KTR: రేవంత్‌ను కేసు నుంచి తప్పించడానికే ల్యాబ్‌ తగులబెట్టారు: కేటీఆర్‌

Eenadu icon
By Telangana News Team Published : 08 Feb 2026 18:37 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హనుమకొండ: హైదరాబాద్‌ నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో అగ్ని ప్రమాదం కావాలనే చేశారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హనుమకొండలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, అసలు నేరస్థులు ఎవరో తేలాలంటే రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

‘‘ఓటుకు నోటు కేసు నుంచి రేవంత్‌ను తప్పించడానికే ల్యాబ్‌ తగులబెట్టారు. అందరూ మున్సిపల్‌ ఎన్నికల్లో బిజీగా ఉంటే రేవంత్‌రెడ్డి మాత్రం మురికి పనుల మీద ఉన్నారు. కేసు చివరి దశలో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరగడంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగి ఏడాదిన్నర అయినా.. కనీసం కేసు కూడా నమోదు కాలేదు. సింగరేణి కుంభకోణం బయటపెట్టినా.. కేంద్రం స్పందించటంలేదు’’ అని కేటీఆర్‌ ఆరోపించారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :