Heart attack: డ్రైవింగ్ సీటులోనే కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్.. ప్రయాణికులు సురక్షితం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

చౌటుప్పల్, న్యూస్‌టుడే: డ్రైవింగ్ సీటులోనే ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ కుప్పకూలిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోన్న బస్సు డ్రైవర్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. చౌటుప్పల్ వద్ద ఛాతీలో నొప్పి రావడంతో బస్సును సర్వీసు రోడ్డులో డ్రైవర్ ఆపేశాడు. వెంటనే అతడిని ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు లేరని చెప్పడంతో.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఈసీజీ తీసి మరణించినట్లు ధ్రువీకరించారు. మృతుడిని విజయవాడ డిపోలో పనిచేస్తున్న గొల్లపూడికి చెందిన నాగరాజు(38)గా గుర్తించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మియాపూర్ నుంచి అమరావతి బస్సు విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులోని 19 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 16:28 IST