Bangladesh cricketers: వాళ్లు అన్నంత పనీ చేస్తారేమో..: బంగ్లా ఆటగాళ్లలో గుబులు!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ బంగ్లా క్రికెటర్ల స్పాన్సర్‌షిప్‌లకు ఎసరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి! బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్, యాసిర్ అలీ, మోమినుల్ హక్ వంటి టాప్ ప్లేయర్లకు భారత సంస్థ ఎస్‌జీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ సంస్థ తమ స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ పరిణామాలపై బంగ్లా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘త్వరలోనే ఎస్‌జీ స్పాన్సర్‌గా వైదొలగొచ్చు’ అని ఓ క్రికెటర్ ఓ వెబ్‌సైట్‌తో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘ఒకవేళ ఎస్‌జీ అలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఇతర సంస్థలు సైతం అదే మార్గంలో నడవొచ్చు’ అని అతడు అభిప్రాయపడ్డట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
- తమీమ్ ఇక్బాల్ ‘ఇండియన్ ఏజెంట్’: బీసీబీ సభ్యుడి సంచలన ఆరోపణలు
బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ ( IPL) మినీ వేలంలో కేకేఆర్ ( Kolkata Knight Riders) రూ.9.20 కోట్లకు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అతడిని రిలీజ్ చేయాలని బీసీసీఐ ( BCCI).. కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ ఫ్రాంఛైజీ ముస్తాఫిజుర్‌ను విడుదల చేసింది. ఈ సంఘటన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే భద్రత కారణాల దృష్ట్యా తమ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ ( ICC Mens T20 World Cup) 2026 భారత్‌లో ఆడబోదని బీసీబీ.. ఐసీసీకి ( ICC) లేఖ రాసింది. తమ మ్యాచ్‌లను మరోచోట నిర్వహించాలని అందులో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఐసీసీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్పిన్‌దళం.. పాక్‌లో ఆ ‘ఐదుగురు’.. మరి భారత్‌కు ఎవరు? ప్రేమదాస స్టేడియంలో పేస్‌తోపాటు స్పిన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో భారత్, పాకిస్థాన్ జట్లు నాణ్యమైన స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నాయి.
- కివీస్‌తో మ్యాచ్.. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 176 పరుగులు టీ20 ప్రపంచ కప్‌లో మరో ఆసక్తికరమైన పోరు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడుతున్నాయి.
- అభిషేక్ శర్మ ఆడతాడు.. ఆ నిర్ణయం మా చేతుల్లో ఉండదు: సూర్యకుమార్ పాక్ బౌలర్ తారిక్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
- ఆదుకొన్న బాంటన్.. స్కాట్లాండ్‌పై ఇంగ్లాండ్ విజయం స్వల్ప లక్ష్య ఛేదనలో కాస్త తడబాటుకు గురైనప్పటికీ ఇంగ్లాండ్ ఆఖరికి విజయం సాధించింది.
- తారిక్ ‘యాక్షన్’కు.. భారత్ ‘రియాక్షన్’ ఎలా ఉంటుందో? ఆదివారం భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్. అయితే, పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌పైనే ఇప్పుడందరి దృష్టి ఉంది.
- స్కాట్లాండ్‌తో మ్యాచ్.. ఇంగ్లాండ్ లక్ష్యం 153 పరుగులు టీ20 ప్రపంచ కప్‌లో కోల్‌కతా వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు స్కాట్లాండ్ 153 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.
- అప్పట్లో ధోని కెప్టెన్సీ ఎందుకు వీడాడంటే..: జతిన్ పరాంజ్‌పే రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) 2025లో కెప్టెన్సీ మార్పు జరిగింది. ఇది భారత క్రికెట్‌లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
- అవును..భారత్‌పై మాకు మంచి రికార్డ్ లేదని అంగీకరిస్తాం: పాక్ ఫిబ్రవరి 15న భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్. ఇప్పటికే ఇరు జట్లూ అందుకోసం సిద్ధంగా ఉన్నాయి.
- వర్షం వల్ల ఇండియా పాక్ మ్యాచ్ రద్దైతే..? పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాక్.. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఈ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- ఒమన్ చిత్తు.. 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం కొలంబో వేదికగా ఒమన్‌తో టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.
- భారీ స్కోర్ బాదిన ఐర్లాండ్.. ఒమన్ లక్ష్యం 236 పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. కొలంబో వేదికగా ఒమన్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఒమన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.
- బాబూ.. మీరూ ‘బాధ్యత’ తీసుకోవాలి! టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అసలైన కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న తలపడనుంది.
- కొలంబోలో హోటల్ లాబీలో గర్ల్‌ఫ్రెండ్‌తో దర్శనమిచ్చిన హార్దిక్ పాండ్య పాకిస్థాన్‌తో మ్యాచ్ వేళ టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబసభ్యులతో ఉండటానికి వీల్లేదు. అయితే హార్దిక్ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మతో కొలంబోలోని హోటల్ లాబీలో కనిపించాడు.
- టీమ్‌ఇండియాకు ఆ సత్తా ఉంది: హర్భజన్ సింగ్ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో భారత్ విజయ కేతనం ఎగుర వేస్తుందని టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ అన్నాడు.
- పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ Vaibhav Suryavanshi: అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
- మళ్లీ ‘శివరాత్రి’ మ్యాచ్.. ఫ్యాన్స్‌లో హైవోల్టేజ్ సచిన్‌ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఇన్నింగ్స్‌ల్లో ‘శివరాత్రి’ మ్యాచ్ ఒకటి. ఇది యూఏఈలో ఆసీస్‌పై ‘డిజర్ట్ స్ట్రామ్’ ఇన్నింగ్స్‌తో పోటీపడుతూ మాస్టర్ బ్లాస్టర్ కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలిచింది.
- జింబాబోయ్ ఇంగ్లాండ్‌ను నేపాల్, దక్షిణాఫ్రికాను అఫ్గానిస్థాన్ వణికించాయి. భారత్‌ను అమెరికా, పాకిస్థాన్‌ను నెదర్లాండ్స్ భయపెట్టాయి. మిగతా చిన్న జట్లూ సత్తా చాటాయి. కానీ వాటిలో ఏ జట్టూ గెలుపు తీరాన్ని మాత్రం చేరలేకపోయింది.
- మనోడు దంచేశాడు తెలుగు కుర్రాడు సాయితేజ ముక్కమల్ల (79; 51 బంతుల్లో 5×4, 4×6) సత్తా చాటాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టింది.
- అమెరికా క్రికెట్లో తెలుగుతేజం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేసే తెలుగు వాళ్లు లక్షల్లో ఉంటారు. ఇంకా అక్కడ డాక్టర్లు, వ్యాపారవేత్తల్లోనూ ఎంతోమంది తెలుగువాళ్లున్నారు.
- లోటు డబ్బుకే.. ఆటకు కాదు అంతర్జాతీయ క్రికెట్ ఆడి పేరు సంపాదిస్తే.. కోట్లల్లో డబ్బొస్తుంది. కోట్లాది అభిమానుల ఆదరణా దక్కుతుంది. జీవితానికి ఏ లోటూ ఉండదు. భారత్ సహా చాలా క్రికెట్ దేశాల ఆటగాళ్ల విషయంలో ఇది నిజమే.