స్నేహితులతో కలిసి 20 కుటుంబాలకు ఎమ్మార్వో ఆర్థిక సాయం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండల తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, మరికొంత మంది స్నేహితులతో కలిసి పలువురికి అండగా నిలిచారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 20 కుటుంబాలకు రూ.2.80 లక్షలు సాయం అందించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారు, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న వారు, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను గుర్తించి వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్థిక సాయం చేశారు. తన స్నేహితులతో కలిసి తహసీల్దార్ చేసిన ఈ మంచి పనిని అందరూ మెచ్చుకున్నారు. పలువురు స్థానికులు ఎమ్మార్వోను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
► Read latest Nalgonda Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :