PM Modi: ఉగ్రవాదంపై భారత్‌ రాజీ పడదు: మోదీ

Eenadu icon
By International News Team Published : 08 Feb 2026 10:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్రవాదంపై భారత్‌ రాజీపడదని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi) పునరుద్ఘాటించారు. మలేషియా (Malaysia) పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, జాతీయ భద్రత, సెమీకండక్టర్లు, వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. 

సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ మలేషియాతో భారత్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు విభిన్న రంగాల్లో సంబంధాలను మరింత శక్తిమంతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ‘‘ఉగ్రవాదంపై మా సందేశం స్పష్టంగా ఉంది. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి, రాజీ వైఖరికి చోటు లేదు. భారత్‌-మలేషియా సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఇరు దేశాల ప్రజల మధ్య లోతైన ఆత్మీయ బంధం ఉంది. ఇండో పసిఫిక్‌ ప్రాంతం ప్రపంచానికి వృద్ధి యంత్రంగా మారింది ’’ అని పేర్కొన్నారు. భారత్‌-మలేషియా మధ్య ఆరు కీలక ఒప్పందాలు జరిగాయి. అంతకు ముందు కౌలాలంపుర్‌ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. 

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :