IND vs NZ: ఆ బ్యాటర్ సిక్స్‌ల వెనుక పెద్ద ప్లానింగే: న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ క్రికెటర్ మార్క్ చాప్‌మన్.. (Mark Chapman) టీమ్‌ఇండియా ( Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మను ( Abhishek Sharma) పొగడ్తలతో ముంచెత్తాడు. అతడి సిక్స్ హిట్టింగ్ సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు. అతడి షాట్ల వెనక పక్కా ప్లానింగ్ ఉందని చాప్‌మన్ అభిప్రాయపడ్డాడు.
‘నిజాయతీగా చెప్పాలంటే.. వారి బ్యాటింగ్ అమోఘంగా, విధ్వంసకరంగా ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం అమోఘం. ఈ విషయంలో అతడి ప్లానింగ్ బాగుంది. అతడు ప్రస్తుతం అత్యద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. బాగా ఆడుతున్నవారిని పరుగులు చేయకుండా నిలువరించడం కొన్నిసార్లు చాలా కష్టం. మేం కచ్చితంగా మెరుగుపడతాం అని ఆశిస్తున్నా’ అని చాప్‌మన్ అన్నాడు.
‘మేం పెద్ద స్కోర్లు సాధించడం గురించి ఆలోచించాలి. పిచ్‌లు బాగున్నాయి. కానీ భారత్‌లో కొన్ని సార్లు బంతి బాగా తిరుగుతుంది. కాబట్టి మేం ప్రతి దానికీ సిద్ధంగా ఉండాలి. టీ20 ప్రపంచకప్ ( ICC Mens T20 World Cup) 2026 సన్నాహకాల్లో భాగంగా ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 జట్లలో ఒకటైన టీమ్‌ఇండియాతో తలపడుతుండటం బాగుంది. కాబట్టి మేం వారి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం’ అని చాప్‌మన్ పేర్కొన్నాడు.
- థాంక్యూ కివీస్.. భలే టైమ్‌కి వచ్చారు!
‘పవర్ ప్లేలో ప్రారంభంలోనే మేం రెండు వికెట్లు కోల్పోయాం. ఇది సమంజసం కాదు. కానీ ఆ క్రెడిట్ అంతా భారత బౌలర్లకే దక్కుతుంది. వారు నిజంగా చక్కగా బంతులేసి, పరుగులు చేయకుండా మమ్మల్ని కట్టడి చేశారు. మేం బంతిని బౌండరీలకు తరలించలేకపోయాం’ అని చాప్‌మన్ వాపోయాడు.
గువహటి వేదికగా జరిగిన మూడో టీ20లో తొలుత టాస్ గెలిచిన టీమ్‌ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఛేదన ప్రారంభించిన భారత జట్టు కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 155 రన్స్ చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో ( Suryakumar Yadav) కలిసి మూడో వికెట్‌కు కేవలం 40 బంతుల్లోనే 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. టీమ్‌ఇండియా ఇప్పటికే 3-0 తేడాతో అయిదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20 విశాఖపట్నం వేదికగా బుధవారం, చివరి టీ20 తిరువనంతపురంలో శనివారం జరగనుంది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 15:13 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- టీ20 ప్రపంచకప్ సూపర్ 8... మిగిలిన రెండు బెర్తులు ఎవరికి? టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశకు ఆరు టీమ్‌లు క్వాలిఫై అవ్వగా.. మరో రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
- రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీలు.. కెనడాపై న్యూజిలాండ్ ఘన విజయం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా పొట్టిప్రపంచకప్‌లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
- ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు.
- అభిషేక్ శర్మ.. అభిమన్యుడు కాదు అర్జునుడు అతడు..! టీమ్‌ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పేరు చెబితే సునామీ ఇన్నింగ్స్‌లే గుర్తుకువస్తాయి. ప్రత్యర్థి బౌలర్లను అతడు హడెలెత్తించే ఊచకోతే జ్ఞప్తికి వస్తుంది. కానీ.. అభిషేక్ శర్మ గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా తడబడుతున్నాడు.
- యువరాజ్ సమ్రా సూపర్ సెంచరీ.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 174 టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్, కెనడా జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన కెనడా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.
- గౌతమ్ గంభీర్‌కు కీలక పదవిని ఆఫర్ చేసిన రాజస్థాన్ రాయల్స్! ప్రస్తుతం టీమ్ఇండియా (Team India) హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) ఐపీఎల్ (IPL) ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కీలక పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
- తిరుమల శ్రీవారి సేవలో అమెరికా క్రికెటర్లు తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు.
- తూచ్.. నేను నఖ్వీని అలా అనలేదు..: మాట మార్చిన షోయబ్ అక్తర్! పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ 24 గంటలైనా గడవక ముందే మాట మార్చాడు. తాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అధ్యక్షుడు నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదని యూటర్న్ తీసుకున్నాడు.
- పది పరీక్షలకు వైభవ్ దూరం భారత అండర్-19 ప్రపంచకప్ స్టార్.. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
- కోపం వదిలెయ్ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్ అనంతరం భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
- అక్కడ మెరుపుల్లేవ్ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
- కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8కు దూసుకెళ్లింది.
- పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్! భారత స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్ అనుగ్రహ పాండే. మోడల్ అదితి హుండియాతో ఇషాన్ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
- అజ్మతుల్లా ఆల్‌రౌండ్ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
- ఇంగ్లాండ్ సూపర్-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ సూపర్-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
- అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
- పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
- బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ పరాజయ ప్రభావం.. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజాం, షాహీన్ అఫ్రిదిలపై పడేలా ఉంది.
- సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.