T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్.. పాక్‌వి వట్టిమాటలేనా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026)ను బహిష్కరిస్తామంటూ బెదిరించిన పాకిస్థాన్ ఆదివారం తమ జట్టును ప్రకటించింది. అయితే, తాము టోర్నీలో పాల్గొనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ప్రపంచ కప్‌లో తమ జట్టును ఆడించొద్దని పాకిస్థాన్ నిర్ణయం తీసుకునే అవకాశముందట. ఒకవేళ టోర్నీలో పాల్గొన్నా భారత్‌తో మ్యాచ్‌ను (IND vs PAK) బహిష్కరించాలని యోచిస్తోందని సమాచారం. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలో షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.
‘‘తుది నిర్ణయం ప్రధానమంత్రిపై ఆధారపడి ఉంటుంది. అయితే టీ 20 ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి ప్రభుత్వం అనుమతించకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది క్రికెట్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఒక దేశ గౌరవంతో ముడిపడి ఉన్న అంశం. బంగ్లాదేశ్ తన చట్టబద్ధమైన హక్కును కోల్పోయింది. బంగ్లా పట్ల ఐసీసీ వ్యవహరించిన వైఖరితో పాకిస్థాన్ కూడా టోర్నీలో పాల్గొనడంపై పునరాలోచన చేస్తోంది. అంతర్జాతీయ క్రీడల్లో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు. ఒకవైపు భారత్‌కు వేదికలను ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చారు. బంగ్లాదేశ్ భద్రతా కారణాలతో వేదికలను మార్చాలంటే తిరస్కరించారు. ఐసీసీ నిజంగా క్రికెట్ ప్రపంచ క్రీడగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే అటువంటి ఎంపిక విధానాలకు ముగింపు పలకాలి’’ అని పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
- ఆ బ్యాటర్ సిక్స్‌ల వెనుక పెద్ద ప్లానింగే: న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్
పీసీబీ మూడు ఆప్షన్లు!
టీ20 ప్రపంచ కప్ గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు ఆప్షన్లను పరిశీలిస్తోందని అక్కడి మీడియాలో వార్తలొస్తున్నాయి. మొదటిది.. టోర్నీలో ఆడితే అన్ని మ్యాచ్‌ల్లోనూ చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించడం. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించడం రెండోది. టోర్నీలో తాము సాధించే ప్రతి విజయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ మద్దతుదారులకు అంకితం చేయాలని మూడో ఆప్షన్‌గా పీసీబీ భావిస్తోందట.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 16:39 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆదుకొన్న బాంటన్.. స్కాట్లాండ్‌పై ఇంగ్లాండ్ విజయం స్వల్ప లక్ష్య ఛేదనలో కాస్త తడబాటుకు గురైనప్పటికీ ఇంగ్లాండ్ ఆఖరికి విజయం సాధించింది.
- తారిక్ ‘యాక్షన్’కు.. భారత్ ‘రియాక్షన్’ ఎలా ఉంటుందో? ఆదివారం భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్. అయితే, పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌పైనే ఇప్పుడందరి దృష్టి ఉంది.
- స్కాట్లాండ్‌తో మ్యాచ్.. ఇంగ్లాండ్ లక్ష్యం 153 పరుగులు టీ20 ప్రపంచ కప్‌లో కోల్‌కతా వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు స్కాట్లాండ్ 153 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.
- అప్పట్లో ధోని కెప్టెన్సీ ఎందుకు వీడాడంటే..: జతిన్ పరాంజ్‌పే రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) 2025లో కెప్టెన్సీ మార్పు జరిగింది. ఇది భారత క్రికెట్‌లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
- అవును..భారత్‌పై మాకు మంచి రికార్డ్ లేదని అంగీకరిస్తాం: పాక్ ఫిబ్రవరి 15న భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్. ఇప్పటికే ఇరు జట్లూ అందుకోసం సిద్ధంగా ఉన్నాయి.
- వర్షం వల్ల ఇండియా పాక్ మ్యాచ్ రద్దైతే..? పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాక్.. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఈ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- ఒమన్ చిత్తు.. 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం కొలంబో వేదికగా ఒమన్‌తో టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.
- భారీ స్కోర్ బాదిన ఐర్లాండ్.. ఒమన్ లక్ష్యం 236 పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. కొలంబో వేదికగా ఒమన్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఒమన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.
- బాబూ.. మీరూ ‘బాధ్యత’ తీసుకోవాలి! టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అసలైన కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న తలపడనుంది.
- కొలంబోలో హోటల్ లాబీలో గర్ల్‌ఫ్రెండ్‌తో దర్శనమిచ్చిన హార్దిక్ పాండ్య పాకిస్థాన్‌తో మ్యాచ్ వేళ టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబసభ్యులతో ఉండటానికి వీల్లేదు. అయితే హార్దిక్ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మతో కొలంబోలోని హోటల్ లాబీలో కనిపించాడు.
- టీమ్‌ఇండియాకు ఆ సత్తా ఉంది: హర్భజన్ సింగ్ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో భారత్ విజయ కేతనం ఎగుర వేస్తుందని టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ అన్నాడు.
- పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ Vaibhav Suryavanshi: అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
- మళ్లీ ‘శివరాత్రి’ మ్యాచ్.. ఫ్యాన్స్‌లో హైవోల్టేజ్ సచిన్‌ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఇన్నింగ్స్‌ల్లో ‘శివరాత్రి’ మ్యాచ్ ఒకటి. ఇది యూఏఈలో ఆసీస్‌పై ‘డిజర్ట్ స్ట్రామ్’ ఇన్నింగ్స్‌తో పోటీపడుతూ మాస్టర్ బ్లాస్టర్ కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలిచింది.
- జింబాబోయ్ ఇంగ్లాండ్‌ను నేపాల్, దక్షిణాఫ్రికాను అఫ్గానిస్థాన్ వణికించాయి. భారత్‌ను అమెరికా, పాకిస్థాన్‌ను నెదర్లాండ్స్ భయపెట్టాయి. మిగతా చిన్న జట్లూ సత్తా చాటాయి. కానీ వాటిలో ఏ జట్టూ గెలుపు తీరాన్ని మాత్రం చేరలేకపోయింది.
- మనోడు దంచేశాడు తెలుగు కుర్రాడు సాయితేజ ముక్కమల్ల (79; 51 బంతుల్లో 5×4, 4×6) సత్తా చాటాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టింది.
- అమెరికా క్రికెట్లో తెలుగుతేజం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేసే తెలుగు వాళ్లు లక్షల్లో ఉంటారు. ఇంకా అక్కడ డాక్టర్లు, వ్యాపారవేత్తల్లోనూ ఎంతోమంది తెలుగువాళ్లున్నారు.
- లోటు డబ్బుకే.. ఆటకు కాదు అంతర్జాతీయ క్రికెట్ ఆడి పేరు సంపాదిస్తే.. కోట్లల్లో డబ్బొస్తుంది. కోట్లాది అభిమానుల ఆదరణా దక్కుతుంది. జీవితానికి ఏ లోటూ ఉండదు. భారత్ సహా చాలా క్రికెట్ దేశాల ఆటగాళ్ల విషయంలో ఇది నిజమే.
- కెనడాకు యూఏఈ పంచ్ టీ20 ప్రపంచకప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బోణీ కొట్టింది. ఉత్కంఠభరిత పోరులో కెనడాకు షాకిచ్చి తొలి విజయం నమోదు చేసింది.
- ముకేశ్‌కు రజతం ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు ముకేశ్ నేలవల్లి సత్తాచాటాడు. టోర్నీ చివరి రోజు శుక్రవారం 25 మీటర్ల పిస్టల్ జూనియర్ల విభాగంలో 582 పాయింట్లతో రజతం సాధించాడు.
- భారత్‌కు రజతం ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియనషిప్ వీల్‌చైర్ విభాగంలో భారత్ తొలిసారి రజతం నెగ్గింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో అల్ఫియా జేమ్స్, ప్రేమ్ కుమార్ జోడీ 6-21, 4-21తో క్యుజిమొ, యుటాంగ్ (చైనా) జంట చేతిలో ఓడింది.