ఏఐ అతిగా వాడితే ప్రమాదమే!

- A
- A+
- A++

ఈనాడు, హైదరాబాద్: కృత్రిమ మేధను ఒక ప్రత్యామ్నాయంగా కాకుండా భాగస్వామిగా చూడాలని ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఏఐతో వేగంగా చేసే పనులను సొంత నైపుణ్యంగా భావించకూడదని, మన మేధస్సుకు మనమే ‘ఎడిటర్ ఇన్ చీఫ్’గా వ్యవహరించాలని సూచించింది. ఏఐ ఇచ్చిన సమాచారాన్ని, సమాధానాలను గుడ్డిగా నమ్మకుండా.. దానిని అర్థం చేసుకుని పుస్తకాలు, అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ధ్రువీకరించుకోవాలని తెలిపింది. అందులో విషయాన్ని లాజిక్‌గా పరిశీలించడం ఉత్తమ విద్యార్థి లక్ష్యమని వెల్లడించింది. విదేశీ విద్యార్థులతో పోలిస్తే.. భారత్ విద్యార్థులు ఏఐని నైపుణ్యాలు పెంచుకునేందుకు వినియోగిస్తున్నారని నివేదిక అభిప్రాయపడింది. ఇదే సరైన విధానమని పేర్కొంది. ఉన్నత విద్యలో విద్యార్థుల ఏఐ వినియోగంపై అనాటమీ ఆఫ్ వర్క్ సంస్థ ‘ది షాడో కరిక్యులం’ పేరిట అంతర్జాతీయంగా చేసిన అధ్యయన నివేదికను తాజాగా విడుదల చేసింది.
విద్యార్థులు ఏఐ సహాయం లేకుండా విషయ విశ్లేషణ, సొంతగా రాయడం చేయాలి. మెదడు మొద్దుబారిపోకుండా ప్రాథమిక ఆలోచన సామర్థ్యానికి పదును పెట్టాలి. ఏఐ ఔట్‌పుట్‌లు పర్యవేక్షించి, ధ్రువీకరించి, మెరుగుపరుచుకుంటూ విద్యార్థులు సమగ్రంగా నేర్చుకునేలా ప్రస్తుత పాఠ్యప్రణాళికను అప్లైడ్ ఏఐ ఇంజినీరింగ్‌గా రీడిజైన్ చేయాలి’’ అని నివేదిక పేర్కొంది.
కేటగిరీ 1ఆర్కిటెక్‌గా వ్యవహరించే విద్యార్థులు.. భారీ డేటాను విశ్లేషణ, ప్రాథమిక సమాచారానికి వినియోగిస్తారు. కానీ ప్రతి ఆలోచన సొంతగా చేస్తారు. ఏఐని శక్తిమంతమైనదిగా భావిస్తూ ఆ సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధిస్తారు.
కేటగిరీ 2ఎసైన్‌మెంట్ల నుంచి ప్రతి పని చేసేందుకు ఏఐని వాడతారు. వీరు అతిగా ఆధారపడటం వల్ల ప్రమాదంలో పడిపోతారు. సొంత ఆలోచన శక్తి మందగిస్తుంది.
కేటగిరీ 3పుస్తకాలను నిమిషాల్లో చదవడం, వ్యాకరణ దోషాలు సరిచేసేందుకు ఏఐని వాడతారు. ఏఐని తీసివేస్తే ఒత్తిడిలో పడిపోయే ప్రమాదముంది.
కేటగిరీ 4తరగతిలో నేర్చుకున్న దానికి, మార్కెట్ అవసరాలకు మధ్య అంతరాన్ని ఏఐతో భర్తీ చేస్తుంటారు. కొత్త విషయాలు, కెరీర్ కోసం ఏఐని వినియోగిస్తారు. థియరీ కంటే ప్రాక్టికల్ నైపుణ్యాలను కీలకంగా చూస్తారు.

ఏఐపై ఆధారపడటాన్ని 85శాతం మంది విద్యార్థులు తప్పుగా భావించడం లేదు. అయితే సొంత ఆలోచన లేకుండా ఎసైన్‌మెంట్‌ను ఏఐతో రాయించడాన్ని 32.3శాతం మంది చీటింగ్‌గా భావిస్తున్నారు. ఇది తప్పని తెలిసినా ఇతరుల కన్నా వేగంగా చేయాలన్న తపనతో ముందుకు వెళ్తున్నారు. ఏఐని నమ్ముకుని సొంతగా చదవకుంటే చివరకు ఏఐ అల్గారిథమ్‌పై ఆధారపడే ప్రమాదం వస్తుందని సర్వేలో వెల్లడైంది. ఏఐ రాసిన కంటెంట్‌ను ఎడిట్ చేసి, సాఫ్ట్‌వేర్‌లు గుర్తించకుండా జాగ్రత్త పడినా.. దాదాపు 30 శాతం మంది విద్యార్థులు ఏది తప్పో.. ఏది ఒప్పో తెలియని అయోమయ స్థితిలో వినియోగిస్తున్నారని పేర్కొంది.
- భారత్‌లో విద్యార్థులు కళాశాలలు అనుమతి ఇచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పటికే ఏఐని వాడుతున్నారు.
- పరిమిత స్థాయిలో విద్యా వనరులున్న విద్యార్థులకు సామాజిక ఎదుగుదల, ఇతరులతో సమానంగా పోటీపడే అవకాశం కల్పిస్తోంది.
- దేశంలో ఏఐని.. కాపీ కొట్టే టెక్నాలజీగా కాకుండా ప్రపంచస్థాయి ఉద్యోగ మార్కెట్‌లో పోటీ పడటానికి లభించిన అవకాశంగా చూస్తున్నారు.
- విదేశాల్లో విద్యార్థులు వ్యాసాలు రాసేందుకు ఉపయోగిస్తే.. భారత్‌లో స్టెమ్ సబ్జెక్టుల్లో క్లిష్టమైన సమస్యలు అర్థం చేసుకునేందుకు వినియోగిస్తున్నారు.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మీ స్మార్ట్‌ఫోన్‌తోనే.. మీ టికెట్ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ ద్వారా బస్ టికెట్లు, బస్‌పాస్‌లు తీసుకునే అవకాశాన్ని తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
- గణపతి ఎక్కడ? మావోయిస్టు పార్టీ సుప్రీం, పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఎలియాస్ గణపతి ఆచూకీపై సందిగ్ధత వీడటం లేదు.
- ఫిబ్రవరి నెలది.. చిన్న కథ కాదు..! ఒక్క ఫిబ్రవరిలో మాత్రం ఎందుకని 28 రోజులున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ప్రాచీన రోమన్ల మూఢనమ్మకాలే కారణం.
- చెక్కతో చేసినట్లే.. ఇక్కడున్న డైనింగ్ టేబుల్ చెక్కతో చేసినట్టు భలే కనిపిస్తోంది కదూ! కానీ వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులతోనే దీన్ని తీర్చిదిద్దారు.
- ఆలస్యమే అమృత్‌మా! పుర, నగరపాలికల్లో తాగునీటి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మురుగునీటి శుద్ధి కోసం ప్లాంట్ల నిర్మాణానికి అమృత్ 2.0 నిధులతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చేపట్టిన పనుల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది.
- సెల్లుకు చెల్లు.. ఆటల్లోనే టీ సిప్పు ఇక్కడ క్యారం, చెస్ ఆటల్లో నిమగ్నమైన వీరిని చూసి ఏ ఇండోర్ స్టేడియంలోనో ఉన్నారనుకుంటున్నారా..!
- ఆ నలుగురూ వచ్చేశారు మావోయిస్టు పార్టీ చరిత్రలో అత్యంత కీలక లొంగుబాటు.. మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి నలుగురు అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారు.
- చిరకాల వాంఛ నెరవేర్చారు తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
- త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్యూర్-ప్యూర్-రేర్ అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
- బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్రం నడుం బిగించింది.
- ఏకగ్రీవమా? రెండో స్థానానికి పోటీనా! రాజ్యసభకు తెలంగాణ నుంచి రెండు స్థానాలకు జరిగే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక పోటీ ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
- భారాస మునిగిపోయే నావ.. ‘‘రాష్ట్రంలో భారాస మునిగిపోయే నావ. కాంగ్రెస్‌ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ భాజపానే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపాను గెలవనీయకుండా కాంగ్రెస్, భారాస, ఎంఐఎం- మూడు పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
- ‘పది’ పరీక్షా కేంద్రాల వద్ద క్లోక్‌రూమ్‌లు రాష్ట్రంలో తొలిసారిగా పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో క్లోక్‌రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు తెచ్చుకున్న బ్యాగ్‌లను అక్కడ ఇచ్చి.. పరీక్ష తర్వాత తీసుకెళ్లొచ్చు.
- అకాల వర్షం.. అన్నదాతకు తీరని నష్టం నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో సోమవారం రాత్రి ఆకస్మిక గాలివాన బీభత్సం సృష్టించింది. ఆయా జిల్లాల్లోని పలుప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
- పూర్తి కాలపు డీజీపీ ఎంపిక? పూర్తి కాలపు డీజీపీ ఎంపిక ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రస్తుత ఇన్‌ఛార్జి డీజీపీ శివధర్‌రెడ్డి ఏప్రిల్ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్నారు.
- పునరుద్ధరించిన శాసనమండలి భవనం ప్రారంభోత్సవం 8న పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని వచ్చే నెల 8న ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
- ప్రభుత్వానివి చరిత్రాత్మక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆరోగ్య కార్డుల మంజూరుతోపాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమని తెలంగాణ ఉద్యోగుల ఐకాస అభివర్ణించింది.
- గాంధీ కుటుంబానికిచ్చే రూ.వెయ్యి కోట్లు రేవంత్‌రెడ్డికి ఎక్కడివి? గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాహాటంగా ప్రకటిస్తుంటే.. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలు ఏం చేస్తున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు.
- సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం విస్తరణ తెలంగాణలో సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని(టీజీఐఎల్‌పీని) మరో నాలుగు జిల్లాల్లోని ఏడు మండలాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- కుమ్మెర ఘటనను అసెంబ్లీలో లేవనెత్తుతాం దేవాలయాల్లో కుల వివక్ష అంతం కావాలని, దీనికోసం భాజపా పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు.