అజ్ఞాతం వీడి.. జన జీవనంలోకి కదిలి

Eenadu icon
By Telangana Dist. Desk Published : 04 Jan 2026 06:57 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

చిన్నకొడుకును ఇక చూడలేనేమోనని ఇన్నాళ్లు మదనపడిన ఆ తల్లి హృదయం సేద తీరింది. తండ్రి చనిపోయినా.. పోలీసుల నిఘాతో రాలేకపోయాడనే బెంగ తీరిపోయింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి డీజీపీ ఎదుట లొంగిపోయిన సమాచారం తెలియడంతో కాల్వశ్రీరాంపూర్‌ మండలం కిష్టంపేటలోని ఆయన కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది.

కాల్వశ్రీరాంపూర్‌ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల బాల్‌రెడ్డి, వీరమ్మ దంపతుల చివరి సంతానం రాజిరెడ్డికి ముగ్గురు అన్నలు, ఇద్దరు అక్కలున్నారు. వీరిలో పెద్దన్న మల్లారెడ్డి చనిపోగా మరో ఇద్దరు సోదరులు గ్రామంలో వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. తల్లి వీరమ్మ ప్రస్తుతం కుమారులు, కూతుళ్ల వద్ద ఉంటుంది. కాల్వశ్రీరాంపూర్‌లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో రాజిరెడ్డి 1985లో పదో తరగతి పూర్తి చేశారు.

పార్టీతో ప్రయాణం ఇలా

  • పీపుల్స్‌వార్‌ సిద్ధాంతాలు, జననాట్య మండలి పాటలకు ఆకర్షితుడైన రాజిరెడ్డి 1992 నుంచి 1994 వరకు మిలిటెంట్‌గా పనిచేశారు. పోలీసుల నిర్బంధం పెరగడంతో 1995లో పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
  • 1996 నుంచి 2001 వరకు పెద్దపల్లి, జమ్మికుంట, కాల్వశ్రీరాంపూర్‌ ఏరియా కమిటీ సభ్యుడిగా పని చేశారు. 2002-03 వరకు పెద్దపల్లి ఏరియా కార్యదర్శిగా 2004-06 వరకు మంథని ఏరియా కార్యదర్శిగా పని చేశారు. 2006లో జిల్లా కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఏటూరునాగారం, మహదేవ్‌పూర్‌ ఏరియా కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు.
  • 2021 నుంచి జేఎంఎండబ్ల్యూపీ (జయశంకర్, మహబూబాబాద్, ములుగు, వరంగల్, పెద్దపల్లి) ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అరిలోవా ప్రాంతానికి చెందిన అడ్లూరి ఈశ్వరి అలియాస్‌ రాంకోను వివాహం చేసుకున్నారు.

వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నాను. ఇన్నాళ్లు బతికున్న నాకు చిన్న కుమారుడిని చూడనుండటం ఆనందంగా ఉంది.  - వీరమ్మ,రాజిరెడ్డి తల్లి

మిగిలింది ఒక్కరే..

మావోయిస్టు పార్టీలో పేరొందిన నేతలు లొంగిపోవడం, మరికొందరు ఎన్‌కౌంటర్‌లలో మృత్యువాత పడటంతో ఇన్నాళ్లు పెద్దపల్లి జిల్లా నుంచి ఇద్దరే మిగిలారు. అందులో తాజాగా కంకణాల రాజిరెడ్డి లొంగుబాటుతో మంథని మండలం శాస్త్రులపల్లికి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి మాత్రమే ఉన్నారు.

► Read latest Karimnagar Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన [ 17-02-2026] గోదావరి పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ముంగళ వారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
  • బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు [ 17-02-2026] మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
  • మద్యం మత్తులో కుమారుడిని హత్య చేసిన తండ్రి [ 17-02-2026] మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. 
  • వైభవంగా దుబ్బ రాజన్న ఆలయ రథోత్సవం [ 17-02-2026] జగిత్యాల జిల్లాలోని ప్రముఖ సేవ క్షేత్రమైన సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్‌లోని దుబ్బ రాజన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
  • ప్రమాణం చేస్తున్నాం.. ప్రగతి చూపుతాం [ 17-02-2026] కరీంనగర్‌ నగర పాలక సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్, జిల్లా ఎన్నికల పరిశీలకులు జితేందర్‌రెడ్డి, మనోహర్‌ సమక్షంలో పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
  • అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థికి పట్టం [ 17-02-2026] జమ్మికుంట పుర ఛైర్మన్‌గా అనూహ్యంగా భారాస రెబల్, స్వతంత్ర కౌన్సిలర్‌ మొలుగు ప్రశాంత్‌కుమార్‌ ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా భారాస కౌన్సిలర్‌ ముంతాజ్‌ అలీ ఏడీ మహ్మద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
  • పురం 10 చోట్ల ‘చేతి’ పరం [ 17-02-2026] పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో హస్తం హవా కనిపించింది. పది చోట్ల ఆ పార్టీకి చెందిన వారే ప్రథమ పౌరులుగా అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.
  • ఇద్దరు కార్పొరేటర్ల నుంచి మేయర్‌ దాకా.. [ 17-02-2026] కరీంనగర్‌లో కమలం వికసిస్తోంది. రెండు దశాబ్దాల కిందట కేవలం ఇద్దరు కార్పొరేటర్లున్న ఈ నగర పాలక సంస్థలో.. ఏకంగా మేయర్, డిప్యూటీ మేయర్‌ స్థానాల్లో కూర్చునే స్థాయికి ఎదిగింది.
  • ఉత్కంఠ నడుమ మెట్‌పల్లి ఎన్నిక [ 17-02-2026] మెట్‌పల్లి బల్దియా ఛైర్మన్‌ ఎవరవుతారోనని ఎదురుచూస్తున్న పట్టణ ప్రజలకు ఉత్కంఠ మధ్య కాంగ్రెస్‌ను వరించింది.
  • రాయికల్‌ భారాసదే [ 17-02-2026] రాయికల్‌ ఛైర్మన్‌ పీఠంపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. పట్టణంలో 12 వార్డులుండగా.. భాజపా-5, భారాస-3, కాంగ్రెస్‌-3, స్వంతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు.
  • ఆద్యంతం ఆసక్తికరం [ 17-02-2026] జగిత్యాల బల్దియా ఎన్నికలు రాష్ట్రస్థాయిలో ఆసక్తి రేపాయి. వర్గపోరు, బీ ఫారాల వివాదం గాంధీభవన్‌కు వెళ్లగా.. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి అంశం ప్రజాభవన్‌కు చేరిన విషయం తెలిసిందే.
  • అంజన్నను దర్శించుకున్న సినీ నటుడు [ 17-02-2026] ప్రముఖ సినీ నటుడు అర్జున్‌ సోమవారం కుటుంబంతో కలిసి కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
  • సుల్తానాబాద్‌లో నేడు ఎన్నిక! [ 17-02-2026] సుల్తానాబాద్‌ పురపాలిక ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నిక ప్రక్రియ సోమవారం వాయిదా పడింది. ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాకుండానే వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఆశించేవారి మధ్య పోటీ ఏర్పడటం కాంగ్రెస్‌ నాయకత్వానికి తలనొప్పిగా పరిణమించింది
  • మానేరు లూఠీ.. ఇసుక అక్రమ తరలింపులో పోటీ [ 17-02-2026] ఇసుక మాఫియా పెచ్చురిల్లుతోంది. అధికారుల కళ్లుగప్పి అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. మానేరు వాగు పరీవాహక గ్రామాల్లో ప్రత్యేకించి ఇసుక రవాణా కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారంటే ఏ మేరకు ఇసుకను రవాణా చేస్తున్నారో ఇట్టే తెలుస్తోంది