Rinku Singh: కోచ్ గంభీర్ నిర్దయగా ఉండమంటారు: రింకు సింగ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. శనివారం యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో కొంత తడబడ్డా చివరికి 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్‌ఇండియా ఫినిషనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రింకు సింగ్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైనా ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి పరుగులను అడ్డుకున్నాడు. కీలక సమయంలో యూఎస్‌ఏ బ్యాటర్ సంజయ్ కృష్ణమూర్తి కొట్టిన బంతిని క్యాచ్ పట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అందుకే, మ్యాచ్ అనంతరం భారత జట్టు సంప్రదాయంగా ఇస్తున్న ఉత్తమ ఫీల్డర్ మెడల్.. ఈ సారి రింకుని వరించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో మెడల్ పొందిన రింకు జట్టును ఉద్దేశించిన మాట్లాడిన వీడియోను తాజాగా బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
- టీమ్ఇండియా చాలా నేర్చుకోవాలి!: సునీల్ గావస్కర్
వీడియోలో కెప్టెన్ సూర్య.. రింకు పేరును ప్రకటించాడు. అనంతరం రింకు మాట్లాడుతూ.. ‘‘హలో టీమ్‌ఇండియా.. టోర్నమెంట్‌లో ఇది ఆరంభం మాత్రమే. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా. జట్టులో ఒకరికొకరు సహకరించుకోవాలి. కోచ్ జీజీ(గౌతమ్ గంభీర్) ఎప్పుడూ నిర్దయగా ఉండమని చెబుతుంటారు. అలాగే కొనసాగాలి’’అని రింకు చెప్పుకొచ్చాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :