సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగితేనే మనుగడ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మందమర్రి పట్టణం: సింగరేణి సంస్థ ప్రస్తుతం ఉన్న సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతేనే మనుగడ ఉంటుందని మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి కార్మికుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
