గగనంలో తేలిపో.. భోగాపురంలో వాలిపో..

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, విజయనగరం: తొలి విమానం రన్‌వేపైకి రయ్‌మంటూ రానుంది. ఇది అడుగుపెట్టిన ఆరు నెలల్లో ప్రయాణికుల కోసం లోహ విహంగాలు రెక్కలు కట్టుకుని వాలనున్నాయి. కూటమి ప్రభుత్వ కృషితో నిర్దేశిత గడువుకన్నా ముందే భోగాపురం నుంచి విమానయానం అందుబాటులోకి రానుంది. నేడు ట్రయల్ రన్‌కు సర్వం సిద్ధమైంది
- ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర ప్రగతికి మరో మణిహారం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇప్పటికే రన్‌వే, ఏటీసీ, టెర్మినల్ బిల్డింగ్ సహా ఈ ప్రాజెక్ట్ 95 శాతం నిర్మాణం పూర్తయింది. మట్టి పనులు శత శాతం పూర్తవ్వగా.. సుందరీకరణ పనులతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆరు నెలల్లో వైమానిక కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ట్రయల్ రన్‌గా తొలి విమానం(ఎయిర్ ఇండియా బోయింగ్) నూతన రన్‌వేపై ఆదివారం దిగనుంది. దీంతో విమానాశ్రయం ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది.

- ఉమ్మడి విజయనగరం జిల్లా బాడంగిలో చిన్న విమానాశ్రయాన్ని(ఎయిర్ స్ట్రిప్) నిర్మించి బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అధికారులు వినియోగించారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో రక్షణ అవసరాలకు ఇది ఉపయుక్తంగా ఉండేది. జిల్లాలో లోహ విహంగాలు దిగడం ఇప్పటి తరం చూడలేదు. రాబోయే ఆరు నెలల్లో నిత్యం విమానాలు తిరగనున్నాయి.
- అందుబాటులోకి అనుబంధ విభాగాలు: ఎయిర్ స్పేస్, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ జోన్లు, ఎయిర్ సిటీ, విడి భాగాల తయారీ పరిశ్రమలు, ఆరోగ్య, ఆతిథ్య రంగాల అభివృద్ధి
- భూముల కేటాయింపు: 2,708.26 ఎకరాలు
- అంచనా వ్యయం: తొలిదశలో రూ.4,750 కోట్లు
కలిసిపోనున్న రెండు నగరాలు
ఇప్పటికే దాదాపు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కలిసిపోయాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తర్వాత ఇవి జంట నగరాలుగా అవతరించనున్నాయి. భోగాపురం రెండు నగరాలకు దాదాపు సమాన దూరంలో ఉండటంతో వీటి మధ్య అంతరం తొలగనుంది. విమానాశ్రయం అనుసంధానం చేయనుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో వచ్చే పదేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ముఖ్యంగా విజయనగరం జిల్లా ముఖచిత్రం మారనుంది. భోగాపురానికి నలువైపులా రహదారులు విస్తరించనున్నాయి.
వీరికి ఉపయుక్తం.
- విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లావాసులకు విమానయాన సేవలు మరింత చేరువ కానున్నాయి.
- ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావాసులకూ ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉపయుక్తం కానుంది.
- దక్షిణ ఒడిశాలోని కొరాపుట్, గంజాం, మల్కాన్‌గిరి, గజపతి, రాయగడ, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ ప్రాంత ప్రజల వినియోగానికి ఇది అందుబాటులో ఉంటుంది.

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అక్రమాల లెక్క రూ.1.31కోట్లు [ 18-02-2026] గరుగుబిల్లి ప్రాథమిక వ్యవసాయ సంఘం(పీఏసీఎస్)లో ఆర్థికపరమైన అక్రమాలు జరిగాయి. గతేడాది ఆగస్టు నుంచి ఈ సొసైటీలో జరిగిన అక్రమాలపై సహకార శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.
- మార్చి 9న ఓటరు జాబితా ప్రదర్శన [ 18-02-2026] స్థానిక సంస్థల పదవీకాలం ముగుస్తుండడంతో ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించే క్రతువుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది.
- మంచంపై తండ్రి.. ఆసుపత్రిలో కుమారుడు [ 18-02-2026] కిరాణా దుకాణం నడిపి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తండ్రి తీవ్ర అనారోగ్యం పాలై మంచానికి పరిమితమయ్యాడు. నేనున్నా నాన్న.. మీకేం కాదు.. కుటుంబానికి అండగా ఉంటా అని ధైర్యం చెప్పే కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్నాడు.
- పకోడి కోసం వెళ్తే.. [ 18-02-2026] రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన పల్ల వెంకటరమణరావు కుటుంబ అవసరాల కోసం రాజాం పట్టణంలోని ఒక బ్యాంకులో సోమవారం బంగారు నగలు కుదవ పెట్టి రూ.2.15 లక్షలు రుణం తీసుకున్నారు.
- అమెరికా అమ్మ ఇక లేరు [ 18-02-2026] దత్తిలో హోమ్స్ ఆఫ్ ది ఇండియన్ నేషన్(హొయినా) అనాథ ఆశ్రమ వ్యవస్థాపకురాలు, అమెరికాకు చెందిన చార్లెస్ డి లార్జ్(91) ఇకలేరు. అమెరికాలోని తన నివాసంలో సోమవారం మృతిచెందారని క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.గ్లోరీ జేన్స్, మేనేజర్ శ్రీనివాస్‌కుమార్ మంగళవారం తెలిపారు.
- మెరిశారు.. మురిశారు [ 18-02-2026] జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంచి పర్సంటైల్‌తో ప్రతిభ చూపారు.