India-European Union: ఐరోపాతో ట్రేడ్‌ డీల్‌.. లగ్జరీ కార్లపై 40 శాతానికి టారిఫ్‌లు..!

Eenadu icon
By Business News Team Published : 26 Jan 2026 14:02 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతదేశం- ఐరోపా సమాఖ్య (India-European Union) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్చల దశలో ఉన్న   ఈ ఒప్పందంలో లగ్జరీ కార్లపై టారిఫ్‌లకు సంబంధించిన కీలక ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐరోపా యూనియన్ నుంచి దిగుమతి అవుతున్న ఆ కార్లపై భారత్‌ సుంకాలు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 110 శాతంగా ఉన్న టారిఫ్‌లు 40 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం.

15వేల యూరోల కంటే ఎక్కువ ధర ఉన్నవాటికి ఈ వెసులుబాటు కల్పించనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో ఆ సుంకాలు మరింత తగ్గొచ్చని పేర్కొన్నాయి. ఈ తగ్గింపు అమలైతే వోక్స్‌వ్యాగన్, మెర్సిడెజ్ బెంజ్‌, బీఎండబ్ల్యూ వంటి ఐరోపా సంస్థలకు భారత మార్కెట్‌లో సులభతర వాణిజ్యం వీలుకానుంది (India Trade Deal With EU). ఈ కథనాలపై భారత వాణిజ్య శాఖ, యూరోపియన్ యూనియన్ కమిషన్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. 

  • విలాసవంత ఇళ్ల ధరలు తగ్గొచ్చు!

భారత్‌తో ట్రేడ్‌ డీల్‌ను ఉద్దేశించి ఇటీవల ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన పని ఉంది. మేం చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా పయనిస్తున్నాం. కొందరు దీనిని మదర్ ఆఫ్ ఆల్‌ డీల్స్‌గా పిలుస్తారు. దీనివల్ల కోట్లాదిమంది ప్రజలకు వస్తువులు, సేవలు ఎగుమతి-దిగుమతి చేసుకొనే సౌలభ్యం కలుగుతుంది. ఇది ప్రపంచ జీడీపీలో 25 శాతానికి సమానం’’ అని దావోస్‌ వేదికగా ఉర్సులా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆమె.. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగానే ట్రేడ్‌ డీల్ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఉద్యోగం ఉండాలంటే ఏఐ టూల్స్‌ నేర్చుకోండి కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్న సాఫ్ట్‌వేర్‌  ఉద్యోగులకు భరోసానిచ్చే సలహాను టెక్‌ పరిశ్రమ దిగ్గజాలు సూచిస్తున్నారు. ‘ప్రశాంతంగా ఉండండి, నైపుణ్యాలు పెంచుకోండి’ అని తెలిపారు.
  • చలామణిలో రూ.40 లక్షల కోట్ల నగదు దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవం కొనసాగుతున్నా, ప్రజల చేతుల్లో నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది.
  • మన వ్యవసాయ రంగానికి రూ.36 లక్షల కోట్ల అవకాశాలు అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదిరిన వాణిజ్య ఒప్పందాల కారణంగా, భారత వ్యవసాయ రంగానికి 400 బి. డాలర్ల (దాదాపు రూ.36 లక్షల కోట్ల) అవకాశాలు లభించగలవని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
  • రాణించిన బ్యాంకింగ్, విద్యుత్‌ షేర్లు విద్యుత్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్ల రాణింపుతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అమెరికా- ఇరాన్‌ చర్చల ప్రభావంతో, అంతర్జాతీయంగా చమురు ధరలు సానుకూలంగా కదలాడటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.
  • 2035కు రూ.215 లక్షల కోట్ల రిటెయిల్‌ విపణి మన దేశ భారత రిటెయిల్‌ రంగ విపణి పరిమాణం 2035 నాటికి రూ.210-215 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. 2025లోని రూ.90- 95 లక్షల కోట్ల స్థాయితో పోలిస్తే, ఈ విలువ రెట్టింపు కంటే ఎక్కువ.
  • టోకు ధరలూ పెరిగాయ్‌ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలా పెరిగి, జనవరిలో 1.18 శాతంగా నమోదైంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులు, తయారీ వస్తువులు ప్రియం కావడం ఇందుకు కారణం.
  • స్నాప్‌డీల్‌పై రూ.5 లక్షల జరిమానా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) ధ్రువీకరణకు అనుగుణంగా లేని బొమ్మలు విక్రయించినందుకు, 2020 టాయ్స్‌ (నాణ్యతా నియంత్రణ) ఆర్డర్‌ను ఉల్లంఘించినందుకు..
  • వేణుగోపాల్‌ ధూత్‌ సహా 12 సంస్థలకు దిల్లీ న్యాయస్థానం నోటీసులు మొజాంబిక్‌లోని కంపెనీ చమురు-గ్యాస్‌ ఆస్తులకు నిధులు సమకూర్చడంలో భాగంగా రూ.61,700 కోట్ల బ్యాంకు రుణ మోసానికి పాల్పడిన వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్, ఆ గ్రూప్‌ అనుబంధ డజను సంస్థలకు దిల్లీ న్యాయస్థానం..
  • నేడు ఈడీ ముందుకు టీనా అంబానీ! మనీలాండరింగ్‌ కేసు వ్యవహారంలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందుకు రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ భార్య, మాజీ నటి టీనా అంబానీ హాజరయ్యే అవకాశం ఉంది.
  • సంక్షిప్త వార్తలు (9) జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా ఈ ఏడాది 4 కొత్త మోడళ్లను ఆవిష్కరించాలని యోచిస్తోంది. వాటిలో ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌ ఎస్‌యూవీ కూడా ఉంది.