ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌: భొలారీ ఎయిర్‌ బేస్‌లో హ్యాంగర్‌ను తొలగిస్తున్న పాక్‌..!

Eenadu icon
By International News Team Published : 08 Feb 2026 13:43 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ తమకు ఏమీ కాలేదని పాక్‌ చెబుతున్నా.. ఉపగ్రహ చిత్రాల్లో మాత్రం పరిస్థితిని దాచలేకపోతోంది. భారత్‌ దాడిలో దెబ్బతిన్న భొలారిలోని పాక్‌ వాయుసేన స్థావరంలోని హ్యాంగర్‌కు తాజాగా మరమ్మతులు చేస్తోంది. మే 10వ తేదీన భారత్‌ దీనిపై దాడి చేసింది. ఇక్కడ పాక్‌కు చెందిన ఎయిర్‌బార్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సాబ్‌-2000 విమానం ధ్వంసమైనట్లు భారత్‌ అంచనా వేసింది.

ఈ ఏడాది జనవరి 28న వాంటోర్‌ సంస్థకు చెందిన ఉపగ్రహాలు ఇక్కడ చిత్రాలను తీశాయి. ఆ సమయంలో ఎయిర్‌ బేస్‌లో దెబ్బతిన్న హ్యాంగర్‌కు పాక్‌ దళాలు మరమ్మతులు చేస్తున్నట్లు తేలింది. అప్పటికే దెబ్బతిన్న ఆకుపచ్చటి పైకప్పును తొలగించినట్లు కనిపించింది. 

మే 10వ తేదీన పాక్‌ డ్రోన్‌ దాడులకు జవాబుగా వాయుసేన భొలారీ బేస్‌ను టార్గెట్‌ చేసుకొంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12లోపు దీనిలో హ్యాంగర్‌ను ధ్వంసం చేసింది. అయితే ఈ దాడికి వాయుసేన ఏ ఆయుధం వాడిందో మాత్రం వెల్లడించలేదు.  ఇప్పటికే ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ దాడి చేసి ధ్వంసం చేసిన మిలిటరీ బేస్‌లలో మరమ్మతులు జరుగుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :