Seshadri Express: అమ్మో.. శేషాద్రి ఎక్స్‌ప్రెస్సా..!

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Published : 09 Jan 2026 05:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, చిత్తూరు : సంక్రాంతి పండగ మరికొన్ని రోజులు ఉండగానే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగులు, బంధువులు, వివిధ పనుల నిమిత్తం ముందుగానే ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, కాకినాడ తదితర ప్రాంతాలకు బెంగళూరు నుంచి చిత్తూరు మీదుగా శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ నిత్యం రాకపోకలు సాగిస్తుంది. గత మూడ్రోజులుగా ఈ రైలు కిక్కిరిసి వెళ్తోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. సంక్రాంతికి తమ ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో బోగీలు కిక్కిరిశాయి. ఇక జనరల్‌ బోగీ ముందు ఒకటి.. వెనక ఒకటి మాత్రమే ఉండటంతో రెండు బోగీల్లోనూ కనీసం కాలు మోపేందుకు స్థలం లేక ఇరుక్కుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు మరుగుదొడ్ల వద్ద దుర్వాసన వస్తున్నా భరిస్తూ మాస్కులు వేసుకుని నిల్చున్నారు. చిత్తూరు స్టేషన్‌లో కొందరు కిందకు దిగుతుండగా మరికొందరు తోసుకుంటూ ఎక్కేశారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు కొందరికి ఎక్కే అవకాశం లేక రిజర్వేషన్‌ బోగీల వద్దకు పరుగులు తీసుకుంటు వెళ్లి ఎక్కారు.

► Read latest Chittoor Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • భూతల కైలాసంలో.. భవుని కల్యాణం [ 18-02-2026] బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం భక్తపరాదీనుడి కల్యాణమే. అన్నీ ఆలయాల్లో ఈ వేడుకలను ఆలయ ఆవరణలో నిర్వహిస్తారు. భక్తుల పాలిట భూతల కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో మాత్రం అందుకు భిన్నంగా అమావాస్య.. అర్ధరాత్రి.. నడివీధిలో భక్తుందరి మధ్యలో ఆయన వివాహం చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
  • ఆదుకొనే నేస్తమా.. బడి పిలుస్తోంది [ 18-02-2026] ప్రభుత్వ పాఠశాలలకు ఎన్ని నిధులు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం తీరడం లేదు. బడి బాగు కోసం.. పిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘విద్యాంజలి’ పోర్టల్‌లో ఉపాధ్యాయులు పెడుతున్న అభ్యర్థనలు చూస్తే గుండె బరువెక్కుతోంది. తిరుపతి జిల్లా నుంచి నమోదైన కొన్ని అభ్యర్థనలే ఇందుకు నిదర్శనం.
  • భక్తులకు అమావాస్య కష్టాలు [ 18-02-2026] రాహు, కేతు సర్పదోష నివారణ పూజల కోసం ముక్కంటి ఆలయానికి వచ్చే భక్తులు అవస్థలు పడాల్సి వచ్చింది. అమావాస్య, మంగళవారం కలసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
  • నాలుగేళ్లుగా అవస్థల పాఠమే [ 18-02-2026] నాటి వైకాపా పాలకులు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని గొప్పలు చెప్పి చివరకు విద్యార్థులను అసౌకర్యాల ఊబిలోకి నెట్టారు. పాఠశాలల్లో సౌకర్యాల కల్పన పేరుతో అదనపు గదుల నిర్మాణం చేపట్టి పనులు పూర్తి చేయకుండానే చేతులెత్తేశారు.
  • ఇద్దరు గంధపు చెట్ల స్మగ్లర్ల అరెస్ట్‌ [ 18-02-2026] తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో గంధపు చెట్లు కొడుతున్న ఇద్దరు స్మగ్లర్లను తిరుమల రేంజ్‌ అటవీ అధికారులు అరెస్ట్‌ చేశారు. డీఎఫ్‌వో స్వప్నకుమారి కథనం మేరకు.. సోమవారం డీఎఫ్‌వోకు అందిన సమాచారంతో తిరుమల బీటు అధికారి, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టగా సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పాత పాపవినాశనం వద్ద గంధపు చెట్టు కోస్తున్న ఇద్దరిని గుర్తించారు.
  • జూన్‌ నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో తరగతులు [ 18-02-2026] చిత్తూరు, కుప్పంలోని కేంద్రీయ విద్యాలయాల్లో జూన్‌ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
  • ఎదురింట్లోనే మృగాడు! [ 18-02-2026] మానవీయ విలువలకే సమాధి కట్టే.. మనుషులమన్న విషయానికే అనుమానమొచ్చే దుర్ఘటన మంగళవారం మదనపల్లె జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృగాడి వాంఛాగ్నిలో ఓ లేత కలువ కాలిపోయింది.