


Pawan Kalyan: ధర్మపరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, అమరావతి: తల్వార్‌తో కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు గురు తేగ్‌బహదూర్ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర ఆయనదని, అందుకే దేశం ఆయనను కీర్తిస్తోందని కొనియాడారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ప్రముఖ సిక్కు గురువు తేగ్ బహదూర్ 350 షాహిదీ సమాగమంలో పవన్ కల్యాణ్ ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘350 ఏళ్లు గడిచినా మనమంతా తేగ్ బహదూర్ బలిదానాన్ని స్మరిస్తున్నామంటే ఆయన త్యాగం చారిత్రక సంఘటనే కాదు.. ప్రతి మనిషిలోని వివేకానికి పరీక్ష. 1675 నవంబరు 24న దిల్లీలోని చాందినీ చౌక్ వద్ద తేగ్‌బహదూర్ బలిదానం నేడు పొరుగు దేశాల్లో ఉన్న హిందూ మైనారిటీల వేదనను గుర్తుచేస్తోంది. ఆయన త్యాగం ఒక చరిత్రే కాదు, మనందరికీ హెచ్చరిక. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే.. దేశానికి నేడు బలంగా మాట్లాడే స్వరం అవసరం లేదు.. ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడిన స్వరం అవసరం. స్వతంత్ర ఫలాలను అనుభవించే ప్రతి పౌరుడు ధర్మ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలి’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
మహనీయులను అందించిన నేల మహారాష్ట్ర
‘ఆధ్యాత్మిక శక్తి సామాజిక జీవనానికి దారి చూపాలి. మహారాష్ట్ర ఎప్పుడూ ఇదే చెప్పింది. నిజమైన బలం ఆధిపత్యంలో కాదు పరోపకారంలో ఉంటుందని చాటిచెప్పింది. ఛత్రపతి శివాజీ నుంచి సంత్ తుకారాం, సంత్ జ్ఞానేశ్వర్, జ్యోతీబా ఫులే, బాబాసాహెబ్ అంబేడ్కర్ వంటి మహనీయులను దేశానికి అందించిన నేల మహారాష్ట్ర’ అని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ‘దేశానికి నేడు మానవీయ విలువలు కాపాడే వీరత్వం, ఆత్మ పరిశీలన చేసుకునే వివేకం కలిగిన నాయకత్వం అవసరం. ప్రధాని మోదీ 2047 వికసిత్ భారత్ విజన్ కేవలం ఆర్థిక అభివృద్ధి మంత్రమే కాదు. సంస్కృతి, సంప్రదాయం, సామాజిక నిబద్ధత కూడా. యువత భాగస్వామ్యం లేకపోతే అది అసాధ్యం. నాందేడ్ పవిత్ర భూమి నుంచి మనమంతా సంకల్పం తీసుకుని గురు తేగ్ బహుదూర్ లక్ష్యాలు ముందుకు తీసుకెళదాం’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, సిక్కు మత పెద్దలు కుల్వంతర్, బల్వేందర్, బాబూ సింగ్ మహారాజ్, వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రికి కృపాణం బహూకరణ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి నాందేడ్‌లోని గురుద్వారాను సందర్శించిన పవన్ కల్యాణ్‌కు గురుద్వారా ఛైర్మన్ విజయ్ సత్పాల్‌సింగ్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖుల చేతుల మీదుగా సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. గురుద్వారా గ్రంథాలు.. పవిత్ర వస్త్రాన్ని పవన్ కల్యాణ్‌కు వేసి ఆశీర్వదించారు. సిక్కు మత పెద్దలు సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కృపాణాన్ని బహూకరించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ యంత్రాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సంక్షిప్త వార్తలు(16) జోడు రథాలు.. మిన్నంటిన శివనామస్మరణలు.. కిక్కిరిసిన వీధులతో శ్రీకాళహస్తిలో రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.
- స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రొమానా క్రోపిలోవా మధ్య ఆదాయ దేశాల్లో విద్యలో తీసుకొచ్చిన కొన్ని ఏఐ సాధనాలు విఫలమవుతున్నాయని ఫ్యాబ్ ఏఐ ఎడ్యుటెక్ డైరెక్టర్ రొమానా క్రోపిలోవా తెలిపారు.దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంప్యాక్ట్ సమ్మిట్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ..
- ప్రభుత్వ సేవలు మరింత సులభతరం ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు.
- సింగిల్ జడ్జి ఉత్తర్వులపై దామోదరనాయుడు అప్పీల్ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా తన నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డాక్టర్ టి.దామోదరనాయుడు దాఖలు చేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
- వైకాపా హయాంలోని ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అసలైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై ప్రభుత్వం విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు.
- జస్టిస్ బాలాజికి ఘన సన్మానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మెడమల్లి బాలాజిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
- నూజివీడు కోర్టుకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో నమోదైన కేసులో వైకాపాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సోమవారం నూజివీడులోని న్యాయస్థానంలో హాజరయ్యారు.
- తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, ఇతర నిందితులు బాలరాజు, రాజేష్, మణిమారన్, ఎన్.రవి, అన్బురాసు, అల్లాబక్షు కోర్టులో వాయిదాకు హాజరయ్యారు.
- డ్వాక్రా మహిళలకు తీపికబురు మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
- రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల.. మే నెల కోటా విడుదల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఈనెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- 498 కేసులో లుకౌట్ నోటీసా? పోలీసులు యాంత్రిక ధోరణిలో లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసేస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.
- బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీల జనాభా అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్‌ను నియమించనుంది.
- నెల్లూరు మేయర్, ఏలూరు డిప్యూటీ మేయర్ స్థానాలకు 26న ఎన్నికలు రాష్ట్రంలోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.
- త్యాగనిరతికి నిలువెత్తు ఆకృతి రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు శాఖమూరు వద్ద ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
- రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ ‘కృత్రిమ మేధ(ఏఐ)తో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం. త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం అందే సాంకేతిక వ్యవస్థను (వీ2వీ) అందుబాటులోకి తీసుకురానున్నాం.
- ఇంటింటికీ నీటి సరఫరాపై నిఘా గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరాలో నాణ్యత ప్రమాణాలను ఏఐతో ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరించారు ‘ఆర్ఘ్యం’ సంస్థ సీనియర్ మేనేజర్ భావన బడోలా.
- క్రీడాకారుల ఆటను ఏఐతో ట్రాక్ చేస్తున్నాం క్రీడాకారుల ఆట తీరు, వ్యక్తిగత శిక్షణ కార్యక్రమాలను కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా ట్రాకింగ్ చేస్తున్నామని లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపకులపతి కపానా శర్మ తెలిపారు.
- సముద్రాలకు ప్లాస్టిక్ నుంచి విముక్తి ఏఐ ఆధారిత విధానాలతో సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపొచ్చని కర్ణాటకలోని ఉడుపికి చెందిన బేరు కోస్ట్ క్లియర్ సంస్థ వ్యవస్థాపకురాలు దివ్యా హెగ్డే అనుభవపూర్వకంగా తెలిపారు.
- సాగరతీరంలో మిలన్ సంబరాలు అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (ఐఎఫ్‌ఆర్-2026), మిలన్ వేడుకల్లో భాగంగా తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక విన్యాసాలు జరిగాయి.
- తిరుమలలో తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించండి తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భద్రాచలం సమీపంలోని ఐదు ఏపీ గ్రామాల్ని తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్టు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.