Student Missing: టూర్‌కు వెళ్లి.. అమెరికాలో అద్దంకి విద్యార్థి అదృశ్యం!

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 09 Jan 2026 14:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అద్దంకి: అమెరికాలో టూర్‌కు వెళ్లిన తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

హ్యూస్టన్‌లో నివసిస్తున్న హరి.. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌ 22న పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లాడు. అక్కడ డెనాలి సమీపంలోని ఓ హోటల్‌లో బస చేసి, జనవరి 3-4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్‌మేట్స్‌కు సమాచారం ఇచ్చాడు. డిసెంబర్‌ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడాడు. 31న హోటల్‌ నుంచి బయటకు వెళ్లాడు.

అనంతరం ఓ క్యాబ్‌ సర్వీస్‌ వాడినట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి హరి ఫోన్‌ స్విచాఫ్‌ వస్తోంది. హోటల్‌ నుంచి బయల్దేరిన తను.. ఆ క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లారు? డ్రైవర్‌ ఎవరు? అనే కోణంలో అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు.

► Read latest Prakasam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 12:14 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పల్లె పోరుకు కసరత్తు! [ 18-02-2026] పల్లె పోరు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో ఆ దిశగా జిల్లా పంచాయతీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
  • ఖనిజాన్వేషణ! [ 18-02-2026] ఉమ్మడి ప్రకాశం జిల్లా లింగసముద్రం, వలేటివారిపాలెం ప్రాంతాల్లోని భూముల్లో ఇనుప ఖనిజం ఉండడంతో ఖనిజాన్వేషణ సాగిస్తున్నారు. ఖనిజం వెలికితీసేందుకు జిందాల్‌ సంస్థ ఆసక్తి చూపడంతో ప్రభుత్వం అనుమతుల విషయమై చురుగ్గా వ్యవహరిస్తోంది.
  • ‘బాలుడి మృతిపై దర్యాప్తు వేగవంతం’ [ 18-02-2026] విద్యార్థి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేసి కారకులపై చట్టపరమైన చర్యలు చేపడతామని కందుకూరు సీఐ అన్వర్‌బాషా తెలిపారు.
  • బత్తాయి రైతు బతికేదెట్టా? [ 18-02-2026] జిల్లాలోని బత్తాయి రైతులు కష్టనష్టాలకు గురవుతున్నారు. పంట దిగుబడులను భద్రపరచుకునేందుకు మార్కెట్‌ సౌకర్యం కలగా మిగిలిపోవడంతో పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది.
  • ఒంగోలు రైలు నిలయంలో సమస్యల కూత! [ 18-02-2026] ఒంగోలు రైలునిలయంలో తిరుపతి, చెన్నై వైపు వెళ్లే రైలు ఎక్కాలంటే కష్టాలు తప్పడం లేదు. మూడో నంబరుకు రావాల్సిన రైలు అయిదో నంబరుకు వస్తుందని చివర్లో ప్రకటన చేస్తుండడంతో ప్రయాణికులు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
  • పెళ్లి బాజాలు మోగనున్నాయ్‌! [ 18-02-2026] ఈ నెల 19వ తేదీ నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి. మొత్తం 53 శుభగడియలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26, మార్చి 1, 3, 4, 7, 8, 9, 11, 12, ఏప్రిల్‌ 15, 20, 21, 25, 26, 27, 28, 29, మే 1, 3, 5, 6, 7, 8, 13, 14, జూన్‌ 21, 22, 23, 24, 25, 26, 27, 29, జులై 1, 6, 7, 11, నవంబరు: 21, 24, 25, 26, డిసెంబరు 2, 3, 4, 5, 6, 11, 12వ తేదీల్లో శుభ మహూర్తాలున్నాయి.
  • రంజాన్‌ మాసం.. సద్గుణాల ధామం [ 18-02-2026] ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ నెల వచ్చేసింది. హృదయాలలో పవిత్రతను, ఆధ్యాత్మిక భావనను నింపే మాసంగా ఈ నెలను భావిస్తారు. శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడం ఈ మాసం ప్రత్యేకత.
  • పచ్చాకు ట్రాక్టర్‌ బోల్తా.. కూలీ మృతి [ 18-02-2026] ఒంగోలు-చీరాల రహదారిలో త్రోవగుంట సమీపంలోని భారత్‌ పెట్రోలియం బంకు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా కూలీ దుర్మరణం పాలయ్యారు.
  • కడతేరిపోయావా కన్నా..! [ 18-02-2026] తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఆ పసివాడిని బలితీసుకుంది..పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డను పొలం గట్టుపై వదిలేయడంతో..అక్కడున్న విష ద్రావణం తాగిన అతను చికిత్స పొందుతూ కడతేరిపోయాడు.