Shreyas Iyer: శ్రేయస్‌ వచ్చాడు కానీ..

Eenadu icon
By Sports News Desk Updated : 04 Jan 2026 03:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే ఈ నెల 11న ఈ మూడు వన్డేల సిరీస్‌ ఆరంభమయ్యే లోపు అతను ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. లేదంటే శ్రేయస్‌ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేస్తారు. మెడ గాయం వల్ల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమైన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌.. ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి అతనే ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో ఆడతాడు. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. గత నెల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతణ్ని సెలక్టర్లు పక్కన పెట్టారు.

రిషబ్‌ పంత్‌ను జట్టులోకి ఎంపిక చేస్తారా లేదా అన్న ఉత్కంఠకు కూడా సెలక్టర్లు తెరదించారు. అతడికి జట్టులో చోటిచ్చారు. వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. రిషబ్‌ పంత్‌ ప్రత్యామ్నాయ కీపర్‌గా జట్టులో ఉంటున్నాడు. కానీ అతడికి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కడం లేదు. గత ఏడాదంతా పంత్‌ ఒక్క వన్డే కూడా ఆడలేదు. టీ20 జట్టుకు పూర్తిగా దూరమైన పంత్‌.. టెస్టుల్లో మాత్రమే రెగ్యులర్‌ ఆటగాడిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్‌ అంత గొప్పగా లేనప్పటికీ ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో ప్రధాన ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యలకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. సిరాజ్‌తో పాటు పేస్‌ విభాగంలో అర్ష్‌దీప్‌ సింగ్, హర్షిత్‌ రాణా, ప్రసిద్ధ్‌ కృష్ణలకు అవకాశం దక్కింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలను పంచుకోనున్నారు. కివీస్‌తో మూడు వన్డేలు ఈ నెల 11, 14, 18 తేదీల్లో జరుగుతాయి. వడోదర, రాజ్‌కోట్, ఇందౌర్‌ ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాయి. అనంతరం 21 నుంచి అయిదు టీ20ల సిరీస్‌ జరుగుతుంది. ప్రపంచకప్‌లో తలపడే జట్టే ఈ సిరీస్‌లోనూ ఆడుతుంది.

విజయ్‌ హజారేలో అయ్యర్‌

భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 6న హిమాచల్‌ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో అతను ముంబయికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన శ్రేయస్‌.. ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఆడనున్నాడు. నవంబరులో ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ కింద పడడంతో శ్రేయస్‌ కడుపులో తీవ్ర గాయమైంది. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో రెండు రోజులు ఐసీయూలో ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. డిశ్చార్జి అయ్యాక అతను కొన్ని వారాల పాటు బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)లో ఉండి కోలుకున్నాడు.

భారత జట్టు

శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్, హర్షిత్‌ రాణా, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్‌దీప్‌ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్‌.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 02:35 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పది పరీక్షలకు వైభవ్‌ దూరం భారత అండర్‌-19 ప్రపంచకప్‌ స్టార్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
  • కోపం వదిలెయ్‌ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్‌ అనంతరం భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అక్కడ మెరుపుల్లేవ్‌ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
  • కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్‌! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 8కు దూసుకెళ్లింది.
  • పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్‌! భారత స్టార్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్‌ అనుగ్రహ పాండే. మోడల్‌ అదితి హుండియాతో ఇషాన్‌ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
  • అజ్మతుల్లా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్‌.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
  • ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్‌-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
  • అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్‌ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
  • పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
  • బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ పరాజయ ప్రభావం.. సీనియర్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజాం, షాహీన్‌ అఫ్రిదిలపై పడేలా ఉంది.
  • సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్‌-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.