Kishan Redddy: రాష్ట్రానికి సీఎం రేవంతా? నేనా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, హైదరాబాద్: ‘కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు నేను అడ్డుపడుతున్నానని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంతా? నేనా?’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోలేకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయలేదు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు భారాస, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంలో రెండు పార్టీల మధ్య ఏమాత్రం తేడాలేదు. రాష్ట్రానికి కేసీఆర్, రేవంత్‌రెడ్డిలు సీఎంలుగా పనిచేయడం దురదృష్టకరం. నాడు కేసీఆర్ తన అసమర్థతను కేంద్రంపై నెట్టారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సైతం అదే పనిచేస్తున్నారు. సీఎం ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య హార్వర్డ్ వెళ్లొచ్చాక సీఎం భాష మరింత దిగజారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ మీద ఈగ వాలకుండా కాపాడుతున్నారు. కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవడం లేదంటూ మా భుజాలపై బందూకులు పెట్టి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోకుండా రేవంత్‌రెడ్డిని ఎవరు ఆపుతున్నారు? రాహుల్‌గాంధీ ఆపుతున్నారా? మోదీని ఎదుర్కొనేందుకు కేసీఆర్, సోనియా కుటుంబాలు కుమ్మక్కయ్యాయి. రాహుల్‌గాంధీ ఆదేశాలన్నీ రేవంత్‌రెడ్డి పాటిస్తారు. మరి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని రేవంత్‌ను రాహుల్‌గాంధీ ఎందుకు ఆదేశించడం లేదు?
కాళేశ్వరం అవినీతి విషయంలో నన్ను ప్రశ్నించే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. అవన్నీ ఉత్తుత్తి మాటలే. మంత్రివర్గ సహచరులు వివిధ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల విషయంలో కుమ్ములాటలకు దిగుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినందునే సీఎం ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి గురించి చెప్పాల్సిన సీఎం ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. నాడు భారాస సర్కారును, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ఒవైసీ నడిపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. బీసీలున్న చోట ఎస్సీలకు, ఎస్సీలున్నచోట బీసీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ ల్యాబ్‌లో ఓటుకు నోటు కేసు, ఫోన్‌ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలి’’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్‌నాయక్, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పార్టీలో అవమానం ఇంకెంతకాలం.. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ప్రశ్న వలసవాదికి జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్ పదవి ఇచ్చారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- ఆ బూడిద భారం కరెంటు ఛార్జీలపై వద్దు! థర్మల్ విద్యుత్కేంద్రాల (టీపీపీల) నుంచి వెలువడుతున్న బూడిదను అవసరమైతే పరిశ్రమలకు ఉచితంగానైనా ఇచ్చేయాలని, దాని తరలింపు పేరుతో సామాన్య ప్రజలు చెల్లించే కరెంటు ఛార్జీలపై ఆర్థికభారం మోపవద్దని కేంద్ర విద్యుత్‌శాఖ ఆదేశించింది.
- రూ.కోట్లు పోయె... గెలవకపాయే! వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి ఇది. ఖర్చుల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చే మార్గంలేక ఆస్తుల అమ్మకానికి సిద్ధపడుతున్నారు.
- కర్ల రాజేశ్ మృతి కేసులో అలసత్వం ఎందుకు? దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతి ఘటనలో అధికారుల పనితీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
- మేయర్ జీతమెంతో తెలుసా? రాష్ట్రంలోని 7నగరపాలక సంస్థలు, 105 పురపాలక సంఘాలకు ప్రథమ పౌరులు వచ్చారు. కొత్త మేయర్లు, ఉపమేయర్లు.
- తల్లడిల్లుతూ.. తల్లి ప్రేమను చాటిన ఆవు తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగు బంధానికి మాటలు అవసరంలేదని ఓ మూగజీవి చాటింది. తన బిడ్డను కోల్పోయిన ఆవేదనలో ఉన్న ఆ గోమాత చూపిన చొరవ అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
- ‘పుర’ విజేతల్లో 64 మంది మహిళలే రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 112 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్లు, ఛైర్‌పర్సన్ల పదవులకు జరిగిన పరోక్ష ఎన్నికల్లో 57.14% మంది మహిళలు విజయం సాధించారు.
- వైభవంగా మల్లన్న ‘పెద్ద పట్నం’ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున ‘పెద్ద పట్నం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
- శ్రీ చైతన్య ప్రభంజనం జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయి. శ్రీ చైతన్య విద్యార్థి పసల మోహిత్ 300/300 మార్కులతో 100 పర్సంటైల్ సాధించి జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు.
- జమ్మికుంటలో తోపులాట కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో హైడ్రామా చోటుచేసుకుంది.
- కాంగ్రెస్ మద్దతుతో.. భారత రాష్ట్ర సమితి అభ్యర్థికి పీఠం వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక్కడ మొత్తం 10 వార్డులకుగాను.. భాజపా, భారత రాష్ట్ర సమితి , కాంగ్రెస్ అభ్యర్థులు మూడేసి వార్డుల్లో గెలిచారు.
- ‘సీఐఐ-ఐజీబీసీ’ జాతీయ ఛైర్మన్‌గా సి.శేఖర్‌రెడ్డి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) జాతీయ ఛైర్మన్‌గా సీఎస్‌ఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సి.శేఖర్‌రెడ్డి ఎంపికయ్యారు.
- జగిత్యాల భాజపా జిల్లా అధ్యక్షుడిపై దాడి మెట్‌పల్లి పట్టణంలో ఛైర్మన్ సీటు కోల్పోయామన్న ఆగ్రహంతో భాజపా కార్యకర్తలు, ఆ పార్టీ తరఫున ఎన్నికైన కౌన్సిలర్లు.. తమ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు ఇంటిపై సోమవారం దాడి చేశారు.
- బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం ‘అరుదైన వ్యాధి తినేస్తోంది..ఆదుకోండి!’ అనే శీర్షికన ‘ఈనాడు’లో సోమవారం ప్రచురితమైన మానవీయ కథనానికి దాతలు స్పందించారు.
- విద్యుత్తు బకాయిల వివాదంలో గీతం వర్సిటీకి ఊరట విద్యుత్తు బకాయిల వివాదం నుంచి హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీకి తాత్కాలిక ఉపశమనం లభించింది.
- క్యాన్సర్‌కు కణ చికిత్స క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవాత్మక అధ్యాయం మొదలైంది. మహమ్మారిని అంతమొందించేందుకు ‘కణ’ చికిత్సను విజయవంతంగా ఆవిష్కరించారు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బ్రూస్ లెవిన్. వర్సిటీలోని ‘పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’లో క్యాన్సర్ చికిత్సలో సెల్, కార్-టి సెల్, జన్యు థెరపీలపై ఆయన చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయి.
- ఒకే వాహనంలో వచ్చిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, భాజపా ఎంపీ ఇస్నాపూర్ పురపాలక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఒకే వాహనంలో వచ్చారు.
- హైదరాబాద్‌లో సనోఫీ జీసీసీ విస్తరణ ఔషధ తయారీ సంస్థ సనోఫీ హెల్త్‌కేర్ ఇండియా, హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను భారీగా విస్తరించింది. అత్యాధునిక హంగులతో అదనపు కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించింది.
- పీఠాలపై దంపతులు నిర్మల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన అప్పాల కావ్య, గణేశ్‌చక్రవర్తి దంపతులు ఎన్నికయ్యారు.
- ఆ మూడు పార్టీల మధ్య బంధమేంటో ప్రజలకు చెప్పాలి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి , ఎంఐఎం పార్టీలు ఏకమై భాజపాను ఎదగనీయకుండా కుట్రలు చేస్తున్నాయని, అయినా రాష్ట్రంలో కమలం బలపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు.