కిక్కిరిసిన కొండగట్టు.. అంజన్నపై భక్తిని చాటుకున్న పవన్‌ కల్యాణ్‌

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 04 Jan 2026 06:54 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

తమ అభిమాన నటుడిని చూసేందుకు తరలివచ్చిన అభిమానులు.. ఇష్టపడే రాజకీయ నేతను కలిసేందుకు వచ్చిన జన సైనికులతో కొండగట్టు ఆలయ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం కొండగట్టు పుణ్యక్షేత్రానికి రావడంతో సందడి కనిపించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జగిత్యాల జిల్లాలో ఆయన పర్యటన కొనసాగింది. ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన నేతకు స్థానిక జేఎన్‌టీయూ మైదానం వద్ద రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో కొండగట్టు ఆలయానికి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. తరువాత ధర్మసత్ర భవన సముదాయంతోపాటు మాల విరమణ క్షేత్ర నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరణ, భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్బంగా పవన్‌ కల్యాణ్‌ తనకు అంజన్న పట్ల ఉన్న భక్తిని వివరించారు. కొండగట్టు అంజన్న క్షేత్రం మహిమాన్వితం అంటూ స్వామికి సేవ చేసుకోగలగడం తనకు దక్కిన భాగ్యం అని చెప్పారు. ఆలయ పరిసరాల గురించి స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ వివరించారు. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించిన తీరుతో అక్కడి పరిసరాల్లో వచ్చే మార్పులను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పవన్‌కల్యాణ్‌కు తెలియజేశారు. జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్, ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు స్థానిక సర్పంచి ఆదిరెడ్డి, సినీ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. గతంలో 2024 జూన్‌ 29న ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్‌కల్యాణ్‌ ఆలయానికి వచ్చారు. అంతకుముందు 2023 జనవరి 24న కూడా ఆయన ప్రచార రథమైన వారాహికి ఇక్కడే పూజ నిర్వహించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. మరోసారి కొండగట్టుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ అభివృద్ధి పనుల్లో భాగమైన తీరుతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల అత్యుత్సాహం!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతను చేపట్టినప్పటికీ అక్కడికి వచ్చిన భక్తులు, నాయకులపై అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. ఆలయ పరిసరాల్లోకి వచ్చే భక్తులను గంటల తరబడి నిలువరించారు. దాదాపుగా 800 మంది పోలీసులు కొండగట్టు దేవాలయం నుంచి నాచుపల్లి చౌరస్తా వద్దకు పహారా కాశారు. పర్యటన సమయానికి కొన్ని గంటల ముందు నుంచే రాకపోకలు నిలువరించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. వారి వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలను అదుపు చేసే క్రమంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారు. మరోవైపు పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానుల కేరింతలు, నినాదాలతో ఆ ప్రాంతంలో కొత్త జోష్‌ కనిపించింది. అంతే హుషారుగా జనసేన నేత వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన పోలీసులు కూడా భద్రత చర్యల్లో భాగమయ్యారు.

► Read latest Karimnagar Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 04:18 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చేశాయ్.. వైద్య పరికరాలు [ 18-02-2026] మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందేలా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రెండు ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు సమకూర్చుకునేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌ నిధుల మంజూరుకు ఉత్తర్వులిచ్చారు
  • నాడు చేజారి.. నేడు చేరువై [ 18-02-2026] అనుకున్నదొకటి అయినదొకటి అనేలా జగిత్యాల బల్దియా ఎన్నిక వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. 2020 పురపాలక ఎన్నికల్లో భారాస తరఫున గెలిచిన సమిండ్ల వాణి ఒక్క ఓటు తేడాతో ఛైర్‌పర్సన్‌ పదవిని కోల్పోయారు.
  • ధ్రువీకరణ పత్రాలు పోగొట్టుకున్నారా.. పొందండిలా [ 18-02-2026]  ఉన్నత చదువులు, ఉద్యోగ జీవితం ప్రారంభించడానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ధ్రువపత్రాలు అత్యంత ప్రధానమైనవి. పలువురు వాటిని పోగొట్టుకుని అనేక పాట్లు పడుతుంటారు.
  • దస్త్రాలు దులిపి.. సేవలు మొదలు పెట్టి [ 18-02-2026] జిల్లాలో పుర ఎన్నికల హడావుడి ముగిసింది. గత నెల రోజులుగా ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన మున్సిపల్, నగరపాలక యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఓటర్ల జాబితా  తయారీ నుంచి ఈ ప్రక్రియ మొదలు కాగా ఆ తర్వాత ఎన్నికల షెడ్యూలు రాగానే నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. అప్పటి నుంచి అధికారులు, ఉద్యోగులు పూర్తి స్థాయిలో పోలింగ్‌ ఏర్పాట్ల పనులు చేపట్టారు
  • ఉత్కంఠ వీడి.. కొలువుదీరి [ 18-02-2026] సుల్తానాబాద్‌ పురపాలికలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు మంగళవారం ఉదయం క్యాంపు నుంచి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి పురపాలక కార్యాలయానికి  చేరుకున్నారు
  • పైసలు పోయె.. పదవీ దక్కకపాయె! [ 18-02-2026] కరీంనగర్‌లోని ఓ డివిజన్‌లో నలుగురు అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు పెట్టారు. తెల్లవారితే పోలింగ్‌ అనగా ఒకరిని మించి మరొకరు ఓటుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేశారు.
  • హుస్సేన్‌మియా వాగులో ఇసుక తోడేళ్లు [ 18-02-2026]  సుల్తానాబాద్‌ ప్రజల సాగు నీటికి వరప్రదాయిని హుస్సేన్‌మియావాగు. దీని మీద ఆధారపడి ఏటా వేలాది ఎకరాలు రైతులు సాగు చేస్తుంటారు. వాగులో మోటార్ల సహాయంతో పంట పొలాలకు ఆ నీటిని వినియోగిస్తారు.
  • పులి దాడి.. మూడు పశువుల మృత్యువాత [ 18-02-2026] ఇల్లంతకుంట మండలంలో పులి సంచారం ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. సోమవారం రాత్రి పెద్దలింగాపూర్, తిప్పాపూర్‌ గ్రామాలకు చెందిన ఇద్దరు రైతుల చెందిన మూడు పశువును చంపేసింది.
  • తండ్రి చేతిలో కుమారుడి హతం [ 18-02-2026] మద్యం మత్తులో తనతో గొడవ పడిన కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన మానకొండూర్‌ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ సంజీవ్‌ కథనం ప్రకారం గ్రామానికి చెందిన పురం లక్ష్మి, కనకయ్య దంపతులకు అయిదుగురు సంతానం.