ప్రియురాలితో గడిపేందుకు కిడ్నాప్‌ వ్యూహం!

Eenadu icon
By Telangana Dist. Desk Published : 22 Feb 2026 07:22 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

హబ్సిగూడ, న్యూస్‌టుడే: తన భర్తను కిడ్నాప్‌ చేశారని ఓ వివాహిత ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు గేటు బయటకు తీసుకెళ్లి వాహనంలో ఎక్కించుకొని వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని, రెండు రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి ఉండటంతో ఆమె ఆందోళన చెందింది. తన భర్త ఆచూకీ కనుక్కోవాలని పోలీసులను వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ప్రియురాలితో గడపడానికి ఆమె భర్త వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు, బాధితురాలి వివరాల ప్రకారం.. రామంతాపూర్‌ డివిజన్‌లోని గాంధీనగర్‌ జనప్రియ అపార్టుమెంటులో నివసించే రావూరి పూర్ణచందర్‌(34)కు భార్య, తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. అతను మాదాపూర్‌లోని పబ్‌లో పర్చేజ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి స్నేహితులు వచ్చారని చెప్పి తన ఫోన్‌ను ఇంట్లోనే ఉంచి డోర్‌బయట గడియపెట్టి వెళ్లాడు. నడుచుకుంటూ బయటకు వచ్చి ఇద్దరు అమ్మాయిలు, మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోయాడు. ఉదయం నిద్ర లేచిన భార్య.. భర్త కనిపించకపోవడంతో అపార్ట్‌మెంట్‌ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కిడ్నాప్‌ చేశారని ఆందోళన చెందింది. అతను పనిచేసే పబ్‌కు వెళ్లి తన భర్తను కిడ్నాప్‌ చేశారని చెప్పింది. పబ్‌ నిర్వాహకులు సైతం మాదాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. 

బెంగాలీ యువతితో సహజీవనం..

అర్ధరాత్రి వచ్చిన యువతుల్లో ఒకరిని గుర్తించిన పోలీసులు ఆమెను విచారించగా అసలువిషయం బయటపడింది. పబ్‌లో చాలా రోజులుగా బెంగాలీ యువతితో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. పబ్‌లో పనిచేసే యువతులతో కలిసి కిడ్నాప్‌ డ్రామా ఆడినట్లు పోలీసులు గ్రహించారు. వారి ఫోన్‌ నంబరు లోకేషన్‌ను పరిశీలించగా ఒడిశాలో ఉన్నట్లు తెలిసింది.  

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్టార్‌ హోటళ్లలో బస.. పబ్బుల్లో ఎంజాయ్‌ [ 25-02-2026] గోపనపల్లిలో రూ.56 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్‌ డిపాజిట్‌ వ్యాన్‌ డ్రైవర్‌ను గచ్చిబౌలి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి రూ.34.90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
  • చిన్న కారణం.. మరణ శాసనం [ 25-02-2026] ఆర్థిక సమస్యలు.. కుటుంబ కలహాలు.. ఒంటరితనం.. కుంగుబాటు.. చదువుల ఒత్తిడి.. కారణమేదైనా కొందరు చావే శరణ్యమని భావిస్తున్నారు. ఈ క్రమంలో తాము చావడమో.. ఇతరులను చంపడమో చేసున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులనూ బలితీసుకుంటున్నారు.
  • మత్తు ముఠాల గుట్టు కనిపెట్టేలా [ 25-02-2026] 2025 సెప్టెంబరు: చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు బయటపెట్టడం సంచలనం రేపింది. వాళ్లు వచ్చి కనిపెట్టేవరకు మన పోలీసులు గుర్తించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 
  • వైద్య సేవలు మరింత ‘సూపర్’! [ 25-02-2026] ప్రభుత్వ ఆసుపత్రులైన నిమ్స్, గాంధీ, ఉస్మానియాలలో మరిన్ని సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. నగరానికి చెందిన ఈ మూడు ఆసుపత్రులకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) తాజాగా వివిధ విభాగాల్లో డీఎం, ఎంసీహెచ్‌ సీట్లు కేటాయించిన నేపథ్యంలో రోగులకు ఆధునిక సేవలు అందడమే కాకుండా...
  • కొత్త వెలుగులు [ 25-02-2026] రాజధానిలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో నూతన ఎల్‌ఈడీ వీధిలైట్ల ప్రాజెక్టు అమల్లోకి రాబోతోంది. రాత్రి వేళ నిరంతరాయంగా 98శాతం లైట్లు వెలగడం, నిర్మానుష్య ప్రాంతాల్లో కొత్త దీపాల ఏర్పాటు, పాడైపోయిన వాటికి 48 గంటల్లో మరమ్మతు చేయాలనే నిబంధనలతో..
  • ప్లాట్ల విక్రయానికి ‘మహా’ ప్రణాళిక [ 25-02-2026] స్థిరాస్తి మార్కెట్‌లో సానుకూలత కనిపిస్తుండడంతో గతంలో గుర్తించిన పలు లేఅవుట్లలో ప్లాట్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు హెచ్‌ఎండీఏ పరిధిలోకి చేర్చారు.
  • మెట్రో మొదటి దశ సాంకేతికంగా పటిష్ఠం [ 25-02-2026] హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ సాంకేతికంగా పటిష్ఠంగా ఉందని దిల్లీ మెట్రో ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌(డీఎంఐఎల్‌) తన ముసాయిదా నివేదికలో వెల్లడించింది.  ఆధునిక మెట్రో ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పేర్కొంది.
  • జలమండలి పొదుపు మంత్రం [ 25-02-2026] మహానగరంలో నీటి సరఫరాకే పరిమితమైన జలమండలి ఇప్పుడు వినియోగంపై దృష్టిసారిస్తోంది. భూగర్భజలాల లభ్యత, జలమండలి నీటి సరఫరా, పొదుపు, శుద్ధి చేసిన మురుగుజలాల పునర్‌వినియోగం ప్రాతిపదికగా బడ్జెట్‌ రూపొందించనున్నారు.
  • ఉన్నత విద్యకు ఐర్లాండ్ పిలుస్తోంది [ 25-02-2026] ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను తమ దేశంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఐర్లాండ్‌ పిలుస్తోంది.  ఐర్లాండ్‌ దేశం ప్రజాసేవ సంస్కరణ, డిజిటలైజేషన్‌ శాఖల మంత్రి జాక్‌ చాంబర్స్‌ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఇటీవల జేఎన్‌టీయూ హైదరాబాద్‌ను సందర్శించింది.
  • మధు పార్కు రిడ్జ్‌ వాసులకు మెరుగైన ప్యాకేజీ! [ 25-02-2026] మూసీ సుందరీకరణలో భాగంగా నార్సింగి పరిధిలోని మధు పార్కు రిడ్జ్‌ అపార్ట్‌మెంట్‌వాసులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వ ఉన్నత వర్గాలు నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
  • వారు.. దోమలకన్నా ప్రమాదం [ 25-02-2026] మనుషుల రక్తం పీల్చే దోమలకన్నా.. వాటి నివారణకు చర్యలు చేపట్టే అధికారులు మరింత ప్రమాదకరంగా తయారయ్యారు.  దోమల నివారణకు కేటాయించిన నిధులతో జేబులు నింపుకొంటున్నారు. తాజాగా  పంపకాల్లో తేడా రావడంతో..
  • పక్కాగా రెక్కీ... నిమిషాల్లో దోపిడీ [ 25-02-2026] కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌లోని ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పులకు పాల్పడిన ఘటనలో ఫుర్ఖాన్‌ అహ్మద్‌(36), మహ్మద్‌ తయ్యబ్‌ త్యాగి(30)లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశవాళీ పిస్తోలు, 2 మ్యాగజైన్లు, 35 బుల్లెట్లు (లైవ్‌రౌండ్స్‌), రూ.2.38 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
  • భార్యను గొడ్డలితో నరికి దారుణ హత్య [ 25-02-2026] ట్టుకున్న భర్తే కాలయముడై భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నోముల గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ మధు వివరాల ప్రకారం.. స్థానికుడు మాదనమెని బాబు వ్యవసాయం,
  • పాట వినిపిస్తూ యువకుడికి శస్త్రచికిత్స [ 25-02-2026] కామినేని ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడికి పాట వినిపిస్తూ శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. మంగళవారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాలు.. ఎల్బీనగర్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు పాఠశాలల్లో కరాటే శిక్షకుడు.
  • కారును ఢీకొన్న టిప్పర్‌.. నాలుగేళ్ల చిన్నారి మృతి [ 25-02-2026] హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై మొహబ్బత్‌నగర్‌ గేటు సమీపంలో కారును ఎదురుగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టిన ఘటనలో కారు డ్రైవర్‌ రాత్లావత్‌ బద్రు కుమారుడు బిట్టు(4) అక్కడిక్కడే మృతి చెందాడు.
  • ‘ఆపద మిత్రుల’కు హైడ్రా నియామకాల్లో ప్రాధాన్యం [ 25-02-2026] విపత్తుల సమయంలో ఎలా స్పందించాలి.. ప్రజలను కాపాడాలనే అంశాలపై ‘ఆపద మిత్రులు’ తీసుకున్న శిక్షణ జీవితాంతం ఉపయోగపడాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు.
  • కల్తీ టీ పొడి తయారీ.. ఒకరి అరెస్టు [ 25-02-2026] కొబ్బరి పీచు, రసాయన రంగులను ఉపయోగించి కల్తీ టీ పొడి తయారుచ్తేన్న ఒకరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టుచేశారు. సనత్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
  • డ్రగ్స్‌కు బానిసైన కుమారుడు.. తల్లిదండ్రుల ఫిర్యాదు [ 25-02-2026] మత్తు పదార్థాలకు బానిసైన కన్నబిడ్డ వేధింపులు, దాడులు భరించలేక తల్లిదండ్రులే పోలీసుల్ని ఆశ్రయించిన ఉదంతమిది. డీఅడిక్షన్‌ కేంద్రంలో చేర్పించినా అలవాటు మానుకోకుండా మళ్లీ గంజాయి తీసుకోవడం చూసి అతడికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని కోరారు.
  • బైక్‌లు చోరీ చేస్తూ దొరికిన ర్యాపిడో రైడర్‌ [ 25-02-2026] ర్యాపిడో రైడర్‌గా కొనసాగుతూ విలాసవంత జీవితం కోసం ద్విచక్రవాహన దొంగగా మారాడు. ఏడాది వ్యవధిలో 4 ఠాణాల పరిధుల్లో 12 బైకులు చోరీచేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సహకరించిన మరోవ్యక్తిని కూడా అరెస్టుచేసి రిమాండ్‌ చేశారు.