Sunil Gavaskar: టీమ్ఇండియా చాలా నేర్చుకోవాలి!: సునీల్‌ గావస్కర్‌

Eenadu icon
By Sports News Team Published : 08 Feb 2026 16:32 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ( Team India) బ్యాటర్లు తడబడిన విషయం తెలిసిందే. 12.4 ఓవర్ల సమయానికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేసి, పీకల్లోతు కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. 

కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ( Suryakumar Yadav) వీరోచితంగా ఒంటరి పోరాటం చేయడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 49 బంతుల్లో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అమెరికా జట్టు 132 పరుగులకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తడబాటుకు గురైన నేపథ్యంలో భారత్‌ మరింత మెరుగ్గా తన బ్యాటింగ్‌ ప్రణాళికలను రూపొందించుకోవాలని టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌గావస్కర్‌ ( Sunil Gavaskar) సూచించాడు. 

‘నా దృష్టిలో 160 స్కోర్‌ చేయడం తేలిక కాదు. టీమ్‌ఇండియా మంచి మార్జిన్‌తోనే (29 పరుగులు) గెలిచింది. అయితే భారతజట్టు ఈ మ్యాచ్‌ నుంచి చాలా నేర్చుకోవాలి. బ్యాటింగ్ డెప్త్‌ ఉంది. కానీ పవర్‌ప్లేలో తేలిగ్గా వికెట్లు సమర్పించుకోవడం సమంజసం కాదు’ అని సునీల్‌ గావస్కర్‌ పేర్కొన్నాడు.

  • నాకు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఏం చెప్పాడంటే.. : సూర్యకుమార్‌ యాదవ్‌

‘ఎనిమిది మంది బ్యాటర్లతో భారత్‌ బరిలోకి దిగితే, ముగ్గురు మాత్రమే బౌలర్లుంటారు. 7 - 8 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోతే జట్టుకు పెద్ద సమస్య అవుతుంది. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ఉంటుందనేది వాస్తవమే. కానీ జట్టులో.. ఎనిమిది మంది బ్యాటర్లుంటే అందులో నలుగురి వికెట్లను పవర్‌ప్లేలోనే కోల్పోవడం కరెక్ట్‌ కాదు. అలా అయితే మనల్ని మనమే ఒత్తిడిలోకి నెట్టుకున్నట్లవుతుంది’ అని సునీల్‌ గావస్కర్‌ విశ్లేషించాడు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్కాట్లాండ్‌తో మ్యాచ్‌.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 153 పరుగులు టీ20 ప్రపంచ కప్‌లో కోల్‌కతా వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు స్కాట్లాండ్‌ 153 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.
  • అప్పట్లో ధోని కెప్టెన్సీ ఎందుకు వీడాడంటే..: జతిన్‌ పరాంజ్‌పే రోహిత్‌ శర్మ (Rohit Sharma) నుంచి శుభ్‌మన్‌ గిల్‌కు (Shubman Gill) 2025లో కెప్టెన్సీ మార్పు జరిగింది. ఇది భారత క్రికెట్‌లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
  • అవును..భారత్‌పై మాకు మంచి రికార్డ్‌ లేదని అంగీకరిస్తాం: పాక్‌ ఫిబ్రవరి 15న భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్‌. ఇప్పటికే ఇరు జట్లూ అందుకోసం సిద్ధంగా ఉన్నాయి.
  • వర్షం వల్ల ఇండియా పాక్‌ మ్యాచ్‌ రద్దైతే..? పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌, పాక్‌.. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఈ మ్యాచ్‌ రద్దైతే పరిస్థితి ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
  • ఒమన్‌ చిత్తు.. 96 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ ఘన విజయం కొలంబో వేదికగా ఒమన్‌తో టీ20 వరల్డ్‌కప్‌ 2026 నేపథ్యంలో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.
  • భారీ స్కోర్‌ బాదిన ఐర్లాండ్‌.. ఒమన్‌ లక్ష్యం 236 పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. కొలంబో వేదికగా ఒమన్‌, ఐర్లాండ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఒమన్ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.
  • బాబూ.. మీరూ ‘బాధ్యత’ తీసుకోవాలి! టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అసలైన కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న తలపడనుంది.
  • కొలంబోలో హోటల్‌ లాబీలో గర్ల్‌ఫ్రెండ్‌తో దర్శనమిచ్చిన హార్దిక్‌ పాండ్య పాకిస్థాన్‌తో మ్యాచ్‌ వేళ టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబసభ్యులతో ఉండటానికి వీల్లేదు. అయితే హార్దిక్‌ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్‌ మహిక శర్మతో కొలంబోలోని హోటల్‌ లాబీలో కనిపించాడు.
  • టీమ్‌ఇండియాకు ఆ సత్తా ఉంది: హర్భజన్‌ సింగ్‌ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ పోరులో భారత్‌ విజయ కేతనం ఎగుర వేస్తుందని టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు.
  • పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్‌ సూర్యవంశీ Vaibhav Suryavanshi: అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ.. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. 
  • మళ్లీ ‘శివరాత్రి’ మ్యాచ్‌.. ఫ్యాన్స్‌లో హైవోల్టేజ్‌ సచిన్‌ను క్రికెట్‌ దేవుడిగా మార్చిన ఇన్నింగ్స్‌ల్లో ‘శివరాత్రి’ మ్యాచ్‌ ఒకటి. ఇది యూఏఈలో ఆసీస్‌పై ‘డిజర్ట్‌ స్ట్రామ్‌’ ఇన్నింగ్స్‌తో పోటీపడుతూ మాస్టర్‌ బ్లాస్టర్‌ కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలిచింది.
  • జింబాబోయ్‌ ఇంగ్లాండ్‌ను నేపాల్, దక్షిణాఫ్రికాను అఫ్గానిస్థాన్‌ వణికించాయి. భారత్‌ను అమెరికా, పాకిస్థాన్‌ను నెదర్లాండ్స్‌ భయపెట్టాయి. మిగతా చిన్న జట్లూ సత్తా చాటాయి. కానీ వాటిలో ఏ జట్టూ గెలుపు తీరాన్ని మాత్రం చేరలేకపోయింది.
  • మనోడు దంచేశాడు తెలుగు కుర్రాడు సాయితేజ ముక్కమల్ల (79; 51 బంతుల్లో 5×4, 4×6) సత్తా చాటాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో ఆ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టింది.
  • అమెరికా క్రికెట్లో తెలుగుతేజం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేసే తెలుగు వాళ్లు లక్షల్లో ఉంటారు. ఇంకా అక్కడ డాక్టర్లు, వ్యాపారవేత్తల్లోనూ ఎంతోమంది తెలుగువాళ్లున్నారు.
  • లోటు డబ్బుకే.. ఆటకు కాదు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడి పేరు సంపాదిస్తే.. కోట్లల్లో డబ్బొస్తుంది. కోట్లాది అభిమానుల ఆదరణా దక్కుతుంది. జీవితానికి ఏ లోటూ ఉండదు. భారత్‌ సహా చాలా క్రికెట్‌ దేశాల ఆటగాళ్ల విషయంలో ఇది నిజమే.
  • కెనడాకు యూఏఈ పంచ్‌ టీ20 ప్రపంచకప్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) బోణీ కొట్టింది. ఉత్కంఠభరిత పోరులో కెనడాకు షాకిచ్చి తొలి విజయం నమోదు చేసింది.
  • ముకేశ్‌కు రజతం ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు ముకేశ్‌ నేలవల్లి సత్తాచాటాడు. టోర్నీ చివరి రోజు శుక్రవారం 25 మీటర్ల పిస్టల్‌ జూనియర్ల విభాగంలో 582 పాయింట్లతో రజతం సాధించాడు.
  • భారత్‌కు రజతం ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ ఛాంపియనషిప్‌ వీల్‌చైర్‌ విభాగంలో భారత్‌ తొలిసారి రజతం నెగ్గింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో అల్ఫియా జేమ్స్, ప్రేమ్‌ కుమార్‌ జోడీ 6-21, 4-21తో క్యుజిమొ, యుటాంగ్‌ (చైనా) జంట చేతిలో ఓడింది.
  • అర్ష్‌దీప్‌ స్థానంలో కుల్‌దీప్‌? భారత్‌- పాకిస్థాన్‌ మధ్య ఆదివారం జరిగే హైఓల్టేజ్‌ మ్యాచ్‌కు పేసర్‌ అర్ష్‌దీప్‌ స్థానంలో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని భారత్‌ మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ పేర్కొన్నాడు.
  • సంక్షిప్త వార్తలు రాజస్థాన్‌ రాయల్స్‌కు రియాన్‌ పరాగ్‌ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌ 2026లో రాజస్థాన్‌కు రియాన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని శుక్రవారం ఫ్రాంచైజీ ప్రకటించింది.