కొండంత అండగా కల్యాణ లక్ష్మి పథకం: కడియం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ధర్మసాగర్: నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు సూపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం ధర్మసాగర్, వేలేరు మండల కేంద్రాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన సర్పంచుల నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి పథకం కొంత ఆర్థిక వెసులుబాటును కల్పిస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు, మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు సదానందం, కోమి, ఎంపీడీవోలు అనిల్ కుమార్, లక్ష్మీప్రసన్న, నూతన సర్పంచులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
► Read latest Warangal Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జనగామ, తొర్రూర్‌లో లాటరీ.. కాంగ్రెస్‌నే వరించిన అదృష్టం [ 17-02-2026] ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ మధ్య జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ (Congress) పార్టీ దక్కించుకుంది.
- జనగామలో భారీ బందోబస్తు [ 17-02-2026] జనగామ మున్సిపాలిటీలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉద్రిక్త పరిస్థితుల నడుమ సోమవారం వాయిదా పడింది.
- తొమ్మిది.. హస్తగతం [ 17-02-2026] ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 పురపాలకాల్లో తొమ్మిదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకొంది. మహబూబాబాద్‌లో మిత్రపక్షమైన సీపీఎం సభ్యుడికి, వర్ధన్నపేటలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి మద్దతు తెలిపిన మహిళా సభ్యురాలికి వైస్ ఛైర్మన్ పదవులిచ్చారు. మహబూబాబాద్ ఛైర్మన్ పీఠం ఎస్టీ జనరల్ అయినా మహిళకు అవకాశం ఇచ్చారు.
- పోరు ఆగలే! [ 17-02-2026] ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 పురపాలకాల్లో సోమవారం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. తొమ్మిది మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరగా.. మూడు చోట్ల మంగళవారానికి వాయిదా పడ్డాయి.
- ఉచిత బియ్యం.. కాసుల బేరం [ 17-02-2026] ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందాతో దళారులు రూ.కోట్ల దండుకుంటున్నారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని కొంత మంది డీలర్లే డబ్బులిచ్చి బియ్యం కొంటూ వ్యాపారులకు పెద్దమొత్తంలో అమ్ముతున్నారు.
- వీడని పీఠ‘ముడి’ [ 17-02-2026] జనగామ పురపీఠ ముడి మరింత బిగుసుకుంది. కాంగ్రెస్, భారాసలకు స్పష్టమైన ఆధిక్యం లభించకపోవడంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 28వ వార్డు భారాస సభ్యురాలు హఫీజ్ ఫాతిమా,
- చేజిక్కిన వర్ధన్నపేట పురపాలిక! [ 17-02-2026] ఉత్కంఠకు తెర పడింది.. పురపాలిక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అనేక మలుపులు తిరిగిన వర్ధన్నపేట పుర రాజకీయం.. సోమవారం ఛైర్మన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికతో కొలిక్కి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి ఆదివారం హస్తం గూటికి చేరగా..
- జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ [ 17-02-2026] దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఓరుగల్లు విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. హనుమకొండ తహసీల్దార్ గుజ్జుల రవీందర్‌రెడ్డి-సునీత దంపతుల కుమారుడు...
- బీఫాం లేదని బయటికి.. [ 17-02-2026] మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ నుంచి భారాస, భాజపా కౌన్సిలర్లు నిష్క్రమించడం చర్చనీయాంశమైంది. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో వెంకటేశ్ ఆధ్వర్యంలో ప్రక్రియ నిర్వహించారు.
- తొర్రూరు రణరంగం..! [ 17-02-2026] భారాస...కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడులతో తొర్రూరులో ఉద్రిక్తత నెలకొంది. పుర అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక కోసం మున్సిపాల్టీలో నిర్వహించిన సమావేశం రసాభాసాగా మారింది.
- కేసముద్రం కాంగ్రెస్ కైవసం [ 17-02-2026] కేసముద్రం మున్సిపాలిటీ తొలిసారి కాంగ్రెస్ కైవసం చేసుకొంది. ఎక్స్‌అఫీషియో సభ్యుడి ఓటుతో ఈ స్థానాల కాంగ్రెస్ చేతికి చిక్కడంతో ఉత్కంఠకు తెరపడింది. పురపాలక అధ్యక్ష పదవి బానోత్ సునీత, ఉపాధ్యక్షురాలిగా రమ ఎన్నికయ్యారు.
- కేయూ మెస్‌లో వంట తంటాలు! [ 17-02-2026] కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ విద్యార్థులకు భోజన ఇబ్బందులు తప్పడం లేదు. కామన్ మెస్‌లో వంట సిబ్బంది లేకపోవడంతో సోమవారం ఉదయం విద్యార్థులే స్వయంగా చపాతీలు చేసుకొని తిన్నారు.