gandhi talks: మౌన పోరాటం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

సినిమా ప్రపంచం అంటేనే మాటలు.. పాటలు. కానీ మాటలు లేకుండా భావాలను చెప్పొచ్చని చూపించిన ‘పుష్పక విమానం’ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఓ అద్భుతమైన ప్రయోగం. అగ్రహీరో కమల్ హాసన్ నటించిన ఈ మూకీ చిత్రం మాస్టర్ పీస్‌గా నిలిచింది. ఇప్పుడీ బాటలోనే ‘గాంధీ టాక్స్’ అనే మరో సినిమా రాబోతుంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అదితీరావ్ హైదరీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రమిది. కిశోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుందీ సినిమా. తాజాగా దీన్ని ఈ నెల 30న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘వారు మౌనంగా ప్రేమిస్తారు. మౌనంగానే పాపం చేస్తారు.. ఇబ్బందులు కూడా పడతారు’’ అనే వ్యాఖ్యను జోడించింది. నేటి సమాజంలో డబ్బు, అవసరాలు, విలువలు మనిషిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూపిస్తున్న ఈ టీజర్‌కు ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సిద్ధార్థ్ జాదవ్ కీలక పాత్ర పోషించారు. మరి పాన్ ఇండియా, భారీ బడ్జెట్లు అంటూ జోరుమీదున్న ఈ చిత్రసీమలో ఈ సినిమా ప్రయోగం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో లేదో చూడాలి.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 02:44 IST