Chandrababu: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం.: సీఎం చంద్రబాబు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

రాయవరం: కరోనా సమయంలోనూ రైతులు పనిచేసి అందరికీ అన్నం పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu) అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతుల భూమి పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు వేశారో అర్థం కాలేదన్నారు. గత ప్రభుత్వ నేతలవి ప్రమాదకరమైన ఆలోచనలని.. ‘మీ భూమి - మీ హక్కు’ అని ఎన్నికల ప్రచారంలోనే తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్‌బుక్‌లు ఇస్తామని హామీ ఇచ్చామని, దాన్ని ఇప్పుడు నెరవేర్చామని తెలిపారు.
‘‘గ్రామసభలు ఏర్పాటు చేసి రైతులకు ఈనెల 11 వరకు పాస్‌బుక్‌లు ఇస్తున్నాం. ఒక్క రూపాయి అవినీతి లేకుండా చూడాలని అధికారులకు చెప్పా. ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, మిగతా సిబ్బంది మనసుపెట్టి పనిచేయాలి. వచ్చే నెలలో మళ్లీ సర్వే చేసి పాస్‌బుక్‌లు ఇస్తాం. ఒక్కసారి ప్రింట్ అయ్యాయంటే ఇక జీరో మిస్టేక్స్ ఉండాలి. భూమికి సంబంధించి 29 అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. అన్నింటినీ పరిష్కరిస్తున్నాం. 22-ఏ భూములపై వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. రైతుల భూరికార్డులన్నీ బ్లాక్‌చైన్‌లో భద్రంగా ఉంటాయి. ఎవరైనా భూకబ్జా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటాం. చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నా. కుటుంబసభ్యులు, బంధువులతో వివాదాలు వద్దు. గొడవలు పడి కోర్టులకు వెళ్తే జీవితకాలం వృథా అవుతుంది’’అని సీఎం చంద్రబాబు తెలిపారు.
‘‘నరకాసురిడి పాలన మళ్లీ రాకూడదని మనం కోరుకోవాలి. గోదావరి పుష్కరాలు వచ్చే మూడు సార్లూ నేనే సీఎంగా ఉండటం నా అదృష్టం. సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వాడుకుంటే కరవే ఉండదు. పోలవరం పూర్తయితే ఈ ప్రాంతానికి నీటి సమస్యే ఉండదు. పోలవరం నుంచి విశాఖకు అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవు. మనవద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చు. శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేసి రాయలసీమకు తరలిస్తాం’’ అని సీఎం తెలిపారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 15:29 IST