నీలోని నువ్వు

Eenadu icon
By Editorial Team Published : 09 Jan 2026 04:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ప్రతి మనిషిలోనూ సాధారణంగా రెండు కోణాలుంటాయి. పైకి కనిపించే ప్రవర్తన, మనసు పొరల్లో దాగి ఉన్న లోలోపలి చింతన. లోపలి మనిషి ఎప్పుడూ మంచీ చెడుల విచారణ చేస్తూ హెచ్చరిస్తుంటాడు. దాన్ని గుర్తించకుండా బహిరంగ ప్రవర్తన సాగుతుంటుంది.

ఏ పనిచేస్తున్నా దానిమీదే ధ్యాస ఉంచి శ్రద్ధగా, నైపుణ్యంతో చేస్తేనే ఫలితం ఉన్నతంగా వస్తుంది. చేస్తున్న పని పట్ల విముఖత మంచిది కాదు. ఇష్టంగా కాకుండా కష్టంగా, యాంత్రికంగా చేసే ఏ పనీ ఎక్కువ ఫలితాన్నివ్వదు. ప్రతి మనిషిని ‘నేను’ అనే భావం నడిపిస్తుంది. శాసిస్తుంది. నాలుగు అంతఃకరణాలు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిసి ‘నేను’గా ఏర్పడతాయి. అది అహంభావం, అసూయగా మారితే మనిషి పతనానికి కారణమవుతుంది. ‘నేను’ అనే భావం పదునైన కత్తి వంటిది. కత్తిని అవసరమైన పనులకు ఉపయోగించవచ్చు, ఇతరులకు హాని కలిగించే పనులకూ వాడవచ్చు. అదొక పనిముట్టు. దాంతో చేసిన పనులకు ఫలితం మాత్రం మనకే లభిస్తుంది. ఒక వ్యక్తి తన క్రూరమైన సహజ స్వభావాన్ని అణచిపెట్టి తపస్సు చేయసాగాడు. అతడికి భగవంతుడు ప్రత్యక్షమైతే ఎటువంటి వరాలు అడుగుతాడోనని భయపడి ఇంద్రుడు తపస్సు విఘ్నం చేయడానికి ఒక ఎత్తు వేశాడు. ఒక కత్తిని తెచ్చి అతడికిచ్చి తాను తిరిగొచ్చేవరకు దాన్ని కాపాడమని కోరాడు. ఆ వ్యక్తి కత్తిని ఎప్పుడూ తన వెంట ఉంచుకుని తన పనులకు ఉపయోగించుకునేవాడు. క్రమంగా ఆయుధ ప్రయోగానికి అలవాటుపడి సహజ స్వభావంతో పతనం చెందాడు.

‘నేను’ అనే అహంకారం ఒక్కోసారి మనిషిని లొంగదీసుకుంటుంది. విద్య, వృత్తి, ఇతర రంగాల్లో వేరొకరు తనకు సాటిరాకూడదనే ఈర్ష్య అసూయలను ప్రేరేపిస్తుంది. కర్ణుడు విలువిద్యలో గొప్ప ప్రజ్ఞాశాలి. ద్రోణాచార్యుడి ప్రియశిష్యుడిగా అర్జునుడు తనకన్నా ప్రావీణ్యం సంపాదిస్తున్నాడని తెలుసుకున్నాడు. తాను అంతకన్నా ఎక్కువ అస్త్రాలు సాధించాలని పరశురాముణ్ని ఆశ్రయించాడు. అబద్ధం చెప్పి శిష్యుడిగా చేరాడు. ఎన్నో అస్త్ర శస్త్ర ప్రయోగాలు నేర్చుకున్నాడు. ఒకరోజు గురువు శిష్యుడి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. ఒక విషపు పురుగు తన తొడను తొలుస్తున్నా గురువుకు నిద్రాభంగం కలగకుండా ఓర్చుకున్నాడు కర్ణుడు. పరశురాముడు మేల్కొని జరిగింది తెలుసుకున్నాడు. కర్ణుడు తనతో అబద్ధం చెప్పి, మోసంతో విద్య నేర్చుకోవడం భరించలేక శపించాడు. కారణాలు ఏవైనా అంతరాత్మను చంపుకొని ఏదోవిధంగా ప్రయోజనం పొందాలని చూస్తే మనకు మనం నష్టం చేసుకున్నట్లే అవుతుంది. అద్దంలో శరీర ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది, లోపలి మనోబింబం చూడగలిగితే దాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలం. 

మనిషి అంతరిక్షంలోని సుదూర గ్రహాలకు చేరుకుంటున్నాడు కానీ తనలోనే ఉన్న లోపలి మనిషిని చేరుకోలేక పోతున్నాడు. ‘నీలో ఉన్న నువ్వు’ ఎవరో తెలుసుకుంటే ‘నేనెవరిని’ అనే ప్రశ్న ఎప్పటికీ రాదు. 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
  • దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్‌/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
  • శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
  • తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
  • మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
  • మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
  • అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
  • సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
  • దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
  • ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
  • అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
  • పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.
  • భక్తి - ధర్మం భక్తిభావం, ధర్మగుణం కలిగినవారే మనకు మార్గదర్శకులు, పురాణపురుషులు అయ్యారు. భక్తి వేరు, ధర్మగుణం వేరు. ధర్మగుణంలేని భక్తి శోభించదు, జయించదు.
  • గురుబ్రహ్మ... భౌతిక ప్రపంచంలో వినోద, విహారాలతో సంతృప్తి చెందుతున్నంతవరకు ఆధ్యాత్మిక లోకంలో విహరించాలనే ఆలోచన రాదు. ప్రాపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారితెన్నులు తెలియని వారికి భగవత్సన్నిధికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు. 
  • సృష్టికి మార్గదర్శకుడు సృష్టి... యాదృచ్ఛికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, నియమం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి, జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు.
  • జ్ఞానాయుధం జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగులను ప్రకాశింపజేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే ఙ్ఞానం... అంటాడు దక్షిణామూర్తి.
  • ఏది హింస? ‘అహింసా పరమోధర్మః’ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మమని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపడమో అని మాత్రమే అర్థంకాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురిచేసినా అది హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసి వేయవచ్చు, ఆ గాయాలు మందులతో కొంత కాలానికి మానతాయి.
  • సహనం ఒక వరం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే- సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని; పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం అది.
  • కాలం విలువ కాలం ప్రతీ క్షణం ఓ ఇంద్రజాలం. కళ్లముందే మాయమైపోతుంటుంది మరి. కదిలే కాలం అనుకోని విజయాలను, వైభవాలను ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఓటమినీ చవిచూపిస్తుంది.
  • దర్శనకళ ‘దర్శనం’ అనేది చాలా విలువైన పదం. విరివిగా ఉపయోగిస్తూనే ఉన్నా, అంతరార్థం చాలామందికి బోధపడని పదమది. ఉదాహరణకు ‘మీరు దేవుణ్ని చూశారా’ అనే ప్రశ్న ఎదురైతే, మనలో చాలామందిమి బిత్తరపోతాం. ఏం చెప్పాలో తెలియక తికమక పడతాం.