేశారు.
- మోపిదేవిలో ‘నేస్తం బడికి రా’ కార్యక్రమం [ 15-04-2026] ‘నేస్తం బడికి రా’ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు బుధవారం నిర్వహించారు.
- మంత్రి చెప్పారని ఇల్లు కూల్చేందుకు నోటీసులు [ 15-04-2026] ఓ మంత్రి చెప్పారని తాము నివసిస్తున్న ఇంటిని కూల్చి వేస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారని మండలంలో యాకమూరుకు చెందిన దీప ఆందోళన వ్యక్తం చేశారు. రేకుల షెడ్డులో ఆమె ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది.
- మంటలనే కాదు.. విపత్తునూ ఎదుర్కొంటాం.. [ 15-04-2026] గంటల బండి గుర్తుంది కదా.. అదే మంటలార్పే వాహనం. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించి.. మంటలు వ్యాపిస్తే అదుపు చేసి ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు ఈ వాహనం వచ్చేది. అయితే అగ్నిమాపక శాఖకు విపత్తు నిర్వహణను జత చేయడంతో విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖగా పిలుస్తున్నారు.
- మాజీ మంత్రి అండతో.. ‘మడ’తెట్టేశారు! [ 15-04-2026] మడ అడవుల పరిరక్షణ, పర్యవేక్షణ శాఖల అధికారులకు పట్టట్లేదు. ఏళ్లుగా నేతల అండతో ఆక్రమించేసుకుంటున్నా వేల ఎకరాలను చెరువులుగా మారుస్తున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
- దొరక్కుండా ఎత్తుగడలు [ 15-04-2026] సైబర్ మోసగాళ్లు తమ పంథా మార్చారు. డిజిటల్ అరెస్టుల మోసాల్లో ఎక్కడా తమ ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ‘సిగ్నల్’ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.
- వైకాపా నాయకుడి కీచకపర్వం! [ 15-04-2026] అప్పు తీర్చమని అడిగిన వివాహితను నమ్మకంగా పిలిచి.. అకృత్యానికి పాల్పడ్డాడు.. అంతేకాదు ఆమె నగ్న చిత్రాలు తీసి.. కాపురంలో చిచ్చుపెడతానని రూ.లక్షలు గుంజాడు. నీ భర్తను మట్టుబెడతానని విర్రవీగడంతో అతడి వేధింపులు భరించలేక ఆ ఇల్లాలు నరకం చూసింది.
- నాలుగేళ్లకే నిండిన నూరేళ్లు [ 15-04-2026] అల్లారుముద్దుగా కళ్ల ముందు తిరిగే నాలుగేళ్ల కుమార్తె ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆ కన్నపెగు తల్లడిల్లింది. ఇలా జరుగుతుందనుకుంటే అసలు బయటకు పంపించే దాన్ని కాదు కదా..
- ఆసాంతం కబ్జా... అడగరని దర్జా [ 15-04-2026] విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్-65పై అడుగడుగునా ఆక్రమణలు కనిపిస్తున్నాయి. రహదారి అంచు వరకు ఫుట్‌పాత్, డ్రైనేజీ అన్న వ్యత్యాసం లేకుండా అడ్డగోలుగా ఆక్రమించి రహదారి అంచునే వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేశారు.
- చారిత్రక ఘట్టం... క్వాంటమ్ యుగం [ 15-04-2026] సాంకేతిక విప్లవంలో సరికొత్త పేజీ తెరుచుకుంది. ఆధునిక విజ్ఞానంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. మారుతున్న కాలం.. పెరుగుతున్న వేగానికి తగ్గట్టుగా మనిషి అవసరాలు తీర్చే క్వాంటమ్ కంప్యూటర్ యుగానికి అమరావతి తనదైన ఆతిథ్యం ఇచ్చింది.
- వేదనన్నా చూడరు.. వేచి ఉన్నా ఆపరు [ 15-04-2026] ఫిబ్రవరి 22న విజయవాడ నుంచి హనుమాన్‌జంక్షన్ వెళ్లే సిటీ బస్సు పెదఆవుటపల్లి బస్టాప్ వద్ద ఆగగా, కొందరు ప్రయాణికులతో పాటు ఇద్దరు చిన్నారులు ఎక్కారు. ఈలోగా బస్సు కదలడంతో వారి తల్లి ఎక్కలేకపోయింది. దీంతో ఒక్కసారిగా పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. సదరు మహిళ వచ్చే వరకు బస్సుని ఆపకుండా కండక్టరు ఆ చిన్నారులను దింపేశారు.
- విశ్వాసమే ఎత్తు.. వైకల్యం చిత్తు [ 15-04-2026] ప్రతికూల పరిస్థితులను అధిగమించి చదరంగంలో రాణిస్తున్నాడు విజయవాడకు చెందిన కూచిభొట్ల వెంకట కృష్ణ కార్తీక్. శారీరక వైకల్యానికి (ఫిజికల్లీ ఛాలెంజ్డ్) గురైనా.. నిరాశ చెందకుండా ఆసక్తి గల రంగంలో దూసుకుపోతున్నాడు.
- మట్టి పెళ్లలు విరిగిపడి మహిళ దుర్మరణం [ 15-04-2026] ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధి కట్లేరులో ఇసుకను ట్రాక్టర్‌లో లోడు చేసే క్రమంలో మట్టిపెళ్లలు విరిగి మీదపడటంతో మండలంలోని అమ్మిరెడ్డిగూడేనికి చెందిన గుంజి ధనలక్ష్మి (38) దుర్మరణం చెందారు.
- ఆనందించేలోపే.. అనంతలోకాలకు.. [ 15-04-2026] తిరువూరుకు చెందిన దంతవైద్యుడు డాక్టర్ సురేష్ (49) మంగళవారం కృష్ణా నదిలో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..
- ఇంజిన్.. బ్రేకులు బాగున్నాయ్..! [ 15-04-2026] కీసర టోల్ ప్లాజా ప్రమాదానికి కారణమైన ఫ్లైయాష్ ట్యాంకర్ ఇంజిన్ కండీషన్, బ్రేకు సామర్థ్యం సవ్యంగా ఉన్నాయి. ఆ సమయంలో డ్రైవర్ మద్యం సేవించలేదని పోలీసులు నిర్ధారించారు.
- అనుమానమే.. పెనుభూతమై..! [ 15-04-2026] సహజీవనం చేస్తున్నా.. ఆమెను నిత్యం అనుమానించేవాడు. నమ్మకంగా పిలిపించి.. కత్తితో గొంతులో పొడిచి చంపేశాడు. గవర్నర్‌పేటలో సోమవారం రాత్రి కలకలం సృష్టించిన ఈ హత్య కేసులో హతురాలి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
- అసభ్యకర యాప్‌పై పోలీసుల ఆరా! [ 15-04-2026] నగదు చెల్లిస్తే నగ్నంగా ఛాటింగ్ చేస్తున్నారన్న సమాచారంపై గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు దృష్టి సారించారు. ఓ యాప్ ద్వారా ఈ తంతు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.