PM Modi: స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మోదీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: మలేసియా (Malaysia)లో రెండు రోజుల పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ (modi) భారత్‌కు బయలుదేరారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ‘‘మలేసియాలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతమైంది. ఆ దేశం మోదీకి ఘన స్వాగతం పలికి ప్రత్యేక ఆతిథ్యాన్ని అందించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతంగా మారాయి’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
కాగా, ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో అద్భుతమైన సమావేశం జరిగిందని మోదీ ‘ఎక్స్’వేదికగా కొనియాడారు. తమ స్నేహపూర్వక బంధాన్ని పొరుగుదేశాలు ఎప్పటికీ ఆస్వాదిస్తాయన్నారు. వాణిజ్యం, రక్షణ సహా పలు సెక్టార్‌లో సహకారం అందించుకోవాలని ఇరుదేశాలు బలంగా నిశ్చయించుకున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీఈఓ ఫోరమ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ ఇరు దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడులకు కొత్త పుంతలు తొక్కనుందని మోదీ తెలిపారు. రక్షణ, జాతీయ భద్రత, సెమీకండక్టర్లు, వాణిజ్యం, ఏఐ, వృత్తి విద్య, ఐటీ, డిజిటల్ టెక్నాలజీ సహా మరిన్ని అంశాలపై ఇరు దేశ నాయకులు పలు చర్చలు జరిపారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :