వివాహితను బెదిరించి అత్యాచారం

- A
- A+
- A++

హైదరాబాద్, న్యూస్‌టుడే: వివాహితను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై హైదరాబాద్‌లో ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన మహిళ(28) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో నివసిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం బాలానగర్‌లో సాఫ్ట్‌వేర్ సంస్థ నిర్వహించిన బంజారాహిల్స్‌కు చెందిన మల్లికార్జునరెడ్డి(50) వద్ద ఆమె పనిచేసింది. కొన్నాళ్లకు అక్కడ పనిమానేసి.. మరొకరిని వివాహం చేసుకుంది. 2024లో మల్లికార్జునరెడ్డి ఆమెను తిరిగి సంప్రదించాడు. గతంలో ఉన్న పరిచయంతో.. అతడు సూచించిన మేరకు మధురానగర్‌లోని ఓ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో మల్లికార్జునరెడ్డి తన నిజస్వరూపం బయటపెట్టాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని.. శారీరకంగా కలవాలని బెదిరించాడు. లేనిపక్షంలో వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత కూడా మధురానగర్‌లో, తిరుపతి తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చినా.. మల్లికార్జునరెడ్డి బెదిరింపులు కొనసాగిస్తుండటంతో తన మిత్రురాలి ద్వారా కోర్టును, ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. తొలుత ఎస్సార్‌నగర్ పోలీసులు నిందితుడిపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. ఆ తర్వాత మధురానగర్ ఠాణాకు బదిలీ చేశారు.
విజయవాడ(చిట్టినగర్), న్యూస్‌టుడే: కూతురితో అసభ్య ప్రవర్తన కేసులో నిందితుడిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. విజయవాడ శివారు ప్రాంతమైన వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన 6వ తరగతి చదువుతున్న కూతురిపై తండ్రి (40) మద్యం మత్తులో పలుమార్లు అసభ్యంగా వ్యవహరించినట్లు కుమార్తె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతడిని కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు సీఐ చిన కొండలరావు తెలిపారు. బాలిక వసతి గృహంలోనే ఉన్నట్లు వివరించారు. తండ్రితో పాటు మేనమామ కూడా బాలిక పట్ల తప్పుగా వ్యవహరించినట్లు వస్తున్న ఆరోపణలు నిరాధారమని, నిజం కాదని సీఐ చినకొండలరావు, ఏసీపీ దుర్గారావు వివరించారు.
కొల్లిపర, న్యూస్‌టుడే: గ్రామాల అభ్యున్నతికి ప్రభుత్వం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారు. ఈ నెల 17న ఈనాడులో ప్రచురితమైన ‘పంచాయతీల నిధులు రూ. కోటికి పైగా స్వాహా’ కథనంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండల పరిధిలోని తూములూరు, చెముడుబాడు, చక్రాయపాలెం, మున్నంగి గ్రామాల్లో నిధులు దుర్వినియోగం విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో పీఎంఏజీవై పథకంలో భాగంగా మండల పరిధిలోని చెముడుబాడు, సిరిపురం, దంతలూరు, పెదపర్రుకు రూ.80 లక్షల నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో చెముడుబాడు గ్రామానికి రూ.19.65 లక్షల నిధులు పంచాయతీ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఈ నేపథ్యంలో పరిశీలించిన అధికారులు సంబంధిత నిధులు 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో వినియోగించినట్లు రికార్డుల్లో నమోదు చేయని విషయాన్ని గుర్తించారు. తరువాత ఆర్థిక సంవత్సరంలో గంపగుత్తగా రూ.15.93 లక్షలు డ్రా చేసినట్లు.. ఓడీ ఖాతాలోని మరో రూ.3 లక్షల నిధులు డ్రా చేసుకున్నట్లు తెలుసుకున్నారు. ఈనాడు కథనంతో స్పందించిన డీఎల్‌పీవో, ఎంపీడీవోలు అదనపు ఎంపీడీవోకు లేఖ (మెమో)ను జారీ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చింది. గత ఐదు సంవత్సరాలు కార్యదర్శులుగా విధులు నిర్వహించిన లక్ష్మి, ఉషల నుంచి వివరణ తీసుకున్నారు. నిధుల దుర్వినియోగంపై నిగ్గుతేల్చేందుకు సంబంధిత క్యాష్‌బుక్‌లు అందుబాటులో లేవని పేర్కొనడం విశేషం.
► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 03:24 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 27న ఆయేషా శరీర అవశేషాల ఖననం [ 26-02-2026] ఆయేషామీరా శరీర అవశేషాలను ఖననం చేసేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సీబీఐ అధికారులు గుంటూరు ఎస్పీ, తెనాలి తహసీల్దారును కోరారు.
- ప్రమాదాలకు నిలుపుటద్దం! [ 26-02-2026] జాతీయ రహదారులపై అడ్డదిడ్డంగా ఆపేస్తున్న వాహనాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మంచు, చీకటి కమ్మేసిన వేళ వాహనాలున్న విషయం గుర్తించలేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
- పట్టుదలతో చదువు.. పదింతల సులువు [ 26-02-2026] పది పరీక్షల గడువు సమీపిస్తోంది. ఆయా సబ్జెక్టుల వారీగా ఉన్న సందేహాలు నివృత్తి చేసేందుకు ఈనాడు, ఈటీవీ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
- పేదల గూడు.. కష్టాలు చూడు.. [ 26-02-2026] పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందిస్తున్నా.. నిర్మాణ ప్రగతి అంతంతమాత్రమే.
- మచ్చు పేరుతో మస్తు దోపిడీ [ 26-02-2026] మిర్చియార్డులో మచ్చు పేరిట దోపిడీకి అడ్డుకట్ట పడడం లేదు. యంత్రాంగం కళ్లెదుటే రైతన్నలు మోసపోతున్నా.. కళ్లప్పగించి చూడడమే తప్ప కట్టడికి ప్రయత్నించడం లేదు.
- వైద్యాన్ని వృత్తిగా కాదు.. సేవగా చూడండి [ 26-02-2026] వైద్య వృత్తికి నైతికత, కరుణ, అనుభూతి మూడు ప్రాథమిక స్తంభాలు. నైతికతతో పనిచేయడం, కరుణతో చికిత్స చేయడం ద్వారా రోగులు అనుభూతి చెంది మందుల కంటే వైద్యుడి మాటలు, ప్రవర్తనను ఎక్కువగా గుర్తించుకుంటారని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
- 13 ఖాతాలు.. రూ.8.50 కోట్ల లావాదేవీలు [ 26-02-2026] చట్టవ్యతిరేక లావాదేవీల బదిలీకి నిందితులు ఎక్కువగా కరెంట్ ఖాతాలనే ఎంచుకున్నారు. వీటితో ఎక్కువ మొత్తాల్లో లావాదేవీలను చేసేందుకు వీలుండడమే కారణం. తొమ్మిది నెలల్లో విజయవాడలో తెరిచిన ఖాతాల ద్వారానే రూ.8.50 కోట్ల నగదు బదిలీలు జరిగాయి.
- ఇప్పుడు తల్లడిల్లి.. ఏం లాభం? [ 26-02-2026] అతను కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి. ఆన్‌లైన్‌లో పెట్టుబడి ప్రకటన చూసి.. నమ్మారు. ఇబ్బడిముబ్బడిగా లాభాలు వస్తాయనే ఆశతో పెట్టుబడులు పెట్టారు.
- బందరులో పట్టపగలు భారీ చోరీ [ 26-02-2026] బందరు నగరంలో పట్టపగలు ఓ ఇంట్లో భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేకెత్తించింది. తాళం వేసి ఉన్న ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లో పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి.
- రూ.18 లక్షల విలువైన 122 చరవాణుల అప్పగింత [ 26-02-2026] ‘ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లి అపార్ట్‌మెంట్‌కు వచ్చాను. బూట్లు విడుద్దామని చరవాణి పక్కన పెట్టి తర్వాత మరిచిపోయి వెళ్లిపోయాను. 10 నిమిషాల తర్వాత చూస్తే అది కనిపించలేదు.
- భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య [ 26-02-2026] వృద్ధాప్యంలో తండ్రికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఒక్కసారిగా వారు నివాసం ఉండే బహుళ అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్లాయపాలెంలోని టిడ్కో కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.